నిగమములు హరించి నిండు దూషణచేసి ,
సోమకాసురుడేమి సుఖము నొందె
పరసతి నాసించి పది తలలవాడేమి!
పట్టుకుపోయెను గట్టిగాను,
ఇల సూది మొనమెప ఇయ్యజాలనటన్న
దుర్యోధనుడేమి దోచుకొనియె:
పసి పాపలను కూడ పసికట్టి చంపిన !
కంసుడే పాటి కాచుకొనియె॥
నేటి దుర్మార్గులకు కూడ యిదియె గతి |
సత్యమును తెల్పుమాట ఈ సాయి మాట!
(సా ॥ పు. 526)
(చూ: తల్లి, దుష్ప్రచారములు, మోహము)