సర్వ సౌఖ్యంబులు చేకూర్చు ధనమన్న
ఎంత వరకది నీ చెంత నుండు
ఘనమైన పదవిని చే కూర్చు ధనమన్న
ఎంత వరకది నీ దగ్గరుండు
ఆనందమది ఏదొ అందించు ధనమన్న
ఎంత వరకది నీ స్వంత మగును
కష్టములను పోగట్టి శాంతి నిచ్చు ధనమన్న
ఎన్ని కష్టములను తీర్చినది ధనము
శాశ్వతంబైన సుఖమును కోరకుండ
ధనము ధనమంచు జీవితంబు ధారపోసి
ఏమి సాధించి నావు నీవీ జగతియందు
ఎంత వరకుందువు నీవు? మరియు జగత్తెంత వరకు?
(సత్యసారం--పద్య రూపం పు43)