తల్లితండ్రులును. సోదరులును, సోదరీమణులును, అత్తమామలును, సుతులును, గురువులును, బంధువు లను వీరందరూ సకలగుణసంపన్నులయిననూ - సతికి సుఖము నిచ్చువాడు పతియే; పతితప్ప అన్యగతి వుండదు. నాథా! తనువును, ధనమును, గృహమును, పురమును, రాజ్యమును ఇవి పతి దూరమైన సతికి దు:ఖమునే ఇచ్చునుగాని ఆనందమును అందించలేవు. పతిలేని భోగములు రోగమును బోలినవే..
(రావా.మొ.పు.242)
సీతాదేవి దశరథుని పాదములకు నమస్కరించి, "మామా! నా మనసు రామ సేవనే ఆశించుచున్నది. అట్టి సేవాభాగ్యము అరణ్యమున నాకు అమితముగా లభించును. అట్టి ఘనఫలమును వీడి నేనుండలేను. సతికి, అత్తమామల సేవలూ తల్లిదండ్రులు సేవలూ అంత సంతృప్తిని అందించవు. పతిసేవకు మించిన ఆనందము, సుఖము యందునూ చిక్కదు. మీరు అడ్డుచెప్పక ఆశీర్వదించి నన్ను రామచంద్రునిలో పంపుడని ప్రార్థించిన సీత వాంఛను అర్ధము చేసుకొని, దశరథుడు సీత యొక్క గుణములను నానావిధముల వర్ణించి కైకకు తెలిపెను.
(రా.వా.మొ.పు.247)
వాలి భార్య అయిన తార వచ్చి వాలి కళేబరము పైబడి " నాథా! యెన్సియో విధముల నేను హితమును బోధించిననూ వినకపోతివి గదా, పతికి యే సతియైనను హితమును లక్ష్యమందుంచుకొనే బోధించును కదా. పతికంటే సతికి హితమైనవారు మరొకరుందరు కదా! యే మహనీయులైనను కొంత స్వార్థమునైననూ లక్ష్యమందుంచుకొని హితము చేయుదురు. సతి అట్లుకాదు కదా పతి క్షేమమునే లక్ష్యముందుంచుకుని చేయును కదా! అయ్యో నాథా! విధికృతమువలన నా బోధనలు నీ మనస్సుకు పట్టలేదు.
(రా.వా.రె.పు.80/81)