ఈనాడు మీరింత దగ్గరగా కూర్చున్నారుగాని కొంత కాలానికి కొన్ని మైళ్ళ నుండి స్వామిని చూడవలసి వస్తుంది. ఐతే స్వామి దయ ఉన్నప్పుడు ఎక్కడున్నా మీరు స్వామివారే అవుతారు, ఎల్లప్పుడు స్వామి మీ వెంటనే ఉంటాడు. కనుక స్వామి మీకు దూరమౌతాడనే భ్రాంతికి అవకాశ మివ్వకండి.
(స.సా,ఫి.99పు.35)