ప్రేమయే మానవునకు స్వభావము. మానవుడు ప్రేమలేక ఒక నిమిషమైననూ నిలువలేడు. ఇంతవరకూ ప్రేమించుచుండిన చెడు గుణములనబడు కామక్రోధ మోహాదులు మానవుని హృదయము వీడిపోగానే ప్రేమ వంటరిగా నుండనొల్లక, వంటరితనమును సహించలేక, హృదయ పీఠముపై స్థానము నేర్పరచుకొని యుండిన, నిర్మల, నిస్వార్థ స్వరూపుడగు నీల నీరద విగ్రహుడైన మదనమోహనుని ప్రేమించుటకు ప్రయత్నించును; ప్రాకులాడును. వేరొకరికి అందులో స్థానములేదు కనుక, ఇంకొకరు చేరుటకు వీలుకానందున, విధిలేక పరమాత్మప్రేమయే క్రమముగ గాఢమై, నిర్మలమై నిస్స్యార్థమై సర్వసంగ పరిత్యాగ స్థితిని పొంది, సాయుజ్యమును సాధించును.
(భా.వా.పు.7/8)
(చూ॥ ఆనందము, నేను)