కన్యాకుమారి మొదలగు కాశ్మీరువరకు, ఉత్తర దక్షిణ తూర్పు పడమర సముద్రముల తీరముల వరకుగల క్షేత్రములను మూడు నాలుగు మాసములు సంచారము సలిపి, మధ్య మధ్య ఆయా రాజ్యములందుగల కొన్ని ప్రజా అననుకూలములను, యాత్రికుల అననుకూలము లను గుర్తించి, మంత్రితో చెప్పి వాటిని సరిచేయించుచు, దైవ మందిరములకు తగిన యేర్పాట్లు భద్రతలు కల్పించుచు అనేక విధముల యాత్రికులకు నీటి వసతులు, వృక్షాచ్చాయలను, చలివేద్రలను, సత్రములను ఆరోగ్య కేంద్రములను నిమించమని రాముడు తెలుపగా రామాభీష్టములకు అడ్డుచెప్పక కోరిన వాటినన్నింటిని అతి శీఘ్రములోనే చేయించుచూ వచ్చుచున్న సుమంతుని చూచి, పిల్లలు తమలో తాము ఆనందించుచూ, మన మంత్రివంటి మంత్రులు లోకమున వుండిన, లోకక్షేమము నకు కొదువ రాదని ఒకరికొకరు గుసగుసలాడేవారు.
(రా.వా.మొ. పు.48)