ఈ వైద్య విధానములో నేను డాక్టర్ను కాదు. కానీ, మీరందరూ డాక్టర్లే. కనుక, ఈ విషయాన్ని మీరు చక్కగాయోచించాలి. నేడు ఎవరికివారు తమ స్వార్థాన్ని పురస్కరించుకొని ఈ Subject లో Specializations చేస్తున్నారు. ఉన్నది ఒకే గుండె కాని, దీనిలో వంద Specializations ఉంటున్నాయి. ఒకరు చిన్న Valves మీద, మరొకరు పెద్ద Valves మీద, ఇంకొకరు cells మీద - ఈ విధముగా ఒక్కొక్కరు ఒక్కొక్క దానిపై Specialization చేస్తున్నారు. కానీ, వారిద్దేశ్యమేమిటంటే - ఈ స్పెషలైజేషన్లతో గెండెను ముక్కలు ముక్కలు చేయకుండా, గుండె నంతటిని ఒక్కటిగా స్పెషలైజ్ చేయాలి. నీవు కేవలం Cells గురించి మాత్రమే స్పెషలైజ్ చేసి యున్నావనుకో -ఎవరైనా నీ వద్దకు వచ్చి గుండె Valves పనిచేయటం లేదంటే - అతనిని నీవే ఇంకొక డాక్టరు వద్దకు పంపించాలి. నీవే డాక్టరైయుండి నీ దగ్గరకు వచ్చిన వారిని వేరొక డాక్టరు వద్దకు పంపడం అవమానకరం కాదా? కనుక, నీవు గుండెనంతటినీ స్పెషలైజ్ చేసి అన్ని చేతిలో పెట్టుకోవాలి. ఏజబ్బు నై నా నివారణ చేయడానికి పూనుకోవాలి. ఈ స్పెషలేజేషన్ అనేది జగత్తుకే చాలా చెడుపు చేస్తున్నది. కనుక, స్పెషలైజేషన్ అనేది ఉండకూడదు. అన్నింటియందు మనము ఆరితేరాలి.
(స. సా..మా.93 పు.63)