"నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం
స్మరణా చ్చింతనాదేవ, ప్రాప్తాహి పరమా గతిః"
(ఆ.రా.పు.7)
స్మరణ చింతన రెండూ ఒకటికాదు. ఒక నామాన్ని జపించటం స్మరణ. అనుభవించిన దానిని మరల జ్ఞప్తికి తెచ్చుకోవటం, మననం చేయటం చింతన. రామ రామ అనో కృష్ణ కృష్ణ అనో అంటుంటే అది స్మరణ. రాముని కృష్ణుని లీలలను వారు చేసిన కార్యములను తలచుకోవటం చింతన. అయితే స్మరణలో అనేక నామములుండ కూడదు. ఒకే నామం ఉండాలి.
(స.సా.డి.86పు 317)