"అన్ని మతాలను ఒక్కటిగా చేర్చేది. అన్ని మతాలలోను సామాన్యంగా ఉన్న గొప్ప ధనాన్ని గురించి వివరించి తెలిపేదే సాయిమతం.
(స.శి.సు.నా పు.55)
అన్ని మతములు అహింసము, ప్రేమను బోధించును. సాయి మతము సర్వమత సామరస్యమును బోధించును. అందువలన ఎట్టి భేదభావము పెట్టుకొనక అందరితోను కలసి పని చేయవలెను. నీలో ప్రేమ వున్న నిన్నందరూ గౌరవించెదరు. లోక సంరక్షణార్ధమే నేను వచ్చినది.మీరందరూ పరస్పరానురాగముతో జీవించిన యెట్టి కలతలు వుండవు. అట్టి ప్రవర్తన యే నాకు ఆనందము కలిగించును.
(స.శి.సు.తృపు.133)