అంతా సాయిమయం, జగమంతా సాయి మయం అని మీరు భజన కీర్తనలు పాడుతున్నారు కదా! మరి ఈ సాయి ఒక్కడి మీదనే మీకు ప్రేమ ఎట్లా ఉంటుంది? భజన హాలులో స్వామి పటాలు చాలా ఉంటాయి. "ఈ పటము బాగా లేదు" అని ఎవరైనా అంటే వాళ్ళమీద మీకు కోపం వస్తుంది. అనగా, ప్రతి పటమూ నేనేనని భావించి మీరు గౌరవిస్తున్నారు. పటము ముందు నిలబడి ఆనందంతో "స్వామీ!" అని సంబోధిస్తున్నారు. అదేవిధంగా ప్రతి మనిషీ నా పటమే. ప్రతి జీవి నేను. అంతా సాయి మయం కదా! కనుక, మీరు ఎవరినైనా కఠినంగా చూస్తే నన్ను కఠినంగా చూపినట్లే ఎవరినైనా అవమానిస్తే నన్ను అవమానించినట్లే..
(శ్రీ భ.ఉ. పు.158)