దైవము వేరు, ప్రేమ వేరు కాదు. ప్రేమే దైవము. దైవమే ప్రేమ. భక్తికి ప్రేమయే గుర్తు. ఫోటోలను పెట్టి పూలమాలలు వేసి, భజనలు చేసినంత మాత్రమున అది భక్తి కానేరదు. ప్రేమతో దేవుని సేవించి, ప్రేమద్వారా ప్రేమను అందుకొని, ప్రేమస్వరూపుని దర్శించి, ప్రేమను పొందే మార్గమే భక్తి. నిజ భక్తునకు శరణాగతి తప్ప యే వాంఛయూ ఉండదు. - బాబా సనాతన సారథి, మార్చి 2022 పు20)