పాండవులకు నాకు ఉన్న సన్నిహిత సంబంధ బాంధవ్యము నేను చెప్తున్నాను. ఎవరు నన్ను ఆశ్రయిస్తారో, ఎవరు నన్ను సరియైన మార్గములో ఎన్నుకుంటారో, ఎవరు నాకు శరణాగతి అవుతారో వారిని నేను ఆదరించక తప్పదు. ఒకానొక సమయములో నారదుడు అడిగాడు. నారాయణా! నీవు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు. నీకు Branch offices లు చాలా ఉన్నాయి. నీ సరియైన అడ్రసు నాకివ్వమన్నాడు. ఇది నా అడ్రసు అన్నాను. ‘మద్భక్తాయత్ర గాయంతి తత్ర తిష్టామి నారదా’ఎవరు తమ హృదయములందు నన్ను పరిపూర్ణమైన ప్రేమతో చింతిస్తుంటారో అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను. ఇది Branch office కాదు. హెడ్ ఆఫీసే. పాండవులకు నాకు ఉన్న సంబంధము నీకు చెప్తున్నాను వినుమన్నాడు. ఇది దేహము దీనికి రెండు కాళ్ళు ఉన్నాయి. కడుపొకటి ఉంటుండాది, భుజములు రెండు ఉన్నాయి. ఒక తల ఉంటుండాది. ఇవన్నీ చేరితేనే దేహము. ధర్మజుడు శిరస్సు, అర్జునుడు భుజములు, భీముడు కడుపు, నకుల సహదేవులు కాళ్ళు, ఈ దేహములో కృష్ణుడు గుండె వంటివాడు. ఈ గుండె లేకపోతే దేహము లేదు. దేహము లేకపోతే గుండె కనిపించదు. కనుక పాండవులకునాకు ఉన్న సన్నిహిత సంబంధ బాంధవ్యమిది అన్నాడు. అదే విధముగనే దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ అన్నింటితోపాటు చేరుకున్నదే ఆత్మ. ఇవన్నీ కలిసినదే ఒక రూపము. ‘ఏకం సత్" ఉన్నది ఒక్కటే. "
(బృత్ర.పు.67)