అనసూయ తన పతిభక్తిని. ధర్మమును అనేక విధముల సీతకు తెలుపుతూ ఆమె ఆదేశములనుఅందించుమని ప్రార్థించుచూ, సీత యొక్క గుణగణములను వేనోళ్ళ కొనియాడెను. సీత లోకమున జన్మించిన ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి భూతము స్త్రీ తత్వము కలవారనియూ, జగన్నాటక రంగమునకు స్త్రీ పురుషులుగా కనిపించిననూ బలతత్వాలలో, భావరాగాలలో, కష్టసుఖాలలో అందరూ స్త్రీ లేననియు, తన భర్తయైన రాము డొక్కడే పురుషుడనియు, ఆయన యందు ద్వంద్వభావములు యేనాటికి లేవు, రావు అనియు, అతడు అభయ స్వరూపుడనియు, ప్రకృతికే పురుషుడై ప్రకృతిని వరించివాడనియు వివిధ నామరూపములతో గోచరించెడి ఈ జగత్తు యేకాత్మ స్వరూపమేననియూ అనసూయ రామ తత్వమును చక్కగా ఉపదేశించెను.
(రా.వా.రె.పు.2/3)
శ్రీరామచంద్రుని జీవితములో ప్రప్రథమములో తన యొక్క పండెండ్రు వర్షములలో మూడు విధములైనటు వంటి స్త్రీ తత్వములు తటస్థపడినవి. తాను యాగ సంరక్షణార్థమై విశ్వామిత్రునితో ప్రయాణమై వెళ్ళు చున్నప్పుడు "తాటకి" అనే స్త్రీ తటస్థపడినది. ఆ తాటకిని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా హతమార్చినాడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ జరిగిన తరువార మిథిలాపురమునకు వెళ్ళే సమయము లోపల "రాయి" గా మారిన అహల్య తటస్థించినది. ఆమెకు జీవితము కలిగించి, ఆమె యొక్క దోషములను పశ్చాత్తాపముచే పరిహారంగావించి ఆమెను పతిని చేర్చి వెళ్ళినాడు. మీథిలాపురము చేరిన తరువాత సీత తటస్తించినది. ఆమెను ఎట్టి విచారణ చేయక అనుగ్రహంతో స్వీకరించి నాడు. దీనియొక్క అంతరార్థమేమిటి? బాల్యమునందేయువకుడిగా ఉండినప్పుడే ఈ విధమైన సాధనను ఆదర్శప్రాయుడిగా లోకానికి అందించి నటువంటి మూర్తి శ్రీరామ చంద్రమూర్తి.
శ్రీరామునికి మొట్టమెదట తటస్థపడినటువంటి తాటకి" తమోగుణము. తమోగుణమును హతమార్చినాడు.ఇంక రాయిగా మారినటువంటి "అహల్య" రజోగుణమును రజోగుణమునకు బుద్ధినేర్పి ఆమె స్వస్థానమునకుఅందించి, సంరక్షణగా అమె దోషమును పరిహారము గావించి వెళ్ళివాడు.సాత్యికమైనటువంటి సీతను తాను అను గ్రహించినాడు. భగవంతుడు ఆశించేది, కోరేది, అనుగ్రహించేది సాత్యకమే. ఆసాత్వికాన్నే అభిలషిస్తాడు. దానినే పోషిస్తాడు. ఆట్లు కానివాడు, ఒక్కొక్కరి యందు, ఒక్కొక్క గుణము ప్రసరిస్తూ వస్తుంది. తాటకి తమో గుణము ఆహల్య రజోగుణము - సీత సాత్వికము.
(స.సా.జూ..1989 పు.143/144)