ఈ మానవాకారాన్ని దాని శక్తి సామర్థ్యాలన్నింటితోపాటుగా మీరు ఏ కార్యం కోసం సంపాదించుకొన్నారో బాగా తెలిసి కొన్నప్పుడు స్వయం సేవకులుగా మీ విధిని సక్రమంగా నిర్వహించ గలుగుతారు. ప్రేమలోనే పెరిగి ప్రేమను బలపరచుకొని, చివరకు కలసిపోవడమే ఆ కార్యం’! మీరు ప్రేమగా, ప్రేమతో. ప్రేమక కొరకు మీ జీవితమంతా గడపాలి. అంటే, ఆ ప్రేమను మీ నుండి ఆకర్షించుకొనే వారికి చేసే సేవ రూపంలో ప్రేమ ప్రకటనవుతుంది. ఈప్రేమాకర్షణ, ప్రేమను పెంపొందించుకోడానికి ప్రగాఢం చేసుకోడానికి తోడ్పడుతుంది. ఆ ప్రేమకు కాలువలు తీసిపారించి హృదయ క్షేత్రానికి నీరు పెట్టేందుకు ఆధ్యాత్మిక క్రమశిక్షణను రూపొందించుకోవాలి. లేకుంటే, హృదయ క్షేత్రం ఎండిపోతుంది."
(లో.పు. 153/154)