ఈనాడు సైంటిస్టులు చాలా క్రొత్త విషయాలను కనుగొంటున్నారు. కాని మానవత్వమందున్న దివ్యశక్తిని వారు తెలుసుకొనలేక పోతున్నారు. కారణమేమిటి? ఇది సైన్సు చెప్పదు. దైవశక్తి ఇట్టిదీ, అట్టిదీ అని ఎవరూ చెప్పలేరు. విజ్ఞానమునకు, ఆధ్యాత్మికమునకు ప్రధానభేదమేమిటంటే, బాహ్యమైన జగత్తును సైన్సు పరిశీలన చేస్తుంది. అంత: సంబంధమైన దివ్యతతత్వాన్ని ఆధ్యాత్మికము పరిశీలన చేస్తుంది. బహిర్ దృష్టి కలవాడు Scientist అంతర్ దృష్టికలవాడు Saint, సృష్టిని పరిశీలన చేసేవాడు Scientist సృష్టికర్తను పరిశీలించేవాడు Saint. వీరిద్దరికీ ఎంతో తేడా ఉన్నది. సైంటిస్టు సృష్టిని మాత్రమే పరిశీలన చేస్తున్నాడు. కాని సృష్టికర్తను పరిశీలిస్తే, సృష్టి అంతా బాగా అర్థమవుతుంది. ఈనాడు సైంటిస్టులుప్రేమతత్వాన్ని విభజించి, పదార్థ తత్వాన్ని మాత్రమే ప్రకటిస్తున్నారు. Splitting of Love is Science, Spirit of Love is Spirituality.
(శ్రీజ.97 పు.53)
(చూ|| అజ్ఞానం, అహింస, విజ్ఞానశాస్త్రము)