హనుమంతుని ఉపాసనను గురించి ప్రసంగించిన వృద్ధ పండితుడు ఆంజనేయుని అష్టోత్తర శత నామాలను ముచ్చటించాడు. ఆయన చిత్తశుద్ధికల ఉపాసకుడు. 108 అనే సంఖ్యకు ప్రాముఖ్య మేమిటో మీలో చాలా మందికి తెలియక పోవచ్చును. దేవతల స్తోత్రాలన్నీ 108 సంఖ్యను మించవు. 110 కాని 112 కాని, 50 కాని 60 వుండవచ్చుకదా ! అల్లా వుండక 108 వుండటానికి కారణంవుంది. అటువంటి సంఖ్యలకు సంకే తారంవుంది. మనిషి ఒక గంటలో 900 సార్లు ఊపిరి పీల్చుకుంటాడు. అంటే రోజుకు 21,600 సార్లు. పగటి వేళ 108,00 సార్లు శ్వాస తీసు కుంటాడు. అంటే ప్రతి శ్వాసలోనూ సోహం అని ఉచ్చరించుకోవాలి. కాబట్టి 216 అనే దానికి అందులో సగం 108 కి ప్రాధాన్యంవున్నది. తొమ్మిదిని పండ్రెండు సార్లు హెచ్చవేస్తే 108 అవుతుంది. బ్రహ్మ మునకు సంకేతం. ఏ సంఖ్యతో హెచ్చవేసినా దాని మొత్తం తొమ్మిదే. (9x12--108; కూడితే 1+8=9; 9x9=81; కూడితే తొమ్మిది; 12 అనేది ద్వాదశ సూర్యులను సూచించగలదు. సూర్యుడు 12 రాసులలో 12 మాసాలలో సంచరిస్తాడు.
అదే విధంగా ఈ మాయకు సంకేతం ఎనిమిదిని ఏ సంఖ్యతో హెచ్చవేసినావచ్చిన మొత్తం కూడినప్పుడు 8 కంటే తక్కువగా వుంటుంది తరిగిపోతూవుంటుంది. (2x8= 16. కూడితే 7; 3x8= 24. కూడితే 6; 4x8= 32. కూడితే 5; 5x8= 40. అంటే 4 మిగులుతున్నది. 6x8= 48 కూడి తే 12, మొత్తం 3; 8x7=56 కూడితే 11, మొత్తం 2; 8x8= 64 కూడితే 10, మిగి లేది ఒకటి) ఈ విధంగా దాని విలువ తరిగిపోతూపుంటుంది. కాబట్టి 8 మాయకు సంకేతం. ప్రతి సంఖ్యకూ ఇటువంటి గూఢార్థాలున్నవి. వీటి పరిశీలన చాలా ఆసక్తిజనకం. ఏమీలేదని ఎగతాళిగా నవ్వకుండా విచారించి అర్థంచేసుకోండి. సముద్రతీరాన నిలబడి చాలా లోతుగా వుంటుం దని భయపడి లోతుకు దిగక పోతే మీకు ముత్యాలు లభించవు. ((శ్రీ సత్య సాయి వచనా మృ తము 1963 పు 183-184)