నీ నిజతత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు. నీలో ఆవిర్భవించిన ప్రేమతత్వాన్ని పరమాత్మవైపు మరల్చు. ఇదే భక్తి యొక్క ప్రమాణము; ఇదే భక్తి యొక్క స్వరూపము. (సనాతన సారథి జ 2022 పు8 )
“భుజబలంబు గొప్ప బుద్ధిబలంబుండియు
దైవబలము లేనిచో దాసుడగును
కర్ణుడంతటివాడు కడపటి కేమయ్యె!
మరువబోకుడిటువంటి మంచిమాట”
(సనాతన సారథి, జ 2022 పు10)