భగవంతుడు మీకు రెండు చేతులు ఒక కడుపు ఇచ్చాడు. రెండు చేతులతో పని చేస్తే ఒక కడుపు నిండదా? "మనీ" కావాలంటే ఇక్కడే ఉండి సంపాదించుకోవచ్చు కదా? మీరు జన్మించిన దేశం పట్ల మీ కర్తవ్యం నిర్వహించవద్దా? మీ సేవలు అందించవద్దా?ఈనాడు అనేకమంది డబ్బులు దండిగా సంపాదించుకొని తామే enjoy "(ఎంజాయి)" చేస్తున్నారు. "ఎంజాయి" చేయడమంటే - భౌతిక సుఖాలు అనుభవించడమా? అది కాదు. End-Joy ఇది - మీరు సంపాదించవలసింది. అలాగే అంత్యంలో మీరు ఆనందాన్ని అనుభవించాలి "శాంతి - శాంతి" అని ఊరికే నోటితో ఉచ్చరిస్తే ఏమిటి ప్రయోజనం? "పీస్" (Peace) బయిటలేదు. మీలోనే ఉంది. బయిట ఉన్నదంతా (Pieces) - పీసెస్"
(దే. యు. పు.3)