సేవాదళసభ్యులు తమ విశ్రాంతి సమయమును సత్ సంగములో గడపవలెను: అన్యధావృథా చేయరాదు. సద్గ్రంథములనుండి చదువు రానివారికి చదివి చెప్పండి. మన సంస్కృతిని గురించి తెలిసికొను అవకాశము లేనివారికి దానిని గురించి తెలుపండి. గ్రామములలో, పాకలలో, మురికివాడలలో నివసించువారికి సహాయము చేయండి. నగరవాసులు పిచ్చి పిచ్చి కథలు నవలలు చదివి, వారి మనస్సులను బుద్ధిని పాడుచేసుకొను చున్నారు. కానీ, గ్రామీణులు. బీదలు మీరు చెప్పు కథలు, మహాపురుషుల జీవితములు, అవతార పురుషుల జన్మవృత్తాంతములు ఆసక్తితో ఆలకించుతారు. వీరికి అన్ని మతములను గురించి అందరు మహార్షులను గురించి చెప్పండి. సాయిని గురించి, సత్యసాయి సందేశమును గురించి ప్రచారము చేయుట మాత్రమే మీ పనిగా భావించవద్దు.
కానీ యీ నామసందేహముల ద్వారా ప్రతి వారిలో దైవభక్తి దైవమునందు విశ్వాసము కలిగించండి. వారిలో ఆధ్యాత్మిక చింతనను కలిగించి వృద్ధి చేయండి. వారు ఏ నామరూపములను పూజించి నప్పటికి ఫరవాలేదు. వారికిష్టమైన రూపనామముల ద్వారా, వారిని భక్తి, సాధన మార్గములో నిలపండి.
(స. సా.మా.75 పు.13)
(చూ॥ బ్రహ్మర్షి)