హృదయమును వీడి దుర్గుణములు యెప్పుడు కదలి పోవునో అపుడు వాటికి పరివారముగా అనుసరించిన దుర్వాసనలు కూడనూ వాటితోపాటు గూడూగుడారములుయెత్తివేసి ఉత్తచేతులతో పత్తా లేకుండా పారిపోపుదురు. అపుడు మానవుడు తన నిజస్వరూప స్వభావములైన సాయుజ్యమును పొందును: మాయను వీడును; మనసును బాయును. మర్మము నెరుగును; మాధవత్వమును గాంచును.
(భా. వా. పు.7)