సర్వభారములూ పరమాత్ముని మీద వేసి మీ తలమీద బరువు తగ్గించుకోవాలి. అన్నింటిని ఆయన సంకల్పమునకు శాసనమునకూ వదిలివేస్తే మీకు దుఃఖం మరి వుండదు. సత్సంగం సత్రవర్తన, సర్వేశ్వర చింతనములనే మధురమైన ఆహారంతో మనస్సులు నింపుకోండి. అప్పుడు ఆనంద పరిపూర్ణులు కాగలరు. నేను ఆనంద స్వరూపుడను. ఆనందం అందుకోవాలని ప్రార్థనలు చేయండి. ఆనందం మీద మీ దృష్టి నిలిపి సంపూర్ణమైన శాంతిని అనుభవించండి.
(వ.1963పు. 196)