మకరము తిరుగాడు మడుగులో దిగవచ్చు
పాము పుట్టల పైన పరుండవచ్చు
పులులు సంచరించు పొదల తిరుగవచ్చు
నట్టేట యిల్లు కట్టవచ్చు.
మద గజెములతో మసలవచ్చు.
కొండలన్నియు చేర్చి పిండి కొట్టవచ్చు
అయ్యోట తలదూర్చి ఆనవచ్చు
గాలిలో లీనమై తిరుగాడవచ్చు
చుక్కలను లెక్క గొనవచ్చు
సుంతయేని దైవలీల కమగొనలేరు.
సత్యమైనమాట సాయిమాట!
(బ. పు. 57)
(చూ|| దివ్య ప్రకటనలు)