జీవితంలో కేవలం సుఖం మాత్రమే ఉండాలని ఆశించరాదు. "నసుఖాత్ లభ్యతే సుఖమ్". సుఖము నుండి సుఖము రాదు. దుఃఖమునుండే సుఖము ప్రాప్తిస్తుంది.
(స.సా.మా.96పు.37)
ప్రతి ప్రాణి ప్రపంచములో సుఖమునే కోరును. దుఃఖము కోరదు. వాస్తముమైన సుఖము ఏమిటో తెలిసిన వారు, తెలిసికొన్న వారు చాలా అరుదు. సుఖము మూడు రకములుగా యున్నది. ఆరంభమున విషయమువలె యుండి, విపాకమునందు అమృతమువలె యుండును. ఇది ఆత్మ బుద్ధిచేత లభించు సుఖము, యోగవాష్ఠములో, ఓరామా! మహాసముద్రమునైనా తేలికగా పానము చేయవచ్చును. మేరు పర్వమునైనా తేలికగా ఊడపెరకవచ్చును. అగ్నిని అనాయాసంగా భుజించవచ్చును. కాని మనో నిగ్రహమును గాంచితిమా అదే అమృతత్వము. అట్టి అమృతత్వమును పొందుటకు పూర్వము అతి శ్రమయనక మనో నిగ్రహమునకై ప్రయత్నించుట ప్రధాన సుఖము. విపాకముగా నిర్వికల్ప సమాధిలో లభించు సుఖము వర్ణనాతీతము. ఇది అమృతముతో సమానము. నిర్వికల్పమనగా సంకల్పరహిత స్థితియే. వికల్పము లేనిది నిర్వికల్పము. దీనిని సాధనచే సాధింపవచ్చును. నిర్వికల్ప సమాధి రెండు విధములు. ఒకటి అద్వైత భావ రూపము. రెండవ ద్వైతావస్థ రూపము. దీనినే నిర్వికల్ప సమాధి అంటారు. దీనిని సాత్విక సుఖము అని కూడా అంటారు. "నసుఖాలభ్యతే సుఖం", సుఖము నుండి సుఖము చిక్కదు. కష్టములోనే సుఖమున్నది. అన్న సత్యాన్ని గుర్తించాలి.
(సా. పు.252)
(చూ కష్టం, నరుడు, పద్నాలుగులోకములు, శాంతము)