మానవ మర్యాదలు కాని, పేరు ప్రతిష్ఠలు కానీ అగౌరవ అపకీర్తులు కాని, దుశ్శీల దుర్గుణములు కానీ, స్త్రీలకు పురుషులకూ సమానములే.
స్త్రీలు మాత్రమే నిబంధనకు బద్దులనియు, పురుషులు స్వతంత్రులనియు లేదు. స్త్రీలైనను, పురుషులైనను ధర్మముల పాటించవలెను. స్త్రీలు పురుషుల చేతి కీలు బొమ్మలు కాదు. ధర్మకర్మలయందు ఇద్దరూ సమాన హక్కుకలవారే, దర్మాచరణల యందు, ఇద్దరూ, శాంతి, సత్య, ప్రేమ, అహింసలము పాటించ వలెను. ఈ నాలుగు పవిత్రపద భావములను పాటించక, ప్రవర్తించిన, ధర్మరహితులగుదురు. స్త్రీ లెట్లు కొన్నింటి యందు అస్వతంత్రులో, పురుషులు కూడనూ అట్లే కొన్నింటి యందధికారములేదు. ఇవి పతిపతుల ప్రమాణ నిబంధనలలో కొన్ని.
(ధ.పు.50)