తథాకృతం దేవ! యదైవకారితం
తథామతం దేవ యథైవజ్ఞాపితం
తథోదితం దేవ యథైవ వాదితం
సమాప్తమ త్త్ర్వెవవిభో దినవ్రతం||
సుషుపై వాయు యాస్మాం తద్ దేవ త్వాం ప్రార్థయామహే!
త్వమత్సంగః ప్రభో! ఏకం చిరశాంతి సుఖాస్పదమ్ ||
ఓం శాంతి శ్శాంతి శాంతి:
అర్థము: నేను యింతవరకు నీవు చేయించిన పనులను చేసినాను. నీవు ప్రేరేపించిన తలంపులనే తలచినాను. నీవు మాట్లాడించిన మాటలనే పలికినాను. నేను నడచిన నడకలు, పలికిన పలుకులు,తలంచిన తలంపులు అన్నియు నీవే నడిపించి, చేయించి తలపించినవి. ఈ దినమున నిత్యవ్రతము సమాప్తి అయినది. నన్ను యింక నిద్రలోనికి తీసుకో, పరమాత్మా నాకు చిరశాంతి చిరసుఖములను ప్రసాదించేది నీ యొడి ఒక్కటే.
(భ.శ్రీ ససా.పూ.వి.పు.91)