రామయణములో వేయిశ్లోకములకొక అక్షరముగా గాయత్రి మంత్రము ఇమిడి యున్నదనియూ, వేదపాఠమేఅది అనియూ, రామాయణము కూడ, గానము చేసిన వాళ్లను ‘త్రాయతి’ (తరిపంజేయును) అని చెప్పిరి. స (బ్రహ్మతత్వము) ఈ (సృష్టితత్వము) త (ప్రీతి సూచికము) ఆ (సంహార సూచకము) - ఈ నాలుగు చేరి సీతా అనే పదమయినది;సీతా అనే పదమునకు ప్రకృతిలో సృష్టి - సంహారములు గావించు బ్రహ్మ శక్తి అనేదే అంతరార్థము, సీతా - భూజాతా మాత్రము కాదు, సృష్టిసంహారములు గావించు పరాశక్తి. శిష్టపరిపాలన, దుష్టసంహారం - ఈరెండూ సీతవలనే జరిగినవి.దానికే రామాయణమును సీతాయాశ్చరితం మహత్ అని పెద్దలు కొనియాడిరి. సుందరకాండ అని ఆకాండమునకు పేరు రావటమునకు కూడ సీతనే కారణము. లంకలో రావణుడుమొదలుకొని, అందరూ వికారరూపులు వికార స్వభావులు వికార బుద్ధులే! అట్టి వికార భూయిష్టమైన లంకలో సుందర రూపు స్వభావము బుద్ధిగల సీత చేరి, వారిని పరిశుద్ధముచేసిన వివరములు ఈ కాండములో ఉన్నవి. దానికే సందురకాండమని పేరు..
(స.సా.శ.73 పు.274)