బాలకృష్ణుని నడుము చుట్టూ తాడు బిగించి - తనవైపు లాగుకోదలచినపుడు యశోద కనుగొనలేకపోయింది. ఆత్రాడు అహంకారం - భగవంతుని అహంకారపు త్రాడుతో బంధించ గలరా? ఎన్నిసార్లు కట్టడానికి తల పెట్టినప్పటికీ రెండు జానలూ తక్కువైంది తాడు. ఆరెండు జానలూ - ధర్మనిష్ట - బ్రహ్మనిష్ట అనే రెండు సుగుణాలు. అవి కూడా చేరినప్పుడే తాడు సరిపోగలదు.
(త.శ.మ.పు. 156)
శాస్త్ర ప్రమాణము ననునుసరించి, ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, శక్తి, పరాక్రమము అను ఆరు సుగుణములును ఉండుచోట సాక్షాత్ భగవానుడయి వసించును. ఇట్టి గుణములను ప్రభోదించుటే, గణపతి పూజ అనగా ప్రారంభము. పిరికిపందలకు ఆధ్యాత్మ క్షేత్రమున చోటే లేదు. దుర్జములు దృఢ విశ్వాసము లేనివారు, సందేహస్తులు యేడుపుముఖము వారు, వైద్యులకు శిష్యులుగా వుండవలసినవారే కానీ యోగులెన్నటికీ కానేరరు. జ్ఞానికి అజ్ఞానికి ఇదే భేదము. "ప్రవాసన్నివ” కృష్ణుడు ఆనందాతిరేకములలో నవ్వుచూ పలుకుట, అర్జునుడు దు:ఖాకులుడై వినుట, జ్ఞాని యెల్లపుడును నవ్వుతాడు, అజ్ఞాని యేడుస్తూ వుండును.
(స.వా.పు. 163)
(చూః శిష్యుడు, హెచ్చరించుకోండి)