నీవు భగవద్గీత గాని, ఉపనిషత్తులు గాని పఠించ నవసరము లేదు. నీ హృదయమునందాతడు సారధిగా ప్రతిష్ఠింపబడి యున్నాడు.గాన ఆవేదనతో పిలిచిన భగవంతుడు నీకు కూడ ప్రత్యేకమైన "గీత”ను వినిపించును. నీవు అడిగిన అతడిచ్చును. జప ధ్యానములకు కూర్చొనినపుడు నీ కిష్టమైన ఏదో ఒక రూపమును మనస్సు నందుంచు కొనుము. ఆ నామమును స్మరించుము. ఏ రూపము నీముందు లేనపుడు నీకు సమాధాన మిచ్చు వారెవరు? నీలో నీవే ఎల్లప్పుడూ మాట్లాడుకోలేవుగదా! నీవు ధ్యానించు రూపము తప్పక ని ప్రార్థన లాలకించుము. ...
(స. సా.న.78 పు.206)