సారములేని యట్టి, భగసాగరమందున మునిగితేలుచున్
దారియు, తెన్నునుగనక, తత్తర మందెడు మానవుండా
యోరిమి యించుకంత, మది మానుచు, భక్తిని కొల్తువేని,
శ్రీ కారుడు, సత్యసాయి, నిను కావగ, వచ్చిన నావ కాంచవే.
(సా.పు.319)
స్వామి మాట సకల సౌభాగ్యములమూట,
స్వామి దృష్టి పారిజాత వృష్టి!
స్వామిచేయి తల్లి ప్రేమలోని హాయి!
సాయికాదు ఒతల్లి హాయి!
వేయితల్లుల ప్రేమలోని హాయి.
అట్టి ప్రేమసాయి సత్యసాయి.
(సా.పు 532)
నేను మీ ప్రక్కనే యున్నాను.మీలో యున్నాను. మీ హృదయంలో యున్నాను. నేను మీకు సహాయం చేస్తాను. మీకు దారిచూపుతాను. భగవంతుని వైపుకు దారి మళ్చించండి. అదే మీరు చేయాలి. మీరు నా దగ్గరకు రావాలి. మీరు నాతో ఏకం కావాలి. ప్రతి అణువులోని భగవంతుని చూడాలి. భగవత్ప్రేమను అందిరిలోను దర్శించాలి. ఆ ప్రేమను అనుభవించాలి. నేనే ప్రేమ స్వరూపుడను.
(సా..పు.497)
"వ్యక్తులు కష్టాలు తొలగించి వ్యాధులు నివారించి ఓదార్చటమే నా లక్ష్యం అనుకోవద్దు. అంతకంటే ముఖ్యమైన ఉద్దేశ్యం వేరొకటి ఉన్నది. మామిడి పళ్ళను అందించడమే మామిడి చెట్టు యొక్క ముఖ్య ప్రయోజనం. దాని ఆకులు, కొమ్మలు, మ్రాను వేరు వేరు ప్రయోజనాలను కలిగి యుండవచ్చు. కానీ, ఫలమే దాని ప్రధాన ప్రయోజనం. వ్యక్తుల దుఃఖములను ఉపశమింపచేయడం నా ఉద్యమంలో అనుషంగికమైన అంశం మాత్రమే...! భారతవర్ష హృదయంలో వేదశాస్త్రాలను పునః ప్రతిష్ట చేసి ప్రజలలో వాటి పట్ల అభినవేశం కలిగించడమే - నా ప్రధాన లక్ష్యం! ఈ ఉద్యమం విజయవంతం కాగలదు. దీనికి ఏ ఆటంకాలూ అడ్డురాలేవు. ఎటువంటి అవరోధాలూ ఉండవు. ఇది దైవ నిర్ణయం, ఇది దైవ సంకల్పం.
(ప్రే.బ.పు.45)
ఆనందము భగవంతుని దగ్గర ఉన్నప్పుడు ఎందుకు
నీవు బయట వెతుకుతున్నావు? ఆనందమయుడైన
భగవంతుని దూరం చేసుకోటం ఎంత దురదృష్టం!
చిక్కిన సాయిని వక్కచేయక చక్క చేసుకోండి
పోయిన చిక్కడు పర్తీశుని పాదసేవ యండి.
భక్తిని ఇచ్చి శక్తిని పెంచి ముక్తి జేర్చునండి
ఇతరుల మాటలు ఇంపుగ నమ్మి కొంపతీయకండి.
(ద.స.98 పు.97)
అభిల మానవులకు ఆనందమొనగూర్చి
రక్షించుటొక్కటే దీక్ష నాకు
సన్మార్గమును వీడి చరియించువారల
చేపట్టి కాపాడుటే వ్రతము నాకు
బీదసాదలకైనను పెను బార తొలగించి
లేమిని బాపుటే ప్రేమ నాకు
మంచి చెడ్డలు కూడ మనసులో సమముగా
భావించుచుండుటే భక్తినాకు"
నియమ నిష్టలతోడ నను గొల్చు వారిని
కాపాడుచుండుటే ఘనత నాకు
ఆశ్రితావను డీతడె ఆప్తబంధు
అనగ బేరొంది నాయండ నలరు వారి
నెన్నడును మరువని వాడ న న్నమాట
నెట్టి కుచితము మదిని నే నేర్పకుందు
అట్టి నా పేరు చెడుట ఎట్లగును భువిని?
(సుబొథపు.1)
"ప్రపంచములోని ప్రతి ఒక్కరూ తమకిష్టమైన ఏదో ఒక మతాన్ని అనుసరించవచ్చు. కాని, వివిధ మతములను, మత విశ్వాసములను అనుసరించే ప్రజలందరికీ సంపదను, సంక్షేమమును ప్రసాదించి బ్రోచే రూప, నామములు లేని సృష్టికర్త ఒక్కడే, "మతము" అనే పదమునకు “సాధన అని ఒక అర్థమున్నది. ఎవరు ఏమతమును అనుసరించినా దివ్యత్వసాధన అనేది ఒక్కటే కాబట్టి మతములన్నీ ఒక్కటేనని, నిజానికి ఉన్నది ఒక్కటే మతము అని తెలుస్తుంది. నా పేరు సత్యసాయి. అనగా, సత్యముపై పవ్వళించేవాడు అని అర్ధము. ఏ మతమును తొలగించడానికి గాని, లేక నిర్మూలించడానికి గాని నేను రాలేదు. క్రైస్తవ మతాన్ని అనుసరించే వ్యక్తి మరింత ఉత్తమమైన క్రైస్రవునిగా, హిందూ మతమును అనుసరించే వ్యక్తి మరింత ఉత్తమమైన హిందువుగా, ఇస్లాం మతమును అనుసరించే వ్యక్తి మరింత ఉత్తమమైన ముస్లిముగా వారి వారికి ఆయా మతములలో మరింత విశ్వాసమును నెలకొల్పడానికి నేను అవతరించాను.
(దై.ది.పు. VII)
"నాయీ జీవితములోని మొదటి 16 సంవత్సరాలు బాలలీలలను, తరువాత 16 సంవత్సరాలు మహిమలను చూసి ఈ తరం ఆనందమును కలిగించడానికి వినియోగించడం జరిగింది. 32వ సంవత్సరము తరువాత రానున్న కాలములో దారి తప్పి సంచరిస్తున్న మానవజాతికి సన్మార్గమును ఉపదేశించడంలోను, ఈ ప్రపంచమును సత్య ధర్మ, శాంతి, ప్రేమల మార్గములో నడిపించడానికి కృషి చేయడంలోను నాసమయమును ఎక్కువగా వినియోగించడం మీరు చూస్తారు. అనగా దాని అర్ధము ఆ తరువాత నేను లీలలను, మహిమలను చూపించడం పూర్తిగా మానివేస్తానని కాదు. ధర్మమును పునరుద్ధరించడం, వక్రమార్గములో నడుస్తున్న మానవుని మనస్సును సరిదిద్దడం, మానవజాతిని మళ్ళీ సనాతన ధర్మమువైపు నడిపించడం అనేవి ఇకనుండీ నేను నిర్వర్తించవలసిన కార్యములని నా అభిప్రాయము"...
(దైది.పు.348/349)
నేను నిక్కముగ సాయియని తెలియుడు. మీతో నాకు గల ప్రాపంచిక సంబంధము ఈ నాటిలో తెగిపోయింది. ఇక ప్రపంచములో ఏ శక్తి కూడా నన్ను బంధించలేదు."
(దై.ది.పు.201)
"నాలో శివశక్తి స్వరూపములు రెండింటిని మీరు చూడవచ్చు. నాశక్తిని. నా అనుగ్రహమును ఏ ఒక్క స్థలమునకో పరిమితము చేయవలసిన అవసరము లేదు. నా శక్తికి అవధులు లేవు. అనంతమైన శక్తి, అనంతమైన అను గ్రహము నా హస్తములలో ఉన్నవి."
(దై.ది.పు. 285)
"మౌళిగుల్కెడు చంద్రమఖండ కళల తోడ
బెడగారు గుంపెడు జడలతోడ
జడలలో ప్రవహించు చదలేటి బిగితోడ
డంబైన ఫాల నేత్రంబుతోడు
అల్లనేరేడు వంటి నల్లని మెడతోడు
కరమున నాగ కంకణము తోడ
నడుమును చుట్టిన నాగచర్మముతోడ
మైనిండ నలదు భస్మంబుతోడ
ఆరు శాస్త్రములందున నందగించి
వల్ల కలువల ఆశ్రయించి కోలలాడు
మెరుగు చామన ఛాయల మేనితోడ
ప్రశాంతి వాసుడు నేడు సాక్షాత్కరించె.
(బా.జీ.జ. స..పు.80)
“ప్రస్తుతావతారంలో నిరాకారుడై దివ్యమూర్తి యొక్క సమగ్ర సంపూర్ణ వ్యక్తి సమన్వితుడవైన మానవజాతి సంరక్షణ కోసం అవతరించాను.
(స.ప్ర.పు.1)
"సర్వ ప్రాణికోటికిని మూలాధారమైన ఆత్మను గూర్చిన జ్ఞానమే నేడు విస్మృతముతమైనది. అదే ఈ నాటి అశాంతికిని విప్లవమునకును, అవినీతికిని ముఖ్య కారణము. నిద్రాముద్రితమై యున్న ప్రజానీకమును మేలుకొలిపి, ఈ సందేశము నందించుటకే నా ఈ ఆగమనము."
(సా. అ.విషయ సూచిక తరువాత పుట)
"ఎక్కడైతే మానసిక శాంతి కోసం ఆకాంక్ష
ఉంటుందో అచ్చట శాంతి ప్రసాదించడానికి
వేగిరపడతాను. ఎక్కడైతే నిరాశానిస్పృహలు
ఉంటాయో అక్కడ క్రుంగిపోతున్న హృదయాన్ని
లేవనెత్తడానికి త్వరపడతాను. ఎక్కడైతే ఆత్మవిశ్వాస
ముండదో అక్కడ విశ్వాసము తిరిగి కల్పించడానికి బహుతొందరపడతాను. నేనెందుకైతే వచ్చానో ఆపవిత్ర ధ్యేయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం కదులు తుంటాను.
(సా. అ. పు. 33)
"మీరంతా కూడా నాచే సృష్టించబడిన అద్భుతమైన సృష్టికి ప్రతీకలే" (అని స్వామి అన్న మాటలు నాకు ఒక ప్రఖ్యాత క్రైస్తవగీతం "ఓల్డ్ టెస్టామెంట్" లో చెప్పబడినది గుర్తుకు తెచ్చాయి.)
(సా.స. స..పు.102)
ఎంతటి దుర్మారులైనా, మూర్ఖులైనా, కపటులైనా, ఎటువంటి వారైనా సరే నానుండి దూరంగా వేరుగా ఉండలేరు.
(శ్రీ స.స. పు.264)
"మానవజాతి మొత్తం ఏకమై ఏళ్ళతరబడి కఠినమైన పరిశోధన చేస్తూ ప్రయత్నించినా నా నిజతత్వాన్ని యిప్పుడు కాని, కొన్ని వేల సంవత్సరాల తరువాత కాని తెలుసు కోలేదు. నేను కూడా మీతో కలిసి మీలాగే ఉంటూ, మీలాగే తింటూ, మీతో మామూలుగా మాట్లాడుతూ ఉండటం వలన మీరు నన్నుసాధారణమైన మానవుని గానే భావిస్తున్నారు "ఇది" అన్ని భగవంతుని రూపాలూ, అన్ని దివ్యతత్వాలూ కలసి ఉన్న మానవరూపం. అనగా ఏ ఏ నామ రూపాలతో మానవుడు భగవంతుని వర్ణించి ఉన్నాడో అవన్నీ కలిసి దాల్చిన అవతారం"
(శ్రీ.. స.స...పు.282/283)
"అసత్యం నుండి సత్యం వైపుకు, చీకటినుండి వెలుగులోనికి, మృత్యువు నుండి అమృతత్వానికి, మిమ్మల్ని నడిపిస్తాను. మీరు తొట్రుపాటు పడ కూడదు. మూర్ఛపోకూడదు.
(శ్రీ... స.స ..పు.363)
నారదుడు ఎల్లప్పుడూ భగవంతునితో సన్నిహితంగా ఉంటూ సన్నిహితంగా మసులుతాడు. అయినప్పటికీ అతడు తనకు అగ్రాహ్యడుగానే ఉన్నాడనుకొంటాడు. శ్రీకృష్ణ భగవానుని స్వంతసోదరుడుగా అవతరించిన బలరాముడు తనసహోదరుని వ్యక్తిత్వపు లోతుల్ని అందుకోలేక పోయాడు. అట్లాంటప్పుడు మీరు నన్నుగూర్చిన పరమరహస్యాన్ని ఎట్లు అవగతం చేసుకోగలరు? విశ్వాసముంటే నీకు నా అంతస్థితుడైన భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. అతడు నీకు అందుబాటులోనే ఉన్నాడు. నిరంతర సాక్షీభూతుడుగా ఉండే ఆ భగవానుని ఎరుక గలిగి యుండును. అతను సర్వద్రష్ట సర్వజ్ఞుడు.
(.(సా. అ.పు. 153)
“శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడు నిన్సెప్పుడు కరుణాకరుడు; చేయి పట్టి బ్రోచునెపుడును ఎచ్చటను మరువకుడు"
"నాలో మిమ్మల్ని దర్శించుకోండి, ఎందుకంటే మీ అందరిలో నేను నన్నే చూస్తాను కనుక,
మీరే నా జీవితం, మీరే నా ఊపిరి, మీరే నా ఆత్మ
మీరందరూ కూడా నా ప్రతిరూపాలే. మిమ్మల్ని
మీరు ప్రేమించినప్పుడు నన్నే ప్రేమిస్తున్నారు.
నేను నన్ను ప్రేమించినప్పుడు మిమ్మల్నే ప్రేమిస్తున్నాను.
నన్ను నేను ప్రేమించడం కోసమే " నా " నుండి
"నన్ను వేరు చేసుకున్నాను. ప్రేమ స్వరూపులారా!
మీరంతా నా ఆత్మ స్వరూపాలే!
(శ్రీ స. ప్రేస్ర.పు. 428)
చూతమురారే! సుదతులార! సాయిబాబాను!!
నిలువంగీ తొడుగునట - నీలి పీతాంబరుడట - పరం
జ్యోతి రూపుడట పరమాత్ముడు సాయిబాబా చూ॥
పుట్టపర్తి పురమునందు భక్త జనుల భవనమందు –
ముక్తి నిచ్చెదననుచు తాను ముఖ్యముగ నిలచినాడట ||చూ||
చిత్రావతి తీరమందు చిరుకొండ చివరియందు - పర్తివాస
ప్రత్యక్షము పదుగురెదుట చూపునట ! || చూ||
షిరిడివాసుడట చిన్నిసాయీశుడట - హస్త
లాఘవమున్నదట - అడుగునన్ని యిచ్చునట. చూ॥
శివరామ కృష్ణుడట చిందులందు మారుతట - సర్వ
రూపములతడట - సద్భక్తులకు చూపునట చూ॥
కలిగియుగమున పుట్టి నట్టి కలికాల దేవుడట - కలుషములను
బాపునట కరుణా సముద్రుడట "చూ॥
భక్తులతని పరుపులట, తన శక్తియే ఊయలట - నరుల
పాటలే నాలుగు నాణ్యమైన గొలుసులట చూ॥
భక్తులెచట పిలచినను పారిపోవుచుండునట - గోవువెంట
దూడవోలె దుముకుచును వెళ్లునట చూ॥
కన్నులందున నెపుడు కారుణ్యపు చూపునట
ముద్దులొలుకుచుండునట - ముచ్చటైన మాటలట చూ॥
వారి మహిమ తెలియలేక మాయ వలలో నచిక్కి
మందభాగ్యులగుటకన్న - మంచిదారి దొరికెనట చూ॥
తాను తలచినంతనె విభూతి - తన హస్తము తగులునట
లక్షణమున దానితీసి తల్లడిల్లెడి వారి కొసగు చూ॥
ఎన్ని పనులుండినను దండిగ శ్రీ సాయినాధుని
నెలవునకు పట్టువీడక సాగిపోదము చూ॥
రండి రండి మీరు రమ్యమైన పర్తిపురికి
శృంగారించినట్టి సాయిని - చూడ్కులలర చూడబోదాము’’ చూ||
తెలివిలేని మూఢులారా! తెలివితెచ్చుకొని నేడు
తరలి తరలి వేగ మీరు తరలిరండు పర్తిపురికి చూ॥
ముసి ముసి నవ్వులోను ముద్దైన యిసుక నేడు
మూసి చూడగానే అదియు లడ్డై క్రిందపడెను చూ॥
మంత్ర తంత్రమనుచు కొందరు మందభాగ్యులను కొందరు
మతిలేని మూడజనులు మరుగునందు తలచుచుంద్రు|| చూ!
ఇవి అన్నియు వదలి మీరు యిష్టముతో భజనసలిపి
కష్టమైన భరియించుక కదలిరండు కరువుతీర || చూ॥
భక్త బృందముతో నేడు బాబ మందిరమ్మునందు
కీర్తి కలిగినట్టి తులసి ఖ్యాతితో హారం కట్టుచుండగా |చూ||
కుషిలో సాయీశుడు నేడు కుప్పం భక్తులతో కూడి
కోర్కేమీర చెప్పేపాట - కాని యాడుచూ యిందురండి| చూ॥
అవనిలో యీ పాటనెవరు పాడినను వినిననుగాని
పరీశుడటకు వచ్చి పరంజ్యోతి రూపు చూపు చూ॥
జయమంగళమిదెసాయి శుభమంగళంబు మీకు
సర్వమంగళంబు మీకు - సాయినాధ గైకొనుము | చూ॥
(యు.ఆ.సా.పు.23/26)||
యుగధర్మ పద్దతుల్ విగళితమై యుంట
నయ మార్గమున ద్రిప్పినడుపు కొరకు
లోకంబులెల్ల కల్లోలమై చెడియుంట
విష్కల్మషము జేసి నెగడు కొరకు
దుర్మార్గబద్దులై తొలగి దీనిత మంట
సాధు సంరక్షణ సలుపు కొరకు
కాలసందిగ్ధ విగ్రహ సూక్తులై యుంట
భాష్యార్థ గోప్యముల్ తెలుపు కొరకు
క్ఞ్మాభారముబాపి భూదేవి మనుపు కొరకు
త్రేత నొసగిన కోర్కెల దీర్చు కొరకు
అవతరించెను అచ్యుతడవని యందు
ఇంత కన్నను వేరెద్ది యెఱుక పరతు!
(యు.ఆ.సా. పు. 44)
ప్రశాంతి నిలయమునకు రండు. అచ్చటనే కొలది కాలమైనను నివసింపుడు, నాతో కలిసియుండుడు. నా సాహచర్యమువలన కలుగు అనుభవమును సంపాదింపుడు. సంభాషణ మును లేక యుపదేశములను వినుడు. నన్నే గమనించుడు. ఆ పిమ్మట మీ యిష్టానుసారము తీర్మానమునకు రండు. లోన ప్రవేశించి లోతు తెలిసికొనుడు. తిని రుచిని తెలియుడు.
(స.. శి సు.ప్ర.పు.223)
నే నెవ్వరినిగాని నాస్తికుడనను. భగవద్విశ్వాస హీనుడనను. కారణమేమనగా, అందరును భగవంతుని సృష్టియే. అందరును భగవదనుగ్రహమునకు పాత్రులే. ప్రతివాని హృదయమునందును సత్యమను రాయి (సుస్థిరమైనది) యున్నది. ఆ రాతి ననుసరించి, ప్రేమ యను ఊట బుగ్గ లేక చెలమ యున్నది. ఆ ప్రేమయే దైవము. ఆ సత్యమే దైవము. దైవత్వము, లేక దైవ భావము ప్రతివాని యంతరంగములో నిమిడి యున్నది. అనగా ప్రయత్నముచేత గాని, ఆ దైవత్వమును, లేక దైవభావము వెలుపలికి రాదు (ప్రకాశింపదు). సాధన వలన బైటికి వచ్చి ప్రకాశించును. భూగర్భములోని నీటి యూటను త్రవ్వి త్రవ్వి బైటకి దెచ్చునట్లు, నిరంతర రామనామ స్మరణవలన నంతరంగము త్రవ్వినట్లు కాగా, దైవత్వమను ఊట బైట పడును. బ్రహ్మానందానుభూతి ప్రకాశించును. ఇట్టి బ్రహ్మానుభూతి నుండి, లేక పరమాత్మానుగ్రహమును సంపూర్ణముగా పొందిన భక్తుని నుండి ప్రారంభదశలోని సాధకులు సహాయమును పొందుదురు.
(స.శి.సు.ప్ర. పు. 225)
“మీలాగే తింటూ, మీలాగే మీభాషలోనే మాట్లాడుతూ, మీ వీనులకు విందు కలిగించేలా పాటలు పాడుతూ ఈ జగన్నాటకంలో ఒక అంతర్నాటకాన్ని ప్రదర్శిస్తున్నాను" "అంతేకాదు. మరొక్క విషయం కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. “మీరు నేనే అన్న పరమసత్యం వైపుకు నడిపించే పాత్రనే నేను ధరించానన్న విషయం జ్ఞాపకం ఉంచుకోండి."
(శ్రీ.స.స. పు. 396)
కొంతమంది భగవంతునికి మానవరూపంలో అవతరించటం ఎంతో అందమైన ఆనందకరమైన విషయం అని అనుకుంటారు. కాని మీరు నాస్థానంలో ఉంటే అది అంత అందమైనదిగా భావించరు. ప్రతి ఒక్కరికీ గతంలో జరిగింది, వర్తమానంలో జరుగుతున్నదీ, భవిష్యత్తులో జరగబోయేదీ అంతా నాకు తెలుసు. నాకు ప్రపంచంలో ఏవ్యక్తి అయినా ఎందువల్ల బాధపడుతున్నాడో తరువాత అతనికి ఏంజరగబోతున్నదో, అంతేకాక ఈ బాధను అనుభవించటానికే ఈజన్మనెత్తాడనీ, అంతా నాకు తెలుసు."
(శ్రీ స.ప్రే. స్ర. పు. 401)
భక్తిరసానంద పారవశ్యముచేత
భవబంధ భూతముల్ వదలిపోవు
భవబంధ భూతముల్ వదలినతోడనే
మోక్షాభిమానంబు మొలకెత్తు
మోక్షాభిమానంబు మొలకెత్తినంతనే
జ్ఞానోదయ ప్రాప్తి గలుగు వెంట
జ్ఞానోదయ ప్రాప్తి కలిగిన వెంటనే
తన్ను తానెరిగెడి తత్త్వమబ్బు
జగము మాయమైపోవుచో నిగమ వినుతు
నిత్యసౌభాగ్యరూపంబు నిలుచుగాదె
ఇంతకన్నను వేరెద్ది ఎఱుక పరతు
సాధు సద్గుణ గణ్యులొ సభ్యులార!
(యు. సా. పు. 59)
"పతితులైన మానవాళి నుద్ధరించుటకై తిరిగి యవతరించిన సాయిబాబాయే నేను. ఆధ్యాత్మిక సాధనలో మొట్ట మొదటి మెట్టయిన పూజా విధానమును ప్రతి గురువారమును మత్ప్రీ కరముగ మదను గ్రహము కొలుకు పల్పుడు.
(స.కి.సు.ద్యి.పు.4)
ప్రజానీకము నుద్దరించి, శాశ్వతానందమును సమకూర్చుటయే నా యవతార ప్రయోజనము. ధర్మమార్గము నుండి దూరులైన మానవులను సంస్కరించి, పునః ధర్మాచరణ పరాయణులను జేసి సంరక్షింప వలయుననే నా నిర్ణయము: నా ప్రతిజ్ఞ నిరు పేదల బాధలను నివారణచేసి, సుఖసంతోషము లందును. లాభ నష్టములందును, మానవ మానములందును, సమదృష్టి గల్గి ధీరులై యుండవలయు ననునదే నే బోధించు భక్తి మార్గమునందలి రహస్యము. అనన్యగతికులై నన్నే న మ్ము నా భక్తుల నెన్నడును విడువను.
(స.శి.సు.ద్వి.పు. 10/11)
"నా తత్త్వము ఆగమ్యమును, అగోచరమును నైనది. ఇప్పుడే కాదు. ముందెప్పటికైనను, ఎంత శ్రమించి విచారించినను నా తత్త్వము సర్వమానవులకును గ్రహించుటకు నసాధ్యమైనది. కాని నా యానందానుభూతి మాత్రము నమ్మినవారి కెల్లరకును, ఖండాంతర మతాంతర మానవులకు సహితము అనుభవైకవేద్యముగ నుండును. మాయామనుషదేహినై యుండుటవలన మానవులు నన్ను గుర్తింపరైరి. నా నిజ స్వరూపమును గుర్తింపుడు. మానవులు పూజించు యితర దైవ రూపములను పోలినదే యీ దివ్యమానవ రూపోపాధియు నని తెలియుడు. ఈ సత్యసాయి నామ రూపోపాధి శ్రీ భగవానుని దివ్యావతార మనియే మీ రెఱుంగుడు. ముందెన్నటికో గాక వర్తమానములనే ఈ లీలోపాధిని కేవలము సత్యతత్త్వముగ గుర్తించి, గ్రహించి, విశ్వసించి, పూజించుచుండుట మీ జన్మాంతర పుణ్యఫలము వలననే మీకు లభించెనని తెలిసికొనుడు. విశ్వమెల్లను నచిరకాలముననే శ్రీ సత్యసాయి దివ్యావతారమును సందర్శించి బ్రహ్మానంద సాగరమున నోలలాడగలరు.
("స.శి.సు.ది..పు.265)
"అదిగో అటుచూడు. అక్కడేమీ కనిపించుకుంది? కొండలు, చెట్టు, ముండ్ల పొదలు, అక్కడ పగలు కూడా పాములు సంచరించుతుంటవి. చీకటి సమయములో ఎవ్వరు అటుపోరు. కానీ రాగల సంవత్సరములలో అక్కడ మహానగరమొకటి వెలుస్తుంది. ప్రపంచమందన్ని ప్రాంతములనుండి నా భక్తులు అసంఖ్యాకముగా నా దర్శన, స్పర్శన, సంభాషణ కొరకు రాగలరు. ఆనాడు మీరందరూ చాలా దూరమునుండే నన్ను చూచి ఆనందించుతారు. ప్రపంచమే మారిపోతుంది."
(శ్రీ స.లీ.పు.39)
సోదురులారా రండి! సోదరీమణులారా తరలి రండి!
పోదాము పదండి ఇప్పుడే ఆ పవిత్ర పుణ్యస్థలి పుట్టపర్తికి
ధరిస్తాడట ఆయన మనోహరమైన కాషాయంబరాన్ని!
దివ్యమైన తేజస్సట ఆ మహానుభావునిది!
భగవంతుడేనట ఆయన
చిత్రావతి నదీ తీరపు ఇసుక తిన్నెలపై
కొండల అంచుల నీడలలో
"మానవ రూపంలో అవతరించిన దైవమే"
తానని వెల్లడి చేస్తుంటాడు. ప్రతిదినమూ
ఇంతకు ముందాతడు షిరిడీ వాసుడట
మరల ఈనాడు మనకోసం పర్తి వాసుడైనాడట.
రండి సోదరులారా! తరలిరండి...సోదరీమణులారా! రండి..రండి
మనమంతా వెళదాము పుట్టపర్తికి.
చూపుతాడట అభయహస్తాన్ని
అనుగ్రహిస్తాడట కోరినవన్నీ
కొరతలేకుండా ప్రసాదిస్తాడట ఆ
అభయ హస్తాలు
శివుడు....రాముడు: కృష్ణుడు...మారుతి......
రండి పోదరులారా. తరలి రండి... సోదరీమణులారా!
ధగధ్ధగాయమాన కాంతులో ప్రకాశించు కాంతిమంతుడట
పూలతూగుటుయ్యలలో విశ్రమించునట.
ప్రతిధ్వనించుచుండునట సతతం భగవన్నామ సంకీర్తనం
ఆరాధనే ఆధారం ఆ ఊయెలకట:
అభిమానమే గొలుసు ఆ ఊయెలకట,
భగవత్ ప్రార్థనా గీతాలే ఆ పూల పరిమళమట,
ఆర్తితో అర్థిస్తే, వేదనతో విలపిస్తే
కలత బాపునట కనికరించి తక్షణమే
అంబా అని లేగదూడ పిలిచినంతనే
పరుగున చెంతనే చేరే గోమాత వలె బ్రోచునట
చల్లనైన చూపట; మనోహరమైన రూపట
మకరంద మాధుర్యమును బోలు మృదు మధురమైన పలుకట
మాయలో చిక్కుకుని, విడిపించే వాడు లేక
విధిని శపించుకుంటూ సందులగొందుల తిరిగే వారికి
పుట్టపర్తి బాట రాచబాటయట
దారి తప్పి తిరిగే వారికి, బాధలతో కృంగిన వారికి
సమస్యలతో సతమతమవుతూ పోరాటం పలుపుతున్న వారికి
సంకల్పమాత్రమున సృష్టించబడే విభూతి ని
ప్రసాదించి కష్టములను బావునట తక్షణమే.
అందుకే....
సోదరులారా ! త్వరపడండి.
ఇప్పుడు తీరికలేదు... "కొంత కాలం గడిచాక చూద్దాంలే....
అని మీనమేషాలు లెక్కిస్తూ ఆలసించకండి.
తరలిరండి... సోదరులారా! పోదరీమణులారా
తరలిరండి.... తరలిపోదాము త్వరత్వరగా
పుట్టపర్తి పవిత్రయాత్రాస్థలికి పయనమవుదాము.
పొందుదాము ఆ భగవానుని దివ్య సందర్శన భాగ్యం
కదలిరండి కట్టి బెట్టి మిథ్యావాదాన్ని
కలసిరండి మాతో.... తెలుసుకోండి కొంచమైనా
ఆదివ్యతేజోమూర్తి దివ్యకీర్తి వైభవాన్ని
పెదవుల పై మెరిసే చిరునగవుతో
కనులలో తళతళ మనే కాంతితో
ఇసుక తిన్నెలలో ఆయన తన వేళ్ళను చొప్పించగనే
మారుతాయట తడి మట్టి ఉండలు
గుండ్రని తియ్యని మిఠాయి ఉండలుగా!
దివ్యత్వానికి సుదూరంగా వారు అంటూ వుంటారు.
ఇదంతా "మంత్రమని ...వట్టి తంత్రమనీ"
చెవిని పెట్టకండి ఆ మాటలను
లేచి వే వేగ సాగించండి మీ ప్రయాణం
బెదరకండి కష్టాలకు, కృంగకండి నష్టాలకు
మీరు పొందబోయే బహుమానం బహు దొడ్డది నమ్మండి!
ఈ పవిత్ర శుభదినాన ఈ పర్తిమందిరంలో
తులసి దళాల మాలలు గ్రుచ్చి సమర్పించే శుభవేళలో
భక్త కోటిని ఆశీర్వదించటానికై ఆలపిస్తున్నాడు
భగవానుడు భక్తులపట్ల అనుగ్రహంతో. రండి
సోదర సోదరీమణులారా! తరలి రండి
భగవానుని అనుగ్రహాన్ని పొంది తరించండి!
(స. శి..సు.నా.పు.XI - XIV)
"మానవ జాతినంతటిని ఏకం చేసి వసుధైక కుటుంబంగా చెయ్యటానికి, మీ విజతత్త్యమైన ఆత్మతత్త్వాన్ని మీకు తెలియ చెప్పటానికే నేను వచ్చాను.... తుచ్ఛమైన, లైకికమైన భౌతిక సుఖాలను, సంపదలను నామండి ఆశించకండి...... వాటికి బదులు నన్నే మీరు కోరుకోండి... అందుకు తగిన ప్రయోజనం మీకు తప్పక చేకూరుతుంది.
(స.శి.సు.నా.పు.47/48)
“నా ఆనందం కోసం ఒక్క మాటలో ఈ ప్రపంచాన్ని సృష్టించేవరకూ నేనెవరో తెలుసుకోవటానికి ఎవ్వరూ లేరు. నాసంకల్పముచేత పుడమి అవతరించింది, ఆకాశం వెలిసింది; పర్వతాలు తలలెత్తాయి; నదులు ప్రవహించ సాగాయి; ఏమీలేని శూన్యం నుండి నా ఉనికిని నిరూపిస్తూ సూర్యుడు చంద్రుడు, నక్షత్రాలు ఉద్భవించాయి. అన్నిరకాల జీవరాసులూ జనించాయి. నా ఆదేశం ప్రకారం వారికి వివిధ రకములైన శక్తులు ప్రసాదించబడినాయి. మానవునికి ప్రథమస్థానాన్ని కల్పిస్తూ నాజ్ఞానం మానవ మస్కిష్కంలో ప్రవేశ పెట్టబడింది."
(స.శి.సు.నా పు.118)
"రండి, అందరూ దగ్గరగా రండి, వచ్చి నాలో మిమ్మల్ని చూసుకోండి. ఎందుకంటే నేను మీలో నన్నే చూస్తున్నాను. కనుక మీరే నాజీవితం, నాఊపిరి, నాఆత్మ.... అంతా మీరే. మీరంతా కూడా నా ప్రతిరూపాలే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు నన్ను నేనే ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమించేటప్పుడు మీరు నన్నే ప్రేమిస్తున్నారు. నన్ను నేను ప్రేమించుకోవటం కోసమే నానుండి నన్ను నేనే వేరుచేసుకున్నాను. నా ప్రియాతి ప్రియమైన బాలలూ! మీరే నా "నిజమైన ఆత్మ”
ఒకేమాటలో ఈ విశ్వాన్ని అంతటినీ నేను సృష్టించాను. (ఏకోహంబహుస్యాం)
విశ్వంలోని ప్రతి ప్రాణియందలి చైతన్యము ప్రేరణ శక్తి నేనే.
"నా ప్రియమైన బాలలారా!
పక్షి మీ దగ్గర ఉంటే రెక్కలు నావద్ద ఉన్నాయి; పాదాలు మీవైతే పథం నాది: కన్ను మీదైతే రూపం నాచెంత ఉంది: వస్తువు మీవద్ద ఉంటే కల నావద్ద ఉన్నది. ప్రపంచం మీలో ఉంటే స్వర్గం నాతో ఉంది. మనం బంధాన్ని ఎలా కలిగి ఉన్నామో, స్వేచ్ఛకూడా అలాగే కలిగి ఉన్నాము: ఎలా ప్రారంభిస్తామో అలాగే అంతం చేస్తాము. నేను మీలో ఉన్నాను. మీరు నాతో ఉన్నారు.
(స...సు.నా.పు. 159/160)
"నేను నిర్వర్తించవలసిన కార్యము కేవలము వ్యక్తుల యొక్క రుగ్మతలను తొలగించటం, వారికి ఉపశాంతిని కలిగించటం, వారి యొక్క దుఃఖమును, బాధలను పారద్రోలడం వరకూ మాత్రమే పరిమితమైనది కాదు. ఇవన్నీ సందర్భవశాత్తూ నిర్వర్తించే కార్యములే. అయితే నా ప్రధాన కర్తవ్యము. వేదాలలోను వైదికమైన కర్మానుష్ఠానములోను గల అంతరార్థమును వివరించి భారతదేశములోను ప్రపంచమంతటా ధార్మికజీవనాన్ని పునరుద్ధరించటమే."
(దై.పు.183)
"కేవలం మానవ శరీరంలా కనబడుతున్న ఈ దేహము మానవాతీతమైన శక్తులను ప్రదర్శిస్తున్నప్పుడు విస్మయకరమైన ఈ సంఘటన వలన అందరి దృష్టి ఈ దేహములోగల దివ్యతత్త్యము పై లగ్నమవుతుంది. అయితే, ఇదే దివ్యతత్వము సమస్త మానవులలోను అంతర్లీనముగా ఉన్నది. మానవజీవికి అప్పుడప్పుడు ఈ విషయాన్ని మరొకమారు గుర్తు చేయవలసిన అవసరము వస్తూంటుంది. ఇలా చేయటం వలన మానవులకు భగవంతుని యందు విశ్వాసము పెంపొంది. వారు భగవతత్త్వమును గుర్తించగలిగే స్థాయికి చేరుకుంటారు. అటువంటప్పుడే మానవుల యొక్క మనస్సు ప్రాపంచిక విషయాలనుండి విశ్వాధినేతయైన భగవంతుని వైపు మళ్ళుతుంది."
(దై.పు.205)
మీరు చూస్తున్న ఈ మానవరూపములో ప్రతి ఒక్క దివ్యరూపము, ప్రతి ఒక్క దివ్యతత్త్వము, అంటే మానవుడు భగవంతునికి ఆపాదించే సమస్త రూపనామములు ఇమిడి ఉన్నాయి. నా యొక్క దివ్యదర్యము ఇలా ఉంటుంది. అలా ఉంటుంది అని ఎరుకపరచడానికి ప్రయత్నము చేస్తూ మీరు అమూల్యమైన మీకాలాన్ని ఎందుకు వృధా చేస్తారు? నీటిలో మునిగియుండే చేప అనంత మైన ఆకాశము యొక్క వైశాల్యాన్ని కొలువగలదా? నా యొక్క దివ్యతత్త్వము ఇది, అది అని నిర్ణయించడానికి ప్రయత్నము చేయకండి. అది ఫలించదు. అంతకంటే మీలోనే అంతర్గతముగా నున్న దివ్వ తత్త్వమును గుర్తించడానికి ప్రయత్నము చేయండి. అప్పుడు నా యొక్క దివ్యతత్వమును గుర్తించడములో మీరు కృతకృత్యులవుతారు."
(దై.పు.215)
"మీరు నన్ను చూచి ఆశ్చర్యపడిపోతున్నారు. నేనెవరినో తెలుసు కోవాలని మీరు అనుకుంటున్నారా? శ్రీ సత్యసాయిబాబా ఆవతార పురుషుడు, ఆయన సాక్షాత్తూ భగవంతుని అవతారమే. ఈ అవతారమును గురించి ఏ విధమైన పొరపాటు పడకండి, నా లక్ష్యము నెరవేరి తీరుతుంది. నేను మిమ్మల్ని నా దగ్గరకు పిలిపించు కుంటాను, ప్రాపంచికమైన కొన్ని వరాలు కూడా ఇస్తాను. అయితే, ఇవన్నీ మీ దృష్టిని భగవంతుని వైపు మళ్ళించడానికే. జనబాహుళ్యము మధ్యకు వెళ్ళటం, వారికి తగు సలహాలు ఇచ్చి, వారిని సవ్యమైన మార్గములో నడిపించటం, వారికి కష్టము కలిగి నప్పుడు ఓదార్చటం వారిని ఉద్దరించటం, వారిని సత్య, ధర్మ, శాంతి, ప్రేమలనే మానవతా విలువలను పాటించే మార్గము వైపు మళ్ళించడం - ఇటువంటి పనులను ఇంతవరకూ ఏ అవతారమూ చేయలేదు. ప్రస్తుత సమయంలో భగవంతుడు అవతరించింది. సరిగ్గా ఈ కార్యము నెరవేర్చటానికే"
(దై..పు.286)
దేహంబు క్షీణించు దినమెవ్వరెరుగరు
కష్టంబు లొచ్చుట గాంచలేరు
జగతిపై నెవరైన జన్మించుటెరుగరు
దివి భువి సుఖములన్ దెలియలేరు
మాయలోపల జిక్కి మమత వీడగజాల
రించుక తమ మర్మమెరుగ లేరు
మానవధర్మంబు మాటయే మరతురు
దేని నొనర్తురో తెలియ లేరు
ఇన్ని తీరులు కూడ దైవేచ్చగాన
దీన వత్సలు డతని ప్రార్థింతురేని
సృష్టి చిత్రంబు లెంత విచిత్రమైన
భక్తి శక్తియు ముక్తియు బాబయిచ్చు.
(షి.పు.39)
"మీరు చూస్తున్న ఈ మానవ రూపములో ప్రతి ఒక్క దివ్యరూపము, ప్రతి ఒక్క దివ్యతత్త్వము, అంటే, మానవుడు భగవంతునికి ఆపాదించే సమస్త రూపనామములు ఇమిడియున్నాయి. సర్వదేవతా సర్వరూపములు ధరించిన మానవకారము ఈ ఆవతారము. సాయిబాబా అనే పేరుకు గల అర్థమును గమనించండి.
"సా" అనగా "దివ్యమైన", "అయి" అనగా "మాత" మరియు "బాబా" అనగా "పిత" అని అర్ధము. "సాంబశివా" (స+అంబ+శివా) అనే పదమునకు దివ్యమాతాపితలని అర్ధమున్నట్లే " సాయిబాబా" అనే పదమునకు దివ్యమాతాపితాస్వరూపుడని అర్ధము. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో కొంత స్వార్ధముతో మిమ్మల్ని ప్రేమిస్తారు. కాని దివ్యమాతా పితా స్వరూపుడైన ఈ సాయిబాబా మీ పై సదా అనుగ్రహ వర్షమును కురిపిస్తూ ఆత్మ సాక్షాత్కారము కొరకు మీరు చేసే సాథనలో మీకు విజయమును చేజార్చేందుకు మాత్రమే అప్పుడప్పుడు మీపై కొనమును నటిస్తాడు."
(దై.ది.పు.288)
"ఈ అవతారములో నాకు జన్మనిచ్చిన కుటుంబ సభ్యులతో నేను ఎటువంటి సంబంధము పెట్టుకోలేదు. గతంలో ఎక్కువగా కుటుంబ సభ్యుల మధ్య, కుటుంబసభ్యుల కొరకు తమ జీవితమును గడిపిన శ్రీ రామావతారము. శ్రీ కృష్ణావతారముల వలెగాక, ఈ అవతారము కేవలం భక్తుల కొరికే " రామావతారములో శ్రీ రామచంద్రుడు సత్యధర్మములకు ప్రతీకగా నిలిచి "రామో విగ్రహవాన్ ధర్మః" అని పేరు పొందాడు. శ్రీ కృష్ణుడు శాంతి, ప్రేమలమ వెలకొల్పడానికి కృషి చేశాడు. గౌతమ బుద్ధుడు అహింసా తత్త్వమును బోధించాడు. నా ఈ ప్రస్తుత అవతారము సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనే ఐదు మానవతా విలువలను పునరుద్దరించ దానికి ఉద్దేశింపబడినది. మీకు తెలిసిన నా ప్రతి ఒక్క అనుగ్రహ పూర్వకమైన దివ్యలీల వెనుక మీకు తెలియని వేలకొద్దీ దివ్యలీలలు ఉన్నాయి.
(దైది.పు.289/290)
జన బాహుళ్యము మధ్యకు వెళ్ళడం, వారికి తగు సలహాలు ఇచ్చి వారిని సవ్యమైన మార్గములో నడిపించడం, వారికి కష్టము కలిగినప్పుడు ఓదార్చడం, వారిని ఉద్దరించడం, వారిని సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనే మానవతా విలువలను పాటించే మార్గము వైపు మళ్ళించడం, ఇటువంటి పనులు ఇంతవరకు ఏ అవతార పురుషుడూ చేయలేదు.
నేను శంఖు చక్రగదాధరుడైన కమలహస్తుడనై చతుర్భుజములతో నారాయణునిగా మీ మధ్యన అవతరించినట్లుయితే బహుశా మీరు నన్ను ఏదైనా ఒక మ్యూజియంలో పెట్టి నాదర్శవం కొరకు వచ్చే వారి నుండి కొంత పైకము వసూలు చేసేవారు. అలాకాకుండా నేను కేవలం మానవ మాత్రుడిగా మీ మధ్యకు వచ్చినట్లయితే నా బోధలకు విలువనివ్వకుండా వాటిని మీ స్వలాభము కొరకు వినియోగించుకునే వారు. అందువలన నేను మానవరూపముతో మానవాతీతమైన జ్ఞానముతో, శక్తులతో మీ మధ్యన ఆవతరించి అప్పుడప్పుడు మీకు కొన్ని లీలలను, మహిమలను చూపుచున్నాను. నేను పురుషడను కాను, స్త్రీను కాను, వృద్ధుడను కాను, యువకుడను కాను, ఈ అన్ని రూపములు నావే. ఈ చరాచర ప్రపంచమంతటిలోను అంతర్లీనముగా నున్న శక్తిని . నే నే . మీరు ఎక్కడున్నా ఏమి చేస్తున్నా ఒక విషయమును గుర్తుంచుకోండి. మీరు చేస్తున్నదంతా నాకు తెలుస్తుంది. నేను మీ హృదయపీఠముపై అధివసించయున్న దైవమును. నేను సర్వాంతర్యామిని, మీ హృదయవాసిని. మానవజాతిని ఉద్దరించడానికి అవతరించిన ఈ అవతార పురుషునికి సాధకుని గురించి అతడు చేరవలసిన గమ్యమును గురించి పూర్తిగా తెలుసు. సృష్టికర్తయైన ఆయనకు తన శక్తిని గురించి క్ఞుణ్ణముగా తెలుసు. సమస్త మానవుల భూత భవిష్యద్వర్తమానములు ఆయనకు తెలుసు. ఆయన వారిని ఆధ్యాత్మిక మార్గములో నడిపించి, చివరకు మోక్షప్రాప్తిని కలిగిస్తాడు. భగవంతుని అవతారమును గురించి ఆయన అవతార లక్ష్యమును గురించి నిర్వచించడం చాలా కష్టము. అందువలన నన్ను గురించి నేనే ప్రకటించుకుంటున్నాను. నా అవతార లక్ష్యము, నేను నిర్వర్తించవలసిన కార్యము, గత ఆవతారములకంటె భిన్నమైన ఈ ఆవతారము యొక్క ప్రత్యేక లక్షణములు, గుణగణములను నే నే స్వయంగా వివరిస్తున్నాను."
(దై.ది. పు. 290/291)
"చెంత చేరినటంచు సంతసించెదరన్న
వెంటనే ఎడబాటు చింత గూర్చు
ఏడిపించుట సాయి వేడుక యందురా
కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ
పొగడుచున్నారని పొంగిపోయెదరేమో
తప్పకప్పుడె ఎగతాళి చేయు
అభయమిచ్చెను గాన హాయిగా నుండెదరన్న
పడు బాధలకు అంతు పట్టకుండు
వెనుకకేగనీడు చననీడు ముందుకు
మనసు మరులు గొల్పి మధనబెట్టు
ఇట్టి చిన్నసాయి చిన్మయమూర్తిని
ఎట్టులెరుగ గలరు ఇలను మీరు".
(దైది.పు.292/293)
"ఇంత వరకు నా కార్యక్రమము ప్రారంభదశలోనే ఉన్నది. ఇకనుండీ ఈ కార్యక్రమము శరవేగముతో కొనసాగుతుంది. మానవుని ఆజ్ఞానము నుండి విముక్తి కలిగించే ఈ కార్యక్రమములో పాలు పంచుకోవడం ఇక మీ వంతు. గతంలో ఏ యుగంలోను కూడా భగవంతుని అవతరణను గురించి ఇంత స్పష్టముగా ఇన్ని సార్లు మానవజాతికి తెలియ జేయడం జరుగలేదు.
(దైది.పు.303)
"నాకు సంబంధించినంతవరహ నేను సృష్టించే అనేక వస్తువులు విజిటింగు కార్డుల వంటివి. నా భక్తులయందు నాకుగల ప్రేమభావమును వ్యక్తపరచడానికి, దీనికి బదులుగా వారి యొక్క భక్తిని స్వీకరించడానికి మాత్రమే వీటిని ప్రసాదించడం జరుగుతుంది. ప్రేమకు రూపముఅంటూ ఏదీ లేని కారణంచేత నా ప్రేమకు నిదర్శనముగా నా దివ్యసంకల్పముచేత ఉంగరములు, లాకెట్లు, జపమాలలు, హారములు, కంకణములు మెదలగు అనేక వస్తువులను సృష్టించి భక్తులకు ఇస్తుంటాను. వాటిని ధరించే భక్తులు ఏదైనా ప్రమాదకర పరిస్థితిలో చిక్కు కున్నప్పుడు లేక వారికి నా సహాయము అవసరమైనప్పుడు అవి వెంటనే మెరుపులాగా నాకు వార్తలు పంపిస్తాయి. నేను వెంటనే వారి ఆపదలు నివారించి వారికి సహాయము చేస్తాను. అనేక మైళ్ళ దూరములో మన్న ఆ భక్తులకు, నాకు మధ్య అవి ఒక లింకులా పనిచేస్తాయి. అయితే, ఈ బహుమతులను అందుకునేవారు మాత్రమే నా అనుగ్రహమునకు పాత్రులు, ఇతరులు కాదని భావించురాదు. ఏరూప, నామములతోనన్ను ప్రార్థించినా నా అనుగ్రహము అందరికీ అందుబాటులో ఉంటుంది. దీనిని పొందడానికి సాధనము మీకు, నాకు మధ్యనున్న ప్రేమబంధమే.
నన్ను గురించి నేను చెప్పవలసిన అవసరము వచ్చినది కనుక చెప్పుచున్నాను. అనంతశక్తి, అనంతత్త్వము, అనంత వ్యక్తిత్వము నాచేతులందున్నవి. నా శకులనేవి ఏనుగు ప్రమాణము కలిగి ఉంటే, యీ మహిమలనేవి దానిపై వ్రాలే దోమ ప్రమాణము కలిగి యున్నవి. కర్మ చక్షువులతో సత్యమును దర్శించడానికి వీలుపడదు. జ్ఞాన చక్షువులతో మాత్రమే సత్యస్వరూపమును దర్శించడానికి వీలవుతుంది. చాలామంది సాయి తత్త్వమును బాహ్యదృష్టితో చూచి సాయి ఇట్టివాడు, అట్టివాడు అని ప్రకటిస్తూంటారు. వీరు సాయిలోని పవిత్రతను, యదార్ధమును, నిత్యసత్యమును ఏ మాత్రము గుర్తించలేకున్నారు. సాయి శక్తి అపారము. అనంతము, సర్వశక్తులు సాయి హస్తగతమై యున్నవి.
నేను ఏది సంకల్పిస్తే అది జరిగి తీరుతుంది. నేను ఏ కార్యమును తలపెడితే అది విజయవంతమవుతుంది. నేను సత్యస్వరూపుడను. కనుక, నేనెవ్వరికీ లొంగను...
(దై.ది.పు.309/310)||
“నాలో ఉన్నట్టిది. ఎటువంటి కొలతలకు అందనిది, పరిమాణమునకు అతీతమైనది. పరిశోధనలకు గురికానట్టిది ప్రేమ ఒక్కటే. ఇది యింత అంత అని ఎవ్వరూ చెప్పలేరు. ఈ ప్రేమ తత్వమును గుర్తించి, అనుభవించినవారు మాత్రమే నన్ను కొంతవరకు తెలుసుకొనగలరు.
పరమాత్మను చేరుటకు ప్రేమ ఒక్కటే రాజమార్గము. ప్రేమ అనే మకరందము పరమాత్ముని పాదపద్మములందే దొరుకుతుంది..
(ప్రే. వా. విషయసూచిక తరువాత పేజీ)
పశ్చాత్తాపమనే ప్రాణసారం అందులో ప్రవహిస్తూ వుంటే ఈ వృక్షాన్ని నేను చిగురింపజేయగలను. మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను మీవైపుగా వంద అడుగులు వేస్తాను. మీరు ఒక అశ్రువు చిందిస్తే నేను మీ కన్నుల మంచి వంద బాష్పాలు తుడిచివేస్తాను. మీ ఆనందం అభివృద్ధి కావాలని నేను ఆశీర్వదిస్తారు. రాత్రి చలి ఎక్కువైతే కంబళి మరింత గట్టిగా కప్పుకుంటారు. అలాగే విచారం అధికమైనవేళ నామమవే రత్నకంబళంతో మీ మనస్సును కప్పుకోండి. ఇన్ని కోట్ల మంది భారతీయులలో మీ భాగ్య విశేషంవల్ల ఈ సన్నిధి మీకు లభించింది. అనుగ్రహమనే అమృతంతో నింపటానికి దుర్వాసనల మాలిన్యాన్ని తొలగించి పాత్రను శుద్ధి చేయాలి. పాత్రను పరిశుద్ధం చేసుకున్న తరవాత అనుగ్రహామృతాన్ని అర్జించండి. తరుణం దాటిపోయిన తరవాత అవకాశం జారిపోయిందని విచారించకండి. నన్ను గురించి ఒక్క క్షణంలో కాని, కొన్ని దినాలలో కాని మీరు తెలుసుకోలేరు. క్రమంగా కొన్ని దశలు దాటుతూ పోతే మీరు గ్రహించగలుగుతారు. వివేకవైరాగ్య, విచక్షణల ద్వారా నన్ను తెలుసు కోగలుగుతారు.
(వ.1963 పు 41/42)
మీయందు దివ్యత్వమనే జ్యోతి వెలగాలంటే అహంకార మమకారము లుండకూడదు. దీనికి నేనే చక్కని ఆదర్శం. ఎట్లా? ప్రతి రోజు మీరందరూ కూర్చున్న దగ్గరకు నేనే నడచి వచ్చి, నడుము వంచి, చేయి జూచి మీ నుండి ఉత్తరాలు తీసుకొంటూ ఉంటాను. అట్లుగాకుండా నేను అహంకారంలో ఒకచోట కూర్చుని, మీరే నాదగ్గరకు వచ్చి ఉత్తరాలివ్వండని అనవచ్చు కదా! అలా చేయను.
ఎందుకంటే నాకు అహంకారం లేదని నిరూపించి మీకు కూడా అహంకార ముండకూడదని ప్రబోధించేందుకు. వీరు నావారు, వారు పరాయివారు అనే అభిమానం కూడా నాకు లేదు. అందరూ నావారే, నేను మీవాడనే. ఈ సత్యాన్ని గుర్తించండి.
(స. సా.ఆ. 96 పు. వెనుక కవరు పేజీ)
మీ దుఃఖములను, రోగములను, సందేహములను, బాధలను నాకు సమర్పించి, వాటికి బదులు ఆనందమును నానుండి పొందండి. నే నానంద స్వరూపుడను. రండి. మీరు నన్ను విస్మరించినా, మిమ్ము నేను వదలి పెట్టను. దారి తెలియనట్టి, తెలిసినా విశ్వాసము లేని మీ వంటి వారికొరకే నేమ వచ్చింది. దాహముతో మీరు దోసిలి పట్టితే, మీరెక్కడ ఉన్నా, ఏవేళకై నా నేను వచ్చి అమృతము పోస్తాను. నేను మీ వెంటనే ఇంటనే, కంటనే, కంటికి రెప్పవలె యున్నాము. మీరు కలవరపడనవసరము లేదు.
(స. సా.మే.77 పు.68)
"ధర్మ నాశన మగుచున్న ధరణి యందు
ప్రభవ మందెను శ్రీ సాయి ప ర్తి యందు
ఇంతకన్నను వేరెద్ది ఎరుక ప ప ఱతు!
సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార!
(ఆ.ప్ర.వ.92 పు.23)
అడవిలో నున్నను | ఆకాశముననున్న
పట్టణమునున్న : పల్లెనున్న
గట్టుమీదను నున్న : నట్టేట నున్నను
మరువడు వీసాయి | మదిలోన నెప్పుడు -
(సా .పు. 2)
భక్తరక్షణమే నా ధర్మము. పెక్కు మంది భక్తులను ఒక్కని కాపాడుటకై, దుఃఖ సాగరమున ముంచుట ధర్మమా? యని నన్నొకరు ప్రశ్నించిరి. అట్టికార్యమువలన యితరులకు కించిత్ బాధ కలిగినను లె ఖ్ఖ చేయను. శ్రీరామచంద్రమూర్తి తండ్రి ఆజ్ఞను పరిపాలించెనే గాని అయోధ్య ప్రజల దుఃఖమును శమింపజేయుటకు ప్రయత్నించెనా? నేనిటుల భక్తరక్షణకు, కష్టములు సహించియైనా, చేసినపుడే భక్తులు నా ఆదర్శమును గ్రహించి, తామును అట్లే యాచరింతురు.
(సా॥ పు. 9)
యావత్ మానవకోటిని నా దివ్య ప్రబోధములచే దైవోపముఖులుగా మార్చెడి మానసిక పరివర్తనమును, ఉత్తేజమును, సంచలనమును. నా ప్రేమ ప్రభావముతో కలుగజేసి వారి నందరిని లాలించి, పాలించి, నాలో ఐక్యము చేసికోటమే నాలక్ష్యము. మానవత్వము నుండి మాధవత్వమునకు దారి చూపుటయే నా సంకల్పము.
(సా॥ పు. 3)
సత్యమే నా ప్రచారము
ధర్మమే నా ఆచారము
శాంతియే నా స్వభావము
ప్రేమయే నా స్వరూపము
(సా॥ పు. 24)
ధర్మము అడవికి పారిపోయింది. పట్టణములలో అధర్మము పాతుకుపోయింది. ధర్మాన్ని మరల తీసుకువచ్చి, అధర్మాన్ని ఆడవికి తోలటమే నాకర్తవ్యం.
(సా॥ పు. 120)
రిక్త హస్తాలతో రండి, నావద్ద నుండి ఆనందాన్ని నింపుకు వెళ్ళండి.
(పాః పు. 125)
నేను అందరి యందువున్నాను. నేను లేని చోటు లేదు. మీరు ఏ నామముతో పిలచినా పలుకుతాను. ఎందుకనగా, అన్ని నామములు, అన్ని రూపములు నావేగా!
(సా|| పు. 129)
నేనుండగా భయమెందుకు.
(సా॥ పు. 141)
రాముడు, కృష్ణుడు వారి అవతారాలలో ఆయుధాలు ధరించారు. అప్పుడు దుష్టశక్తులు కొద్దిగా యుండేవి. అందుచేత ఆయుధాలు ధరించవలసి వచ్చింది. ధర్మ స్థాపన కోసం కలియుగంలో కలి ప్రభావంచేత, కుల ధర్మములు పాటించక, పాపభీతి లేక స్వార్థపరులై అసత్యము, అన్యాయము, అక్రమ మార్గముల యందు, వారి ధీశక్తిని ఉపయోగించి యిహలోక సౌభాగ్య అమరకులై యుండునపుడు అవతార పురుషుడు రక్షించేదెవరిని? శిక్షించే దెవరిని? శిక్షార్హులందరిని శిక్షించిన, రక్షింప బడెటందుకు ఒక్కడు మిగలడు. కనుక యావత్ మానవకోటిని, నాదివ్య బోధనలచేత దైవోన్ముఖులుగా మార్చెడి, మానసిక పరివర్తనమును, ఉత్తేజమును, సంచలనమును, నా యొక్క ప్రేమ భావముతో కలుగుజేసి, వారినందరను లాలించి, పాలించి నాలో ఐక్యము చేసుకొనుటయే నా లక్ష్యము.
( సా పు. 144/145)
నేనే షిర్డీసాయిని - సర్వ ప్రాణులకు శరణ్యుడను, భరద్వాజుని గోత్రమున అవతరించుటకు అనుగ్రహించిన శివశక్తి స్వరూపుడను. నేనే భారద్వాజ ఋషి గోత్రీకుడను, ఆపస్తంబ సూత్రుడను.
( సా ,పు. 147)
సత్యమే నా ప్రచారం, ధర్మమే నా ఆచారం శాంతియేనా స్వభావం, ప్రేమయే నా స్వరూపం. ఇందులో ఏఒక్క దానిని, జీవిత పర్యంతం నా యందు పూర్ణ విశ్వాసముంచి, నిశ్చయింతురో, ఆ క్షణమునుండి మీరు నా వారలు, నేను మీ వాడనిని పేర్కొనుటే గాని, మీరు ఏ సమయమున, ఏ చోట నుండి ననూ, ఎట్టి కష్ట పరిస్థితులలో నున్నను పిలవకయే రక్షించెదము.
(సా . పు. 172)
నేను మీతో కలసి తింటున్నాను. మాట్లాడుతున్నాను. మీలో తిరుగుతున్నాము. మీరు భ్రమపడుతున్నారు. నేను మీ వలె సామాన్యుడనని. నేను పాడుతున్నాను, ఆడుతున్నాను మీతో బాటు. మీకు భ్రమ కల్పిస్తున్నాను. ఏ క్షణమైనా, నా స్వరూపం మీకు తెలియవచ్చు. ఆ సమయం కోసం మీరంతా తయారుగా యుండాలి. దైవత్వం మానవునిలో వుంది. మీరు మాయను అధిగమించాలి. మానవాకారంలోనే దివ్యత్వం వుంది. అది నామరూపాలతో వుంది. సర్వదైవత్వ స్వరూపమును ధరించిన మానవాకారమే యీ ఆకారము. మీరు సంశయింపవద్దు. మీరు నన్ను మీ హృదయాలలో స్థాపించుకున్నట్లయితే, నా నిజస్వరూపము మీకు గోచరిస్తుంది.
(సా! పు. 181)
చతుర్భుజములతోడను, శంఖచక్రములతోడను, నారాయణ రూపధారినై యవతరించి యుండిన నన్ను మీరొక విలాస మందిరమున బంధించి నన్ను చూడ దలచిన వారి యొద్దనుండి సుంకమును వసూలు చేసి యుందురేమో? సామాన్య మానవుని వలె బోధకుడనై మీకడకు వచ్చి యుండిన, నాశుభ సందేశములను, నుపదేశములను మీరు తిరస్కరించి యుందురేమో? కావున యిట్టి మహిమలను, మానవాతీత ప్రజ్ఞా వైభవమును, మానవాకారములోనే ప్రదర్శించుచుంటినని గ్రహింపుడు. సంపూర్ణ ప్రేమానంద స్వరూపుడనై, నా నిజబోధనలచే లోకమందలి యశాంతిని పరస్పర విరోధ భావములను రూపుమాపుటకు నిరంతరము కృషి సల్పుతున్నాను.
(సా పు. 189/190)
నాకు ఉన్న సంపద ప్రపంచములో ఏ చక్రవర్తికి లేదు. ఆ సంపద ఏమిటి? నానిస్వార్థ ప్రేమ.
(సా! పు. 201)
మానసికంగా ప్రార్థించు నాకు పూలదండలు అక్కరలేదు. పండ్లు అక్కరలేదు. అవి యేవినీవి కావు. బజారులో కొనుక్కొని వస్తారు. మీ నుంచి వచ్చిన వస్తువేదైనా యివ్వండి. పరిశుభ్రముగా యున్నది. పరిమళమైన మంచి గుణాలు, అమాయకత్వం నాకివ్వండి. అవి పశ్చాత్తాపము అనే కన్నీటితో కడిగి యుండాలి. దండలు, పండ్లు మీ గొప్ప తనాన్ని తెలియజేస్తాయి. బీదవారు వాటిని తేలేరు. పైగా వారు మానసికంగా బాధపడతారు. పరమేశ్వరుని మీ హృదయాలలో స్థాపించుకోండి, మంచి పనులు అనే పండ్లు, హృదయ నిర్మలమనే పువ్వుల దండలు నాకర్పించండి. అటువంటి ప్రార్థనయే నాకు చాల యిష్టమైనది. అటువంటి భక్తియే నన్ను పూర్తిగా ఆకర్షిస్తుంది. నేను యింతవరకు వ్యక్తిగతంగా సలహాలు యిస్తూ వుండే వాడిని. ఇప్పుడు ఉపన్యాసాల ద్వారా సలహాలు యిస్తున్నాను. ఇది మీకు కొత్తగా యుండ వచ్చును. నాకు ఏమియు క్రొత్త కాదు. నిరాకారుడు, సాకారుడు అయినప్పుడు వచ్చిన కర్తవ్యం, అనేక రీతులలో నేరవేర్చాలి. ఏ యుగంలోనైనా సరే, మానవునకు క్రొత్తగా విద్య నేర్పవలసి వస్తుంది.
( సా! పు. 202)
నిన్ను నీవు నమ్ము భగవంతుడిని నమ్ము అదే రాజమార్గము.
(సా! పు. 624)
నేను పురుషలలో పురుషుడిని. స్త్రీలలో స్త్రీని, చిన్న పిల్లలలో చిన్న వాడను. ఎవ్వరు లేక ఏకాంతంగా యుంటే దేవుడను.
(సా!॥ పు. 632)
నా అనుగ్రహము మెరుపులాగా వస్తుంది. అనుకోకుండానే నే పని చేస్తా.
(సా॥. పు. 644)
వెంట, జంట ఇంట వుండి కంటి రెప్పవలె కాపాడుచున్నాడు. కనుక ఈ విశాల తత్త్వాన్ని మీరు గుర్తిస్తే, భగవంతుని వెదకటానికి మీరెంత మాత్రము ప్రయత్నించరు. తాను లేని స్థానము, తనది కాని రూపము, జగత్తులో కానరాదు. ఈ విశ్వాసాన్ని మనము బలపరుచుకోవాలి. సరియైన భక్తుని లక్ష్యమిదే. జపములు, ధ్యానములు, పూజలు, యోగములు ఇవి అన్ని కాలమును పవిత్రము కావించుకునే కర్మలు మాత్రమే. ప్రేమ దైవము ఇటువంటి ప్రేమను అభివృద్ధి పరుచుకొని దైవత్వాన్ని ఎక్కడ చూచినా, అక్కడ ఉన్నాడనే విశ్వాసముతో అతనిని ధ్యానిస్తూ ఉంటే ఎక్కడంటే అక్కడే కనిపిస్తాడు. .
(సా! పు. 650)
నేను కాపాడదలచితినా, పూర్తిగానే కాపాడుదును. మొదలు జబ్బే రానీయను. ఆది వచ్చిన పిమ్మట, అందులో కొంత కుదిర్చి, కొంత మిగిల్చి, యతని సందరు గుర్తించునట్లు పడకలో పడియుండు స్థితిలో - విడుచుట యుండనే యుండదు.
(స.వ. పు. 24)
అవతారము యొక్క ప్రతిపవి. ప్రతి కార్యము ముందే నిర్ణీతమై యున్నాయి.
సత్యాన్ని, ధర్మాన్ని నిలబెట్టుటకు రామావతారం వచ్చింది. ప్రేమశాంతులను నెలకొ ల్పెటందులకు కృష్ణావతారము వచ్చింది. కాని యిప్పుడు చూస్తే ఈ నాలుగు పూర్తిగా ఎండిపోయే అపాయ స్థితిలో వున్నాయి. అందుచేతనే యీ ప్రస్తుత అవతారం వచ్చింది. అరణ్యంలో యున్న అధర్మాన్ని మరల పల్లెల పట్టణాలకు తరలించుకు రావాలి. మనలను నాశనము చేస్తున్న అధర్మాన్ని అరణ్యానికి పారద్రోలాలి...
ఆనందము, శాంతి పేటికలో యున్నది. దాని తాళపు చెవిని మీకు అందివ్వటానికి నేను వచ్చాను. ఆ సెలఏళ్ళు. ఎక్కడ తాకితే వస్తాయో అది చూపించడానికి వచ్చాను. మీరు వాటిని పూర్తిగా మరచిపోయారు. ఈ శుభసమయం మీరు ఉపయోగించుకోలేకపోతే అది మీ దురదృష్టము. మీరు నా వద్దకు చిన్న చిన్న విషయాలకు వస్తున్నారు.
(సా. పు. 216)
నన్ను సేవింపుము నాలోయున్న శక్తి తీసికో, నన్ను శరణాగతి పొందుము. అది నీవుత్సాహమును బట్టి ఆతురుతను బట్టి వుంటుంది. నీవు గ్లాసు పట్టుకువస్తే గ్లాసే నింపుతాను. బిందె పట్టుకువస్తే బిందె నింపుతాను. అంటె అంతటి ఆనందమే అందిస్తాము. నీఆదుర్దాలు, బాధలు, కోరికలు అన్ని నాకు విడిచిపెట్టు, నానుండి ఆనందం, శాంతి, శక్తి తీసుకు వెళ్ళు..
(సా పు . 424)
నిశ్చలమైన భక్తి, నమ్మకం యున్నవారికి నా అనుగ్రహం ఎల్లప్పుడు వుంటుంది. నేను వారితో సంభాషిస్తాను. పాడుతాను. కాని మేధావులు నా సత్యమును గాని, నాశక్తిని గాని, నా మహోన్నతాన్నిగాని నా అవతార కర్తవ్యాన్ని గాని అర్థం చేసుకోలేరు. నేను ఎట్టి జటిల - సమస్యనైనా పరిష్కరిస్తాను. ఎంత గట్టి పరీక్షలు చేసినా వారికి అందను. నన్ను అంచనా వెయ్యలేరు. నా ప్రేమ రుచి చూచిన వారికి ప్రేమానుభవము వున్నవారికి మాత్రమే నన్ను గురించి ఈ సన్మాత్రమైన తెలిసికోగలరు. ప్రేమ అనేదారి మాత్రమే మానవాళిని నా దగ్గరకు తీసుకు వస్తుంది. అదే రహదారి.
(సా॥ పు. 992)
ఈ అవతారములో దుష్టులను సంహరించను. వారిని బాగు చేస్తాను. వారి మనసునను సన్మార్గానికి త్రిప్పుతాను. చెడపట్టిన చెట్టును నరికి వెయ్యను. దానిని రక్షిస్తాను. ఈ అవతారము భక్తులకోసం వచ్చింది. సాధువులకు, సాధకులకు మాత్రమే వచ్చింది. ఈ అవతారమునకు జపమక్కరలేదు. ధ్యానం గాని, యోగం గాని అక్కరలేదు. ఎవ్వరిని ప్రార్ధించదు. ఎవ్వరికి పూజ చెయ్యదు. ఎందుకనగా ఇదే “మహాతో మహియాన్" అన్నింటి కంటే గొప్పది. పెద్దది కనుక ఎట్లా పూజ చెయ్యాలో, ప్రార్థించాలో మీకు నేర్పుతుంది.
(సా! పు. 398)
ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు అనుగ్రహము పొందటానికి దైవత్వంలో నమ్మకాన్ని వృద్ధి చేసుకోవాలి. సమస్యలను మనో వేదనలను మీరు నిజంగా ఆహ్వానించాలి. అవియే మీకు నమ్రతను, అణకువను దైవత్వాన్ని అందిస్తాయి. బాహ్య విషయాల వెంట తిరగడం, పరుగెత్తడం అసంతృప్తికి కారణమవుతుంది. కోరికలకు అంతులేదు, ఇంద్రియములకు ఒకసారి బానిస అయిపోతే, చచ్చేటంతవరకు అవి నిన్ను విడిచి పెట్టవు. అది తీరని దాహము. కాని నేను మిమ్ములను పిలుస్తున్నాను.
ప్రాపంచిక వరాలు కూడా యిస్తాను. దానిచేతనైన మీరు నమ్మి భగవంతుని వైపుకు తిరుగుతారు. ఇంతవరకు ఏ అవతారము యిట్లా చెయ్యలేదు. ప్రజల మధ్య తిరగటం, సలహాలు ఇవ్వడం, మంచి మార్గాలు చూపడం, ఓదార్చడం, ఉన్నత స్థితికి వెళ్ళడం.
(సా!! పు. 270)
నా శక్తిని ఎవ్వరు కొలవలేరు. మీరు నన్ను ఎంత గట్టిగా పరీక్ష చేసినా తెలుసుకోలేరు. నాసత్యాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. అది ఆంతులేనిది. నన్ను ఏ పనిముట్టులోను కొలవలేరు. నాకు తెలియనిది లేదు. నేను పరిష్కారము చెయ్యలేని సమస్య లేదు. నా పరిపూర్ణతకు అంతులేదు. నేను పరిపూర్ణుడను.
(సాపు. 340)
నా శక్తికి పరిమితి లేదు. ఇది అవ్యయము. సముద్రమువలె అనంతము. ఎవరైననూ, ఎక్కడున్ననూ, ఏమి కావలెనన్ననూ, కావలసినంత తిసికొనవచ్చును.
(స.. సా జూ85, పు. 181)
నేను మీ హృదయంలో వున్నాను. కాబట్టి, మీ బాధలు నాకు తెలుసు. మీసంతోషాలు తెలుసు. నేను ప్రతివారి హృదయదేవాలయములోనే నివసిస్తూ వుంటాను. నన్ను మరచి పోవద్దు. నన్ను అంటి పెట్టుకునే ఉండండి. ఎందుకంటే, నిప్పు ఉన్న ఒకబొగ్గు ముక్క, ఇంకొక బొగ్గుముక్క అంటి పెట్టుకుని ఉంటే, అది కూడా నిప్పు ఉన్న బొగ్గుగా మారుతుంది. మీహృదయంలో, మీరు నా దగ్గరగా యుండునట్లు అలవాటు చేసుకోండి. మీరు బాగుపడతారు. మీరు కూడా నా అనంతమైన ప్రేమనుండి కొంత ప్రేమను పొందుతారు. ఇది యొక గొప్ప అవకాశం. మీరందరును, మోక్షము పొందుతారని నమ్మండి. మీరంతా రక్షింపబడతారని తెలుసుకోండి. చాల మంది ఇంతకంటె మంచి పరిస్థితులు వస్తాయని నమ్మటం లేదు. జీవితం సుఖమయం అవుతుందని, ఆనందమయం అవుతుందని, మరల స్వర్ణ యుగం వస్తుందని నమ్మటానికి చాలా మంది జంకుతున్నారు. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను.
ఈ ధర్మ స్వరూపుడు ఈ దివ్య శరీరము నిష్కారణంగా రాలేదు. మానవ సమాజమునకు వచ్చిన సంక్షోభం నివారించటంలో జయము పొందుతాడు.
(సా॥ పు. 290)
నాకు కోరికలు లేవు. అందుచే పుట్టవలసిన పని లేదు.
(సా॥ పు. 442)
నేను భగవంతుడను. మానవ రూపములో వచ్చినాను. నేను మానవుల మధ్య తిరుగుతున్నాను. నా మాటలువింటారని, నా సమీపమునకు వస్తారని, ప్రేమిస్తారని, ఆజ్ఞ పాలిస్తారని, నేను మానవ భాషలోనే మాట్లాడాలి. మానవుడిలా ప్రవర్తించాలి. అట్లా ఉండకపోలేక నన్ను నమ్మరు. తోసివేస్తారు. లేక భయపడి దగ్గరకు రారు.ప్రేమాస్పదుడవు. అందుకే ప్రేమ బోధిస్తాను. నన్ను ఎవ్వరు తెలుసుకోలేరు. ఈ ప్రపంచాన్ని సృష్టించాను. పర్వతాలు వచ్చాయి. నదులు ప్రవహిస్తున్నాయి. భూమి ఆకాశములు అప్పుడే వచ్చాయి. సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు, అడవులు ఎడారులు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా నన్ను జ్ఞాపకం చేయడానికే. అప్పుడు ప్రాణకోటి అంతా వచ్చింది. మానవులు, పక్షులు, జంతువులు. మొదటి స్థానము మమష్యులకే ఇచ్చాను. నన్ను గూర్చిన జ్ఞానము మొట్టమొదటిగా మానవుని హృదయంలో వుంచాను. నా ప్రేమకించితులోనే మీరంతా జీవిస్తున్నారు.
(సా ॥ పు. 483)
ప్రేమనా స్వరూపము, సత్యం నా ఊపిరి, ప్రచారం, ఆనందం నా ఆహారం నిస్వార్థ సేవ నా సందేశం, విశాల హృదయం నా జీవితం, ధర్మం నా ఆచారం, శాంతి నా స్వభావము.
(సా! పు. 515)
మీరంతా దివ్యాత్మ స్వరూపులు, ప్రేమాత్మ స్వరూపులు, స్వచ్ఛమైన ప్రేమ మూర్తులు. దివ్య ఆత్మ ఆవతారమూర్తులు,
(సా పు. 535)
నేను మీ హృదయాలను వెలిగించటానికి వచ్చాను. అది రోజురోజుకు ప్రకాశవంతంగా చేస్తాను. ప్రేమను స్థాపించు, ప్రేమలో నివశించు. ప్రేమను వెదజల్లు. ఈ ఆధ్యాత్మిక జీవితమే ఆనందాన్ని ఇచ్చేది.
(సా॥ పు. 541)
ప్రేమించు, ప్రేమిస్తూనే యుండు. అన్ని విషయాలు అవే బాగుపడతాయి.
(సా||పు. 547)
నాబలవత్తర శక్తి ఏమంటే వా ప్రేమ. నేను ఆకాశాన్ని భూమిగాను భూమిని ఆకాశంగాను మార్చగలను. కాని ఆది దైవత్వముకాదు. అనుపమానమైనది దైవత్వమే.
(సా॥ పు. 553)
నా అనుగ్రహము కోసం పట్టుపట్టుము. ఆదేశించుము. కోరుకొనుము. పొగడవద్దు. మీహృదయాలను నావద్దకు తీసుకురండి. నా హృదయం జయించండి . మీరెవ్వరు నాకు కొత్త కాదు. మీ కోరికలను నావద్దకు తీసుకురండి. మీ కోరికలలోని నిజాయితీని స్వచ్ఛతతో బాటు మీ హృదయాలు నిర్మలంగా ఉండాలి. నాకు అంతే చాలు.
(సా॥ పు. 559)
నా జీవితమే నా సందేశము.
(సా! పు. 569)
ప్రపంచంలో ఒక్కటే కులం వుంది. అది మానవకులం ఒక్కటే మతం - అది ప్రేమ మతం. ఒక్కటే భాష - అది హృదయంలో నుంచి వచ్చిన భాష ఒక్కడే భగవంతుడు
అతడు సర్వాంతర్యామి.
(సా ॥ పు. 559)
ఏ దేశ మేగినా ఈ నామమే సుమీ
సత్యసాయీ అనుచు నిత్యపఠన.
ఏ ఊరు చూచిన ఈ నామమే సుమీ
సత్యసాయీ అనుచు నిత్య జపము.
ఏ నోట విన్ననూ ఈ నామమే సుమీ
సాయిరామా అనుచు సత్యజపము.
ఎచ్చోటో విన్నను ఈ నామామే సుమీ
సత్యసాయీ అనుచు నిత్యభజన.
ఇట్టు విశ్వమెల్లడ వ్యాప్తియై వెలయునట్టి
భక్త జనులకు ప్రాపునై బరగునట్టి
భక్తినొసగి రక్షించెడు శక్తిమయుడు
పర్తివాసుడు మిమ్మల ఎత్తుకొనడు?
ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు
ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు
ఏ గుణంబు గణించి ఏతెంచె నోనాడు
కరిని గాచెడు తరి కమలనయనుడు
ఏ గుణంబు గణించి ఏతెంచె నోనాడు
పేద కుచేల బ్రోవ వేదచరితుడు
ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు
ధృవ కుమారుని సాక వైకుంఠవాసి
ఆ గుణంబె గణించి అమరవంద్యుడు
ఆర్త జనార్త నాధుడు అనాధ నాధుడు
శ్రీ సత్యసాయి నాధుడు శ్రీనాధు లోకనాధు
సచ్చితానంద మూర్తి పుట్టపర్తి షడ్చక్రవర్తి.
(శ్రీ.. స..ప్ర.పు.71)
ప్రేమతత్త్యము ప్రబోధించి
మమత సమతను పొందుపరచి
మానవత్వపు విలువ దెల్పిన
ప్రేమమూర్తియె సాయిదేవుడు.
(స. సా.పి.95పు.29)
"వేద శాస్త్రాలను భారత సామ్రాజ్య హృదయంలో తిరిగి స్థాపించి, ప్రజలకా విజ్ఞానాన్ని వెల్లడి చేయడం నాముఖ్య కార్యం! ఈ నిర్ణీత కార్యం (మిషన్) నెరవేరుతుంది. ప్రభువు నిశ్చయించుకొని సంకల్పించి నపుడు దానికి ఎటువంటి విఘ్నాలు సంభవించినా అది ఆగిపోదు. మందగించదు. ఆయన దివ్యానుగ్రహానికి ఆటంకం ఎన్నటికీ ఉండదు."
(లో.పు.88)
"ప్రేమ నా ప్రత్యేకమైన చిహ్నంకాని; విభూతి ఇతర భౌతిక వస్తువులు సృష్టించడం, సంకల్పమాత్రం చేతనే ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగించడం మొదలైన వేవీకాదు. ఈ మహిమలనే వాటిని దివ్యత్వానికి చాలా స్పష్టమైన గుర్తుగా మీరు భావించవచ్చు. కాని, మిమ్మల్నందరినీ సంతోషంతో ఆదరించేదీ ఆశీర్వదించేదీ; అన్వేషకులు, బాధలు పడుతున్నవారు, ఆపదలలో చిక్కినవారు ఇక్కడ ఉన్నా దూరప్రాంతాల్లో ఉన్నా ఎక్కడున్నా వారి వద్దకు నేను పరుగెత్తి వెళ్ళేలా చేసేదీ అయిన ప్రేమే నిజమైన గుర్తు"
(లో.పు.26)
"నాకు నిశ్చింత, విశ్రాంతి సంతృప్తి ఎప్పుడు కలుగునో తెలియునో, మీరందరూ ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యము, సేవాతత్పరత అలవరచుకుని ఆనందముగా వున్నప్పుడు. నేను నిరంతరము ఏదో ఒక కార్యకలాపము నందు నిమగ్నుడనై యుండుట మీ మేలుకొరకే, నేనేమీ చేయక పోయినను నన్నడుగ గల వారెవరును లేరు. నాకు వచ్చు నష్టమూ లేదు. నేను ఎట్టికర్మనూ ఆచరించ నిచ్చగించను. అయిననూ, నిరంతరమూ మీ కుత్సాహము, ఉత్తేజమూ కలిగించి మిమ్ము దైవోన్ముఖులుగా చేయు నుద్దేశ్యముతో ఆచరణ రూపమున మార్గదర్శిగా యుండుట కిట్లు సదా కార్యాచరణ యందు నిమగ్నుడ యుండెదను."
(స.శి..సు.త్వపు 20)
ఏ దీర్ఘరోగ నివారణకొరకో నా వద్దకు వచ్చెదరు. నా తత్వమును గ్రహించిన పిదప భవరోగ నివారణ కొరకు నన్నా శ్రయించెదరు. దానికి నేనెప్పుడూ సిద్ధముగనే పున్నాను."
"నేను ప్రేమపూర్వకముగా మీ శ్రేయస్సు కొరకు దివ్యౌషదము వంటి సలహాల నిచ్చినాను. వాటిని గూర్చి నిత్యమూ మననము చేసుకొనుడు. పశ్చాత్తాపములో మీహృదయములను పరిశుద్ధము చేసుకొనుడు. దుశ్చింతలను దరిచేరనీయకుడు. దృఢ సంకల్పములో మీ జీవితములను సంస్కరించుకొనుటకు పూను కొనుడు. భగవదనుగ్రహముతో మీ నిండు హృదయములు పుష్పించు మార్గమును త్రికరణ శుద్ధిగా ఆవలంభించుడు."
(స.శి.సు.తృపు.23)
సమస్తము నాకు అర్పించి నన్ను శరణువేడిన భక్తుల బాధలను స్వీకరించుట నాకర్తవ్యము. నాకు బాధలేదు. నాకర్తవ్యమును నిర్వర్తించుటలో నేను అనుభవించు బాధ నాకు ఆనందదాయకమైనది. ఆ పరిస్థితులలో నా బాధను జూచి మీరు బాధ పడకూడదు. తనయందు విశ్వాసము చూపిన వారి కొరకు క్రీస్తు తన ప్రాణమునే త్యాగము చేసెను. సేవాధర్మమే భగవత్స్వరూపము. త్యాగమే ప్రేమకు పరాకాష్ట , అదే దైవము.
(స శి.సు.తృపు.49)
"నేను మానవుడను కాను. మానవాతీతుడను కాను, భగవంతుడను కాను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడను కాను. నేనెవరివని మీరడుగవచ్చు. నేను సత్య ప్రబోధకుడవు, నేనే సత్యం, శివం, సుందరం"
(స శి.సు.తృపు,98)
నానుంచి ప్రసారమయ్యే కిరణాలు మూడు రకాలు. ఒకటి స్థూలము. అవి ప్రశాంతి నిలయమంతా నిండి ఉంటాయి. రెండవది సూక్ష్మము. అవి భూమి అంతటా వ్యాపించి ఉంటాయి. మూడవది కారణము, అవి విశ్వమంతటా పరివ్యాప్తమై ఉంటాయి. ఇక్కడ నిలయంలో నివాసం ఉండేవారు ఈ కిరణాలకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న కారణంగా వారెంతో అదృష్టవంతులు. స్థూల కిరణాలు మానవుణ్ణి సాధకునిగా తయారు చేస్తాయి. సూక్ష్మకిరణాలు మహాత్మునిగా తయారు చేస్తాయి. కారణ కిరణాలు మానవుణ్ణి పరమ హంసగా మార్చివేస్తాయి. అందువల్ల మీరు సమయాన్ని ప్రాపంచికమైన కోరికలలో, వాటిని నెరవేర్చుకొనే ఆలోచనలతో వృథా చేసుకోకండి.ఈ విషయంలో జయాపజయాల గురించి, సుఖ దుఃఖాల గురించి యోచించవద్దు. మీ కోసము షడ్రసోపేతమైన విందు సిద్ధంగా ఉంటే మీరు వారి టేబుల్ దగ్గర. వీరి టేబుల్ దగ్గర పడిన చుక్కలు రుచి చూడటానికి ఎందుకు వెళతారు? అది సరియైన పద్ధతి కాదు. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనమూ లేదు.
(వ.61-62 పు.179/180)
"సాయి శక్తి అనంతము, అపారము. సర్వశక్తులూ సాయి అరచేతి యందున్నవి. తమకు అన్నియు తెలుసు" అనుకొనే పండితుడు, యోగులు, జ్ఞానులు - వీరందరూ ఆ మహాశక్తిలో అత్యల్పభాగాన్ని మాత్రమే అర్ధం చేసుకోగలిగారు. అన్ని యుగములలోనూ ఇదే పరిస్థితి. శారీరకంగా అవతార పురుషునికి సన్నిహితముగా ఉండవచ్చును. కానీ, అట్టివారు తమకు దొరికిన లబ్ధిని గుర్తించి, వర్తించలేకున్నారు. పైగా నా మహిమలను గురించి అతిశయోక్తులుగా చెబుతారు. ఇవన్నీ నా విభూతితో పోల్చిన, ఏనుగుతో పోల్చిన దోమవంటిది. అందుచేత. నా నిజ తత్వమును మరచి, మీరు ఈ మహిమలనే తలుచుకుంటే, నాలో నేను నవ్వు కుంటుంటాను. మహిమలము గురించి అంత ప్రాముఖ్యత నివ్వవద్దని హెచ్చరించుచున్నాము. వీటన్నిటికన్న అతి ప్రధానమైన శక్తి నాలో ఒకటి ఉన్నది. అదే నా ప్రేమ"
.
"ఏను దైవంబు - తద్భిన్న మేమికాను
ఆయఖండ పరబ్రహ్మ మౌదునేను
వ్యధలు కేశాలు నమ స్పృశింపంగ లేవు
సచ్చిదానందుడను సత్యసాయి విభుడు
"నేను దైవాన్ని - పరబ్రహ్మమూర్తిని
సచ్చితానందుణ్ణి - నేడు సత్యసాయిగా అవతరించాను.
(స.సాన.99 పు 309)
ఉత్తమాటలచేత చిత్తము-సత్తుచిత్తానంద మొందరు
విత్తనంబులు లేని భూమిలో-మొత్తముగ పంటేమి పండదు
కన్ను విప్పి చూడరోరన్నా-శ్రీసాయి దేవుని
ఎన్నగా ఎందైన గలడన్నా!
మున్ను షిరిడీ నేడు పర్తీ-ఉన్నవాడని పేరే కానీ
తన్ను భావనచేయు భక్తుల కన్నులందే మెలగునన్నా!
(శ్రీ.స.వి.వా.పు.1)
రాగమును అరికట్టనేరక- యోగియైనను పతనమందును
భోగమును విడనాడు వారికె యోగమది లభియించునయ్యా
కన్ను విప్పి చూడరోరన్నా! శ్రీసాయిదేవుని
ఎన్నగా ఎందైన గలడన్నా.
గట్టు జేర్పుమటన్న వారికి గట్టి యోడను పట్టి చూడగ
పట్టుబట్టలు గట్టిచుట్టు తిరిగే పుట్టుస్వామిని
కన్ను విప్పి చూడరోరన్నా! ఒట్టిమాటలవాడు కాడన్నా
ఈ సాయిదేవుడు బొట్టబొమ్మల చూడబోడన్నా!
(శ్రీ స.వి. వా. పు. 14)
ఇంద్రియంబుల మనసు నిలిపిన
అంధుడై నను ముక్తి పొందును
ఇంద్రియంబుల నిగ్రహించని
చంద్రుడైన పసందు లేదను
కన్ను విప్పి చూడరోరన్నా!
ఈ సాయిదేవుని - యెన్నగా యెందైన కలడన్నా!
మున్నుషిరిడీ నేడు పర్తీ - ఉన్నవాడని పేరెగాని
తన్ను భావన చేయు భక్తుల - కన్నులందే మెలగునన్నా
కన్ను విప్పి చూడరోరన్నా!
(శ్రీస.వి.వా. పు. 29)
ఒట్టి మాటలవాడు కాడన్నా - ఈ సాయిదేవుడు
బుట్టబొమ్మల చూడబోదన్నా
గట్టువేర్పు మటన్న వారిని - గట్టి ఓడను పట్టిచూడగ
పట్టు బట్టలు కట్టి భక్తుల - చుట్టు తిరిగే పొట్టి
స్వామిని కన్ను విప్పి చూడరోరన్నా:
(శ్రీ స.వి.వా. పు. 38)
నీతి నియము లేక తిరిగిన –
ధాతకైన ఆజ్ఞాన మొదగదు
జ్యోతిలేనిది ఆంధకారము –
భూతలంబున లేదటంచును
కన్ను విప్పి చూడరోరన్నా –
ఈ దేవదేవుని యెన్నగా
యెందైన కలడన్నా!
(శ్రీ స.వి.వా.పు.47)
బుద్ధి నిలకడలేని మనువాడు –
పొంద జాలడు శాంతి సుఖములు
విషయసుఖములు వెంట పరిగిడు –
వెఱ్ఱి జీవికి ఎచట శాంతి?
కన్ను విప్పి చూడరోరన్నా !
(శ్రీ.స.వి.వా.పు.54)
అల్ప గురువుల చెంత చేరకు –
స్వల్ప గుణములు చింత చేయకు
తలపులన్నియు నిలిపి వేసిన –
తనువుకెప్పుడు జన్మలేదు!
కన్ను విప్పి చూడరన్నా!
(శ్రీస.వి.వా.పు.68)
అన్ని మతములు తననె చూపును –
అన్ని మూర్తులు తనవె రూపులు
అన్నిటందున తానె యుండుగ –
అదియె గదరా బ్రహ్మపదము
కన్ను విప్పి చూడరోరన్నా!
ఈ సాయిదేవుని ఎన్నగా ఎందైన గలడన్నా!
మున్ను షిరిడీ నేడు పర్తీ –
ఉన్నవాడని పేరెగాని
తన్ను భావనచేయు భక్తుల –
కన్నులందే మెలగునన్నా
కన్ను విప్పి చూడరోరన్నా!
(శ్రీ స.వి.వా. పు. 95)
మతము మతముకు మధ్య ద్వేషము -
దేశదేశములందు రగడలు - దేనికయ్యా!
మత ప్రబోధలు కన్ను విప్పి చూడరోరన్నా –
ఈ సాయి దేవుని ఎన్నగా ఎందైన గలడన్నా!
మొన్న షిరిడి నేడు పర్తీ - ఉన్నవాడని పేరెగాని
తన్ను భావన చేయు భక్తుల –
కన్నులందే మెలుగునన్నా!
(శ్రీస.వి.వా. పు. 190)
కనుల కగుపించు దృశ్యంబు
కాంచి మీరు సత్యమని
ఎంచబోకుడి సంబరమున
తెరను దాగిన సత్యంబు తెలసికొనగ
విశ్రమింపక నాతోడ వెడలిరండు.
(శ్రీస.వి.వా. పు.80)
"రండి పరీక్షించండి. అనుభవించి ఈ తరువాత విశ్వసించండి. అంతే కాని, ఎవ్వరో ఏదో చెప్పినారని, విశ్వాసము పోగొట్టుకొనవద్దు"
(స. సా. ఫి. 75 పు. 372)
ఆనంద బాలుడే ఆనంద బాలుడై
తన వారి గుర్తింప తరలి వచ్చె;
ఆ రామచంద్రుడే ఈ రామచంద్రుడై
తన బంటులను కనుగొనగవచ్చె:
ఆ యీ శుడే బాల సాయీశుడై నేడు
తన గుంపులో ఆడుకొనగవచ్చె:
ఆ మహావిష్ణువే యీ మహావిష్ణువై
తన ఆయుధములు చే కొనగవచ్చె
అల్ల పరమాత్మ యను బొమ్మలాటగాడు
తాను జీవుల రంగస్థలాన నిలిచి
ఆడు ఆనాటి ఈనాటి ఆట జూచి
సుంత వర్ణించి కొంత సంతసము గనుడు.
(స. సూ. ప్ర. భా. 1976 పు.2/3)
నేను ప్రతి ప్రాణి హృదయమునందున్నాను. ఈ ప్రాణికి తెలిసినా తెలియకున్నా, నేనక్కడ ఉన్నాను. నేను వానిని ప్రేమించి, వాడా ప్రేమను తిరిగి నాకిచ్చిన యీ రెండు ప్రవాహము లౌక దాని లోనికి మరొకటి ప్రవహించుతవి. ఆ విధముగా అవి సంగమించటముతో రోగ నివారణ కలుగుతుంది. ఈ విధముగా నా భక్తుల యొక్క సవ్యమైన లౌకిక వాంఛలను తీర్చి, తర్వాత ఆధ్యాత్మిక కోరికలు కోరునట్లు చేయగలను. ఈ లీలలు నేను గావించుట లేదు. అవి నాలో నుండి ప్రకటిత మవుతున్నది. ఈ విధముగా నా ప్రేమ నిర్గమించుచున్నది.
(శ్రీ స.సూ. 5/6)
మీరు నన్ను పొందే ప్రయత్నము చేయనక్కర లేదు. మీకు నా అవసర మున్నదని విశ్వసించిన చాలు. అనగా మానవుడు నాకు శ్రీ సత్యసాయి బాబా కావలెను. కావున నాకు వారిని పొందే అర్హత ఉన్నది అని గ్రహించ వలెను.
(శ్రీస.సూ. పు.6)
నాకు ఊరు లేదు; పేరూ లేదు. ఏఏ పేరుతో పిలిచినను పలుకుదును; ఏ ఊరికి పిలిచిననూ పోవుదును. నేను బాలుర నడుమ మున్నపుడు బాలుడను. స్త్రీల నడుమ నున్నపుడు స్త్రీని, ఒంటరిగా నున్నపుడు పరమాత్మను.
(శ్రీ.స.సూ.పు.7)
మీరు నన్ను వదిలినా, నేను మిమ్ము వదలను. ఒక్కసారి పట్టుకొనిన నా పట్టు నుండి మీరు తప్పించుకొనలేరు. మీరు నాకు సన్నిహితులు, ప్రేమ పాత్రులు అయ్యేకొలది మీరు దహింపబడే అవకావము అధికముగా ఉంటివి. (దహింపబడుట అనగా అమితముగా పరిశుద్ధముగావలసి యుండుట).
కేకి పించాక్షములవలె దుర్బలులు చలించుతూ ఉంటారు. క్షణకాలము కూడ నిశ్చలముగా ఉండలేరు. వారి మనస్సు లోలకము వంటిది. లోలకమువలె ఆనంద దు:ఖముల మధ్య ఆటు నిటు భ్రమించుతుంటారు. విశ్వాస అవిశ్వాసముల మధ్య కంపించుచుంటుందా లోలకము. ఒకసారి స్వామియందు విశ్వాసముంటుంది మరుక్షణమే సందేహము కలుగుతుంది. సంశయములో చలించురూ ఉంటారు. హృదయమును స్థిరముగా ఉంచుకొనుట నేర్చుకొనవలెను. వచ్చి, పరీక్షించి, అనుభవించి ఆ తర్వాత విశ్వసించండి. అంతే కాని ఎవ్వరో. ఏదో చెప్పేరని విశ్వాసము పోగోట్టుకొనవద్దు.
(స.సూ, పు.17/18)||
నా రహస్యమును నెవ్వరు తెలిసి కొనలేరు. నా విజతత్వమును గురించి మీరు వాదోపవాదములు చేసియు లాభములేదు. తింటే రుచి, మునిగితే లోతు తెలియునట్లు సత్యము, ప్రేమ అభివృద్ధి చేసికొనిన నాకు ఇది కావలెను, ఆది కావలెను అని మీరడుగ నక్కరలేకయే నేను మీ కోర్కెలను తీరుస్తాను. మీరడుగకుండనే నా నుండి అన్నియు మీరు పొందగలరు. నరుడు నారాయణుడు అనునవి రెండు విద్యత్ తీగలు. ఆరెంటిని కలిపిన, విద్యుచ్ఛక్తి దానంతటదే ప్రవహించును. సత్యము, ప్రేమ అను సద్గుణములలవరచుకొని నరుడు నారాయణునిలో సహకరించిన, దివ్యశక్తుల సాధనగా తయారుగును.
(శ్రీ స.సూ. పు. 7)
మీరందరును నాకడకు వచ్చి, నేను చెప్పు విషయములు శ్రద్ధతో వినుచున్నారు కదా! ఆట్లు వినుటవలన మీరు పొందుచున్న లాభమేమి? ఏదో యానందము ననుభవించు చున్నారు. అదుగో ఆ యానందము కొరకే సత్సాంగత్యము చేయవలసినది. మంచి పనులు, మంచి యాలోచనలు చేయవలసినదియు అందుకొరకే. ఇంకొకమాట: నేను మీకానందము నిచ్చుచున్నానని మీరంగీకరింతురు కదా. మరి యందుకు ప్రతిగా మీరు నాకిచ్చునది యేమి? నాకేమియు నియ్యనక్కర లేదు. మీరు, నేను చెప్పినట్లు చేయుడు: నా యుపదేశముల నభ్యాసములో పెట్టుకొనుడు. అది చాలును. అంతమాత్రమే నేను మిమ్ము కోరునది.
(శ్రీ.స.సూ..పు.13/14)
మీరు మీకు మార్గదర్శిగా నన్నెన్నుకొనుట, యెంత గొప్ప యదృష్టమో, మీరిప్పుడు తెలిసికొనలేరు.
మిమ్మందరిని చక్కగా సంస్కరించు వరకును నేను విశ్రాంతి తీసికొనను.
(శ్రీస.సూ.పు.15)||
మీరందరు నూతన గృహములు నిర్మించి, వాటిలో భగవానుని ప్రవేశ పెట్టవలెనని నా కోరిక. గృహములనగా డబ్బుతోను ఇటుకలతోను కట్టునవి కాదు. నా భావములు, మంచి యాలోచనలతోను, మంచి మాటలతోను, మంచి పనులతోను, మంచి సహవాసము తోను సాశీల్య మను గృహము నిర్మించుకొని, అందులో శాంతముగను, నిర్విచారముగము జీవింపవలె. అట్టి గృహప్రవేశమునకు మీరు నన్ను ఆహ్వానింపుడు. తప్పక వత్తును. వాస్తవానికి, ఇంతకు పూర్వమే ఆది వా ఇల్లు, కనక, ఆ గృహమునకు వచ్చుటకును, అందు ప్రవేశించుటకును, మీ యాహ్వానము కూడా అక్కరలేదు. నాకై నేనే వత్తును. ఇప్పుడు మీరు నివసించుచున్న గృహములు ప్రాపంచిక సుఖముల కొరకు, ఆ గృహము ఆధ్యాత్మికానందము కొరకు: పవిత్రమును, నన్నభిలషించు నదియు నైన హృదయమే నా నివాస స్థలము.
(శ్రీస.సూ, పు. 15/16)
తమ తమ శక్తి కొలదిని. అవకాశము కొలదిని కృషి చేయుచున్న అన్ని సభలును. అన్ని సంఘములును నాకు ప్రియములే. విడి విడిగా పని చేయుచున్న వ్యక్తులను నా ప్రేమకు పాత్రులే. నన్ను పూజింపవలెనని గాని, నన్నే నమ్మవలెననిగాని నేను మిమ్ము శాపించను. మీయందు మీకు నమ్మకము వృద్ధి చేసికొనుడు. మిమ్ము తన సేవ కుపయోగించు కొనుచున్న ప్రభువును పూజింపుడు. ఇంతమాత్రమే నేను మిమ్ము కోరునది. అన్నింటికిని ప్రభావమైనది ఆత్మయని తెలిసికొనుడు. అది నాకు చాలు.
స్తోత్రములకూ, బూటకములకు నేను విముఖుడను. అవి నా స్వభావమునకును, నాయాశయమునకును కేవలము విరుద్ధములు.
(శ్రీ.స.సూ, పు.16)
నన్ను గూర్చి, నా మహిమల గూర్చి, దాని యొక్క నిజా నిజములను గూర్చి వృధాగా తర్కములెందుకు? ఆకాశమును చేపలు గుర్తింప గలవా? స్థూలవస్తువును స్థూల వస్తువే గ్రహించును. కంటి దగ్గరనే చెవి యుండినను కన్ను చెవిని చూడలేదు కదా! నీ వెవరైనది తెలిసికొనలేక యుండునట్టి నీవు భగవానుని రహస్యముల కనిపెట్టుటకు ప్రయత్నించి కాలయాపనము జేసెదవు. భగవానుని జగన్నాటక ప్రదర్శనములోని యంతరార్థములను మానవుడెన్నటికి గ్రహింపలేడు. భగవదనుగ్రహమును బొందుటకు తగిన ఉపాయములను, సాధనములను, శ్రద్ధాభక్తులతోడను, పట్టుదలతోడను నాచరించుచుండిన యెడల నీ సుకృతము వలనను, నా యనుగ్రహమును వలనను అణుమాత్రము నన్నుతెలిపి కొందువు.
(శ్రీస సూ.పు.34/35)
నా బోధనలననుసరింపుడు. శ్రేయోమార్గమున మిమ్ముల గొంపోయెద. నా సందర్శన, స్పర్శన, సంభాషణములు మొదలగు వానివలన మీ కష్టములు నివారణమై మనశ్శాంతి కలుగును. ఎవ్వరైన మిమ్ములను శ్రద్ధతో భగవానుడెందున్నాడని ప్రశ్నించిన తక్షణమే పుట్టపర్తికి పోయి భగవానుని దర్శించి యానందింపుడని జవాబు నొసంగుడు.
(శ్రీ స.సూ.పు.36)
మానవుడు నమ్మకముతో వినయ విధేయుడై యుండవలెను. ఎవ్వరెట్టి కండ్లద్దములు ధరించి విశ్వమును చూరురో, యట్లే విశ్వమును వారికి కనబడును. అసూయ, ద్వేషము, విసుగు మొదలగు గుణముల చూచిన విశ్వమును నట్లే దృశ్యమగు చుండును. ప్రేమతత్వలోచనములను నేను ధరించి విశ్వమును చూచు చున్నందున, నాకు ద్వేషాదులు లేవు. ద్వంద్వాతీతుడను. ఎట్టి వ్యాధియు నన్సంటడు. ఇతరులను ఋజువర్తనులను గావించుటకే నేను వారియెడ కోపమును నటించుదును. ఆంతియే! నేను సంపూర్ణానంద స్వరూపుడను. జ్ఞానానందశాంతులే నా స్వభావము. ప్రతి యొక్కని హృదయ నివాసియైన సాయిని నేను.
నా శక్తి, నా సామర్థ్యము నా మహిమ నెవ్వరుగాని, ఎప్పుడు గాని యెంత ప్రయత్నించినగాని, యే యపాయములచేతగాని కనుగొనజాలరు. నా దర్శనమునకై వ్యయ ప్రయాసలతో దూరదేశముల నుండి, ఖండాంతరముల నుండి యేల రావలెను? మీరుండుచోటనే యుండి మీ హృదయములను పవిత్రములుగ జేసికొని ప్రార్థనతో, ప్రేమతో నన్నాహ్వానింపుడు. తక్షణమే నేను మీ హృదయములలో సాక్షాత్కరించి, మీకు దర్శనభాగ్య మొసంగి, మీ కోర్కెలను దీర్చెదను. నన్ను సర్వాంతర్యామియని తెలిసికొనుడు. నిరంతరము మీ హృదయవాసివై యున్నాను. కేవలము యీ మానవ దేహమునకే కట్టుబడి యుండను. దివ్య దేహములోనే మీ యెడల ప్రకాశించుచున్నాను. మీ హృదయములను గూడ ప్రశాంతి నిలయములుగ వేసికొనుటయే మీ సాధనగ నుండవలెను.
(శ్రీ.స.సూ.పు. 36/37)
నా జన్మ దినోత్సవము జరుపుట కంటె, మీ హృదయములలో బాబాను వెలయింపజేసికొనుటకు ప్రయత్నించుటయే మీ ముఖ్య కర్తవ్యము. భక్తుల హృదయములలో అహమహ మని ప్రకాశించుచుండు సచ్చిదానందాత్మ స్వరూపుడు బాబా, జన్మదినోత్సవమని భక్తులు ప్రయత్నించి గ్రహింపవలెను. నా జన్మ దినోత్సవములను జరుపుకొనుటకు భక్తులకనుమతి నొసంగుటలో నా భావమిద్దియే.
(శ్రీస.సూ.పు.38)
నా సందేశమిది: "ప్రేమ స్వరూపులు కండు; భయము, ద్వేషము దరి రానీయకుడు. అందరి యెడల ప్రేమను అభివృద్ధి పరచుకొనడు. ఇతరుల సుఖ దుఃఖములను అర్ధము చేసుకుని ఇతరుల సుఖమే మీ సుఖముగ, ఇతరుల దుఃఖము మీ దుఃఖముగ భావించుడు"
(శ్రీస.సూ. పు. 40)
అన్ని రూపములు నావే; ఇతర రూప నామములను పూజించు వారిని వారి విశ్వాసములకు దూరము చేసి నావైపు మరల్చుట నా అభిమతము కాదు. లీలలూ, మహిమలూ చూపి వారు నా దరికే చేరునట్లుగా ఆకర్షించు చున్నానని మీరు భావించవచ్చు. ఇవన్నీ కీర్తి ప్రతిష్టల కొరకు చేయు ప్రదర్శనకాదు; భూమిని ఆకాశముగను, ఆకాశమును భూమిగను మార్చగల దివ్యశక్తికి నిదర్శనము. మీకు ఇష్టమైనా లేక పోయినా నేను మీవాడినే. మీరు నన్ను ద్వేషించినా, దూరముగా తొలగిపోయినా మీరు నావారలే. కనుక నా ప్రేమ, నా కరుణ నా శక్తి ప్రదర్శనలలో మిమ్మాకర్షించ వలసిన అవసరము నా కున్నది? నేను మీలో నున్నాము. మీరు నాలో వున్నారు. మన మధ్య భేదము లేదు. దూరము లేదు. మీరు మీ స్వగృహమునకు వచ్చిరి. ఇది మీ యిల్లు, నాది కాదు. మీ హృదయమే నా యిల్లు,
(శ్రీ.స.సూపు 41/42)
వట్టి చేతులతో రండి. మీ చేతులలో వున్న సర్వస్వముమా ఆవల పారవేయండి. జయాపజయములనే జీవిత రంగంలోని ఆటవస్తువులను గిరాటు వెయ్యండి. ఆ ఖాళీ చేతులను నా ప్రేమామృతముతో నింపుదును. నేను ప్రేమ స్వరూపుడను. నీ సంకల్పములో ఆనందారోగ్యములు ప్రసాదించుటవలన మీ మెప్పు పొందుటకాని, మీనుండి వేరు విమర్శలు పొందుట కాని నా ప్రత్యేక లక్షణము కాదు. అవి నా సహజ లక్షణములు, వాటివలన నేను పొంగుటకాని, క్రుంగుటకాని జరుగదు. మీరుకూడ మీ ప్రతిచర్యను ప్రేమపూరితము కావించండి. నేను మీ హృదయ జ్యోతులను ప్రకాశింపజేతును. ఆ వెలుగునందు మీరు ప్రతి వారిలోను సాయిని చూడగలరు.
ప్రేమ, గౌరవము, సహనము, పరస్పర సహకారములు ప్రతి హృదయము నుండి మరొక హృదయము లోనికి ప్రవహించవలెను. మీరందరూ ఒకే ఒక శరీరమందలి, సాయి శరీరమందలి, అంగములే..
(శ్రీ.స.సూ.పు.43)
నేను సముద్రమును. మీరందలి అలలు. మీరే నేను. మీరు గమ్యమును చేరునప్పుడు ఈ సత్యమును గ్రహించగలరు. ఇదే తత్తము. నీవు నీ ఈ ఆత్మ తత్వమును ప్రకటించిన క్షణమందే నీవు భగవంతుడు నయ్యెదవు. మీలో ప్రతి ఒక్కరూ ప్రత్యగాత్మను పరమాత్మలో లీనము చేయగలిగినపుడు భగవత్స్వరూపు లగుదురు. అందరివలె సాధారణ మానవునిగా వుండివుంటే నేను చెప్పెడిది యెవరు వింటారు? అందుచేత మానవ రూపములో మానవాతీతమైన శక్తి జ్ఞానములతో అవతరించినాము. మీరందరూ అవతారులే. రక్త మాంసములతో కూడిన ఈ శరీరమను కవచమును ధరించిన దివ్య తత్వములే. అయితే అది మీకు తెలియదు. జన్మాంతర కర్మల ఫలితముగా ఈ శరీరములలో మీరవతరించారు. అయితే నేను నా సంకల్పముతో ఈ శరీరమును స్వీకరించాడు. మీరు మీ శరీరములలో త్రిగుణములను త్రాళ్లతో బంధింప బడ్డారు. నేను గుణాతీతుడను. మీరు కోరికలతో ఇటూ అటూ చలిస్తారు. మిమ్మల్ని కోరికలు లేని విశ్చల స్వభావులను చేయవలెనను కోరిక తప్ప నాకు కోరికలు లేవు. నేనిక్కడ వుండగా మీకు భయమెందుకు! బాధలతో నుండు వారందరూ నా వద్దకురండు. మీరు నావైపు ఒక అడుగు వేస్తే నేను మీవైపు పది అడుగులు వేసెదను. శ్రీ బాబాయే జగజ్జనని, ఆమెయే పరాశక్తి. సరస్వతి, లక్ష్మి, అన్నపూర్ణ, దుర్గ, కాళి మొదలగువారు ఆయా దివ్యశక్తి స్వరూపిణులే. ఆ జగన్మాత యంశములే. మానవకోటికి సనాతన ధర్మమే తల్లి.
(శ్రీస.సూ. పు. 46/47)
నేనుండ మీకు భయమెందుకు? మీ భారమంతయు నా పైన వైచి, దృఢముగ నన్ను నమ్మిన, మీ యోగక్షేమముల నేను వహించి, అన్ని వేళల కంటిని రెప్పగాచునట్లు మిమ్ము నేను కాపాడుదును.
నేను ప్రతి మనుజుని సేవకుడను. నన్నే పేరున పిలిచినమ మారు పల్కెడను. అన్ని పేర్లును నావే, నాకు నిర్ణీతమైన పేరు ఏయొక్కటియు లేదు. మీరు నన్ను విడిచినను, నేను మిమ్ము విడువను. నీడవలె మీ వెంటనే యుందును. నాస్తికులే లేరని నా యభిప్రాయము. భగవంతుని పైననేయాధారపడి, భగవానుని కొఱకే యందటున్నారు. సూర్యుడు లేడన్న మాత్రమున ఆయన యదృశ్యుడగుట లేదు. కాబట్టి, భగవన్నామ కీర్తనము జేయుడు.
షిర్డీ సాయిబాబా నేడు సత్యసాయిబాబాగా అవతరించిరి. ఈ సాయి లు ఒక వరుసలో వత్తురు. ఈ అవతారము తర్వాత మైసూరు ప్రాంతమున ప్రేమ సాయి గా మరొక సాయి ఉద్భవింతురు.
(శ్రీ.స.సూ.పు.48/49)
మీరందరు నా యొక్క అవయవములు. సాయి శరీరము యొక్క అంగములు. సద్గుణము, విశ్వాసము, సుశిక్షణ, వినయము మొదలగు మధురమైన, వాంఛనీయమైన విషయములను సాయికి మీరిచ్చిన, మరేమి చేయుచున్నను, ఎక్కడున్నను. సాయి మీకు సహాయ సహకారము లందించును.
(శ్రీ .స.సూ.పు.95)
నాయొక్క ప్రేమయే అతి ప్రధానమైనది. ముఖ్యమైనది. నేను ఆకసమును భూమిగను, భూమిని ఆకాశముగను మార్చగలను. కాని అది కేవలము నా దివ్యశక్తులకు చిహ్నము కాదు. ఎల్లప్పుడు విశ్వవ్యాప్తముగా నున్న నా ప్రేమయే చాల శక్తివంతమైనది. లోకోత్తరమైనది, అద్వితీయమైనది. మీలో సమానముగా, మీవలె తినుచు. తిరుగుచు, మాట్లాడుచున్నందున, ఈ ఆకారముకూడ సామాన్య మానవాకారమే అనే భ్రమను కలుగచేయును.
(శ్రీస.సూ.పు.101)
నేను ఎల్లప్పుడు నీకంట, యింట, వెంట, జంట ఉండి, నడుపుచు కాపాడుచుందును. పురోగమించు... ...భయభీతి విడుపుము.....
(శ్రీ..స.సూ, పు. 360)
నేను భక్తపరాధీనుడను. సామాన్య మానవ రూపంలో మీతో కలసి మెలసి సంచరిస్తూ ఆడుతూ పాడుతూ ఉన్నప్పటికీ ఎంతటి మేధావులైనా నా శక్తిని, నా -స్వభావమును అర్థం చేసుకోలేరు. మానవత్వమును ఏకత్వపరచి, ఆత్మతత్త్వమును నిరూపించి దైవత్వ స్థానములో చేర్చటమే నా లక్ష్యము. నాలో ఉన్నటువంటిది ఎటువంటి కొలతలకూ అందనది, పరిమాణమునకు అతీతమైనది. పరిశోధనలకు అంతుపట్టనిది. అదియే ప్రేమ. ఈ ప్రేమతత్త్వమును గుర్తించి అనుభవించినవారు మాత్రమే నన్ను కొంతవరకు తెలిసికొనగలరు. స్వామి అనుగ్రహము చిక్కినప్పుడు మీకు అనంతమైన జగత్తే లభిస్తుంది. అమూల్యమైన వజ్రమును నేనుండగా తుచ్ఛమైన అశాశ్వతమైనవాటి కొరకు ఎందుకు ప్రాకులాడుతారు. మీరు నన్నే కోరండి. ప్రేమతో, భక్తితో కోరినట్లయిన నేను తప్పక లభించుతాను.
(స. సా. న. 99 పు. 300)
పరులను నిందించేవారు పరమ పాపులనే చెప్పవచ్చు. "పాపములన్నింటికంటే మించినది పరులను నిందించే దన్నా" కాబట్టి, ఎవ్వరిని నిందించకూడదు. అందరి యందున్నది భగవంతుడే. ఒకవేళ ఎదుటివారిలో మీకేదైనా దోషం కనిపిస్తే, ఆ దోషాన్ని వారికి తెలియజేసి మంచి మాటలతో సరిదిద్దాలేగాని, వారిని దూషించడానికి పూనుకోకూడదు. ఆధ్యాత్మికమంటే సర్వమును త్యజించి ముక్కు మూసుకొని జపమాల త్రిప్పుతూ కూర్చోవడం కాదు. మొట్టమొదట మీలో సద్భావములు ఆవిర్భవించాలి. నిరంతరము మీ మోముపై చిరునవ్వులు చిందులాడాలి. ఎలాంటి పరిస్థితి యందైనా కేస్ట్రాయిల్ ఫేస్ (ఏడుపు ముఖం) పెట్టుకోకూడదు. Happiness is union with God. భగవంతునితో చేరినప్పుడే ఆనందం ప్రాప్తిస్తుంది. భగవచ్చింతన చేసేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. లోకంలో అనేక కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎన్ని వచ్చినప్పటికీ మీరు లెక్కచేయకూడదు. నిజంగా మీరు నమ్ముతారో లేదోగాని, నాకు ఉన్నన్ని దూషణ, భూషణలు ఎవ్వరికీ లేవు. కోరికలు నెరవేరిననాడు గొప్పగా వర్ణిస్తుంటాడు. కోరికలు తీరనివాడు దూషిస్తుంటాడు. ఈ దూషణ, భూషణలు రెండూ వారి పెదవులకే పరిమితంగాని, అవి నావరకు ఏమాత్రం చేరవు. Sri Sathya Sai (శ్రీ సత్యసాయి) అనే పేరులో మూడు S లున్నాయి.
Yes అనువారికి Yes అనురా సాయి
No అనువారికి No అనురా సాయి
No. Yes లు మీ నోటికె గాని సాయికి
సర్వం Yes, Yes, Yes!
గట్టిగా దూషిస్తే అది గాలిలో కలిసిపోతుంది. తనలో తాను దూషించుకుంటే అది తనకే చెందుతుందిగాని, నావరకు రాదు. నేనెప్పుడు ఆనందంగానే ఉంటాను. ఆనందమే నా స్వరూపం. దేహాభిమానం కలవారే సుఖదుఃఖాలకు గురి అవుతుంటారు. కాని, నాకు సుఖము లేదు, దుఃఖము లేదు. ఎందుకంటే, నాకు దేహాభిమానమే లేదు. దేహానికి సంబంధించినది Conscious. ఆత్మకు సంబంధించినది Consciousness. నేను Conscious ను కాదు. Consciousness ను, అన గా, చైతన్య స్వరూపుడను. మీరందరూ చైతన్య స్వరూపులే. అందరూ దైవస్వరూపులే. "నేను దైవస్వరూపుణ్ణి" అనే సత్యాన్ని మీరు గుర్తిస్తే మీరింక దుర్మార్గంలో ప్రవేశించరు. జ్ఞానము ఒక్క తూరి వస్తే తిరిగి పోదు, అజ్ఞానము ఒక్క తూరి పోతే తిరిగి రాదు. బ్రహ్మ తత్త్వము రాదు, పోదు. అదే చైతన్య స్వరూపము. అది రాకపోకలు లేనిది, శాశ్వతంగా ఉండేది.
(స.సా.మే 2000 పు.134/135)
స్వామి! 75 సంవత్సరాల వయస్సులో కూడా మీరెంతగట్టిగా ఉన్నారు. ఎంత కళకళలాడుతున్నారు!" అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తుంటారు. అప్పుడు నేను చెపుతుంటాను. "దీనికి కారణం నాలో ఉన్న మూడు P లు. మొదటి P. Purity (పవిత్రత), రెండవ P - Patience (సహనం), మూడువ - Perserverance (పట్టుదల). ఈ మూడు మీలో ఉంటే మీరు కూడా ఎంత వయస్సు వచ్చినా గట్టిగా ఉంటారు. అందమనేది దేహానికి సంబంధించినది కాదు; గుణానికి సంబంధించినది, పవిత్రతకు సంబంధించినది."
(స.సా. మే.2000 పు. 134)
హంపి నుండి తిరిగి వచ్చిన తరువాత నేను ఉరవకొండ విడిచి పెట్టాను. బంధన వీడి పోయింది. అప్పుడు చెప్పాను –
నేను సాయిని తెలియుము నిక్కముగను
మమత బాయుము యత్నముల్ మానుకొనుము
బాసె నాకు మీతోడి బాహ్యసంబంధమింక
కాదు నన్పట్ట ఎటువంటి ఘననకైన.
(స.సా.ఏ.2001 పు. 126)
మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలని చెప్పటంలో నాముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముందు మీరు ఇంతకంటే అద్భుతమైన మహిమలను. లీలలను దర్శించి ఆనందించాలి. కనుక మీరు మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. ఇంతవరకూ చూపిన, విన్నవాటి కంటె అధికమైన మహత్తరమైన అద్భుతాలను, సాధించబోయే విజయాలను భవిష్యత్తులో సందర్శించబోతున్నారు. అందుచేతనే మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోండి! మంచి ఆరోగ్యంతో మీ హృదయాలను ఎల్లప్పుడూ ఆనందంతో నింపుకోండి.
(స.శి.సు.నా, పు. 72)
"మౌళి గుల్కెడు చంద్రమఃఖండ కళతోడ
బెడగారు గుల్కెడు జడలతోడ
జడలలో ప్రవహించు చదలేటి జిగితోడ
డంబైన ఫాలనేత్రంబు తోడ
నల్ల నేరేడు వంటి నల్లని మెడ తోడ
కరమున నాగకంకణము తోడు
నడుమున చుట్టిన నాగచర్మము తోడ
మైనిండనలదు భస్మంబు తోడ
నుదుట దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో
తాంబూల రాగాధరంబుతోడ
ఆరు శాస్త్రములందున నందగించి
నల్లకలువలు హసియించి కొల్లలాడు
మెరుగు చామనిఛాయల మేనితోడ
శైలరాజేంద్రుడు నేడు ప్రత్యక్రమాయె"
(స.పా.ఏ. 2002 పు. 108)
"రక్తము మాంస శల్యముల రాసియుదేహము నేను కాను
సువ్యక్తముగాని కోరికలు వ్యర్థ మనస్సు నేను కాదు.
ముక్తికి భంగకారి యగు మోహపు భావన నేను కాదు
నా శక్తి నన్నెరుంగగల శాశ్వతుడే పరమాత్మ నేనుగా"
విద్యార్థులారా! అందుకోండి ఆశీర్వాదములు. అందె మీరంపిన వందనములతోటి అందలి విషయ సుమములు. అవియే ఈ కమ్మని కమ్మను మీకందించుటకు కారణమైనది. ఈ కమ్మ సాయికి హాయిని మీకు సాయిని అందించుచున్నది. నేడు కావలసినది సుఖోద్యాన వాటికగా భావించే ప్రేమ కలాపము కాదు. జీవన సంగ్రామ రంగములో మహాయోధులై నిలువ గలిగిన వీరుల ఆదర్శము. ప్రస్తుత పరిస్థితులలో మాటల క్రీడలు మీకు ఉపక్రమించవు. చదువులు చదివి ఉన్నత పట్టములు అందుకొన్నంత మాత్రమున దేశమును ప్రకాశింపజేయ చాలదు, మీరు వికసించలేరు. సత్యాన్వేషణకై త్యజించి, ప్రాణాలొడ్డగల ధీరులు, త్యాగులు, పరమభక్తులు దైవ ప్రేమానురక్తులు కావాలి. ప్రేమనే ధనస్సు, విజ్ఞానమే కరవాలముగా కలిగి విజృంభించి, స్వార్థము స్వప్రయోజనాలకు స్వస్తి చెప్పి, పరార్థము, యదార్థాన్ని విశ్వసించి, వీర విద్యార్థులు కావాలి.
ఈనాడు మీరందరు మహత్కార్యములను సాధించుటకు జన్మించితిరి. చిల్లర, అల్లరి పిల్లలుగా కాక దైవబిడ్డలుగా, కార్యసూరులుగా, కలివీరులుగా, కరుణా రేఖలుగా, ప్రేమ పాత్రులుగా ప్రపంచములో దైవత్వమును ప్రతిధ్వనింప వలెను.
ఇది నిద్రించ వలసిన సమయం కాదు. మీ పై భవిష్యత్తు భారతావతరణం ఆధార పడి యున్నది. ఆ తల్లి మీకై నిరీక్షించు చున్నది. భారతనీతి నశిస్తే, ప్రపంచమే నశిస్తుంది. భారతీయ ఆధ్యాత్మికమే క్షీణించిన విశ్వమే క్షీణిస్తుంది. దేశ సమగ్రత పూర్తిగా మరుగుపడుతుంది.
మధురాత్మమైన ప్రేమానుభూత భారత జాతి యొక్క నీతి. భగవత్ రతిగల భారత రక్తములో ప్రసరించాలి ప్రవహించాలి. ఆదర్శవంతమైన ఆలలు మీలో ఉప్పొంగాలి. బాహ్య విద్యలలో బాహ్య ప్రభావాలకు దాసులై మీలోని ఆధ్యాత్మిక మోసులను తృంచి వేయకండి. మీలోని సత్ పదార్థాన్ని వెలగించి దుర్బల భావాలను దూరం చెయ్యండి. మీరు దైవదూతలు. కాదు యమదూతలు. భక్తి సామ్రాజ్యాన్ని నెలకొలపండి. దైవ ప్రేమకు పాత్రులు కండి.భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక శక్తిని అభివృద్ధి చేసుకోండి. గుణ ప్రేరితమైన ప్రేమ పరిణామం చెందుతుంది. గుణాతీతమైన ప్రేమను గురిగా తీసికొండి. అల్ప భావాలకు, ఆల్ప కోరికలకు దాసులుకాక, ఆత్మానందం మీనిలయంగా భావించండి. సకల పదార్థములు క్షణభంగురాలే. ఆత్మానందమే అంత్యము లేనిది. దానికై ప్రయత్నించండి. అన్ని లాభములకంటే గొప్పలాభం ఆత్మానందం. అది దైవ ప్రేమ వలననే లభించు. ఫలించును. కృష్ణ తులాభారం యొక్క అంతరార్థము ధన కనక వస్తు వాహనాలు కాదు, వజ్రవైఢూర్యాలు కావు, అవి ఏవియునూ భగవంతునితో తలతూగక పోయినవి. కేవలం భక్తి (ప్రేమ ఒక్కటే) దానిని పెంచుకోండి.
సాయి తత్వాన్ని మీలో చాలా మంది అర్థము చేసుకొనలేదు, చేసుకొన లేరు. సాయి ప్రేమను అర్థం చేసుకోండి, సాయిలో స్వార్థము ఏ కొసన కానరాదు. ఏది చేసినా మీ కోసమే. సాయికి కావలసినవి ఈ లోకములో ఏదియు లేదు.
కప్పురంబు తెలుపు, కామధేనువు తెలుపు
చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు
అందమైన సాయి మందహాసము తెలుపు
ఇక్షురసముకన్న ద్రాక్షారసముక్న సాయి ప్రేమ హాయి
సాయి మాట సకల సౌభాగ్యముల మూట.
సాయి దృష్టి పారిజాత వృష్టి
సాయి చేయి తల్లి ప్రేమలోపల హాయి
ఇదియే హాయి మీకు ప్రేమదాయి.
మీ నుండి నేను కోరేది ఒక్కటే. మీరు ఆదర్శ జీవులుగా, ఆనంద ప్రాణాలుగా, ఆత్మ స్వరూపులుగా లోకానికి నడతలలో నిరూపించండి. అదే నిజమైన విద్య. దానికి అంగాలే లౌకిక విద్యలు.
నిగమముల్ హరియించి హరిదూషణలు చేసి
సోమకాసురుడే మి సుఖము నొందె
పరసతిని కోరిన పదితలల వాడేమి
పట్టుకపోయెను గట్టిగాను
ఇల సూది మొన యంత నీయ జాలనటన్న
దుర్యోధనుండేమి దోచుకొనియె
పసి పిల్లలను కూడ కసిపట్టి చంపిన
కంసుడేమైనను గాచు కొననె
నేడు యెదిరించు వారికి నిదియె ఫలము
ఇంతకంటెను వేరెద్ది ఎఱుగ పరతు –
బాగా గుర్తించి వర్తించండి ప్రవర్తించండి.
ఇట్లు మీ హృదయ స్థాయి సాయి.
యెవరెవరి భావాలు యెంతెంత స్థాయిలో వుండునో దానికి తగినట్లు స్వీకరిస్తారు. "యద్ భావం తత్ భవతి”
(విద్యార్థులకు కమ్మ 23.9.88)
(కూర్చొనుటకు వీలు లేక అక్షరాలు సరిగా వ్రాయలేక పోయాను.)
ప్రియమైన విద్యార్థినులారా!
అందుకొండి ఆశీర్వాదములు, పది దినములకు పూర్వము సమ్మరు క్లాసులకు సంబంధించిన యేర్పాట్లు విషయమై మీటింగు పెట్టుకొని, మద్రాసు నుండి ఊటీ నుండి ప్రధాన వ్యక్తులను ప్రశాంతి నిలయం రమ్మనమని తెలిపి యుండుటచేత, నిన్నటి రాత్రి వారందరు ప్రశాంతి నిలయం చేరుకొన్నారు. అందుచేత నేను కండలను కరిగించు ఎండలో భోజనము చేసిన తక్షణమే బయలు దేరవలసి వచ్చెను. మిమ్ములను సంతోష పెట్టలేకపోయినందుకు చాలా విచారంగానే ఉంది. ఏమి చేతు? కర్తవ్యానికి కట్టుపడిన సాయి ఏమి చేసిన మీ కొరకే కాని సాయి కోసం కాదు. మీ ఆనందమే నా ఆహారం. మీ ఉత్సాహమే నా ఉయ్యాల. మీ సంతోషమే నా సర్వస్వం. నా పని అన్నది ఒక్కటి లేదు. సరిగా బయలుదేరు సమయాన కంటి ధారలు వీడుచున్న బాలికలను చూచి నా మనస్సు కరిగినది. వారల భక్తి ప్రపత్తులు సాయిని కదిలించినవి. కాని అవసరాన్ని బట్టి రావలసి వచ్చెను. వారలకన్నీరే నా హృదయానికి పన్నీరుగా భావించి వస్తిని. నేను తక్షణమే వారల మనస్సును శాంత పరచు ఉద్దేశము నాలో అమితంగా చెలరేగి, అసలు నీరైనను త్రాగక ఈ కమ్మను వ్రాయించెను. అసలు వ్రాయుచుండగా చేతి మండి చెమట పుట్టి పడుచు అక్షరాలను కూడా పాడుచేయుచున్నను, రెండు కాగితములు పాడయినను, నా పట్టు విడువక మీ పైనున్న దయానుగ్రహంబులచేత ఈ కమ్మ ద్వారా మిమ్ములను సమ్మరింపచేయ పూనుకొంటిని. ఇకపై మీకు నా ఆనంద బిందువులు కమ్మ ద్వారా పంపి మిమ్ములను ఆనందింప చేయుదును.
బంగార్లూ, బాగా చదివి సాయి ఆశయాలను ఆచరణ రూపేణా ప్రపంచమునకు చాటి నవయుగంగా తయారు చేతురని ఆశించుచున్నాను. అమ్మ నాన్నలకు గానీ, సమాదానికి కానీ మన ఆచరణే ప్రధాన ప్రబోధగా మారాలి. అదే సాయి ఆశ. భారతీయ పవిత్ర చరిత్రను పునరుద్ధరింప చేయాలి. ఇంక నేను ఈ కమ్మను ముగించుచున్నాను. ఇంకా కాలము తీసుకొన్న మొఖము నుండి కూడా చెమట పడునేమో అని ఊహించుచున్నాను. కారణం కరెంటు కూడా లేదు. చాలా వేడిగా ఉన్నది. మీ పై గల దయతో ఈ మాత్రము వ్రాసి మిమ్ముల చల్లబరచాలని సంకల్పించితిని. సాయి నిరంతరం - మీ వెంట, జంట, వెంట ఉండి కంటి రెప్పవలె సంరక్షించును. అందరూ బాగా చదువుకుని, ఉన్నత స్థాయిలో మార్కులు తీసి, కాలేజీ పేరును నిలబెట్టండి. ఇట్లు మీసాయి
సాయీ, నీవు లేనిచో మేము అనాధులం: నీవు లేని జీవితం మాకు అయోమయం..
(విద్యార్థులకు కమ్మ 2.5.1986)
(ఇండియా వచ్చిన కొద్ది వారాలకే బాబా ఆర్నాల్డ్ షూమనకు యిచ్చిన మొట్టమొదటి ఇంటర్వ్యూలో యిలా అన్నారు) మీకు అర్థం కాదు! నిన్ను నేను కోరుకున్నాను. అందుకే నిన్ను పుస్తకం వ్రాయమన్నాను. అర్థమయిందా? పుస్తకాలు కేవలం ప్రచారం కోసం. నాకు కావలసింది ప్రచారం కాదు. నాకు కావలసింది మీరు. నాకు మీ విశ్వాసం కావాలి. మీ ప్రేమకావాలి. ఇక్కడకు వచ్చిన వాళ్ళంతా తామేదో పథకం ప్రకారం ఏర్పాట్లు చేసుకుని ఇక్కడకు వచ్చామని అనుకుంటూ ఉంటారు. కాని ఇది కేవలం నా ఏర్పాటు మాత్రమే. సమయం ఆసన్నమైనప్పుడు, వారు నాకు దగ్గరవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వారిని నేను పిలిపించుకున్నప్పుడు మాత్రమే వారు నా దగ్గరకు రాగలరు. నా సంకల్పం లేకుండా మరొకలాగా యింకెవ్వరూ నా దగ్గరకు రాలేరు. నాకు మీ ఆత్మకావాలి. ఎందుకంటే యింక నువ్వు చంచలత్వాన్ని వదలి పెట్టవలసిన సమయం ఆసన్నమైంది.
(శ్రీస. ప్రే స్ర...పు. 69)
దేవుడు ఇతరులకు సహాయము చేసే సామర్థ్యాన్ని ఇచ్చినా సహాయం చేయకపోవడం చాలా భాధాకరమైన విషయం. ఎందుకంటే (భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చెప్పిన ప్రకారం) ప్రార్థన చేసే పెదవుల కన్నాసహాయం చేసే చేతులు పవిత్రముగా వుంటాయి. (వివేకదీపినీ Vivekadeepinee పు.32-33)
“ఎవరైనా మాతాజీ స్వామి దగ్గర యున్న - మంచిదికదా!" అన్నారు. మాలో మేము రాత్రి ఏకాంతముగా మాటలాడు కొన్న విషయమును స్వామి చెప్పినారుకదాయని మాకు చాలా ఆశ్చర్యము సంతోషము అయినది. స్వామి సర్వజ్ఞులు! స్వామికి తెలియని దేమున్నది? "ఎవరైనా మాతాజీ కాని భక్తుడుకాని స్వామి దగ్గర ఉన్నచో వాండ్లు తల పైకి ఎక్కి కూర్చొనెదరు. నా వద్ద ఎవ్వరూ ఉండనవసరములేదు. నాకు భక్తుల కష్టములన్నియూ తెలుసు. భక్తుల కష్టములను పోగొట్టి వారిని భక్తి మార్గములో నడిపించుటకేకదా నేను వచ్చినాను!" అని స్వామి సమాధానము చెప్పినారు.(భ క్తో థ్థారక శ్రీ సత్యసాయి పు 89)
నీ వెంట, జంట ఇంట వుండి కంటి రెప్పవలె కాపాడుచున్నాడు. కనుక ఈ విశాల తత్త్వాన్ని మీరు గుర్తిస్తే, భగవంతుని వెదకటానికి మీరెంత మాత్రము ప్రయత్నించరు. తాను లేని స్థానము, తనది కాని రూపము, జగత్తులో కానరాదు. ఈ విశ్వాసాన్ని మనము బలపరుచుకోవాలి. సరియైన భక్తుని లక్ష్యమిదే. జపములు, ధ్యానములు, పూజలు, యోగములు ఇవి అన్ని కాలమును పవిత్రము కావించుకునే కర్మలు మాత్రమే. ప్రేమ దైవము ఇటువంటి ప్రేమను అభివృద్ధి పరుచుకొని దైవత్వాన్ని ఎక్కడ చూచినా, అక్కడ ఉన్నాడనే విశ్వాసముతో అతనిని ధ్యానిస్తూ ఉంటే ఎక్కడంటే అక్కడే కనిపిస్తాడు. (సా! పు. 650)
“నేను శిక్షించుటకు రాలేదు, శిక్షణ ఇచ్చుటకే వచ్చాను.”
“భగవంతుని పూర్వావతారాలకు ఇప్పటి అవతారాలకు కార్యాచరణలో భేదమున్నది. పూర్వము ఏకొద్దిమంది రాక్షసులనో హతమార్చి ధర్మాన్ని పునరుద్ధరించగలిగారు, నేడు అట్లుకాదు, అట్లా శిక్షించాలి అంటే మానవాళి మనుగడకే ప్రమాదము వచ్చేట్లున్నది. అందువలననే మానవాళి శిక్షించుటకు బదులు శిక్షణతో వారి దృక్పథములో మార్పు తెచ్చి వారిని పరిశుద్ధులను కావించుటయే ఇప్పటి అవతార ఉద్దేశ్యము. నేను శిక్షించుటకు రాలేదు, శిక్షణ ఇచ్చుటకే వచ్చాను.” (శ్రీ సత్య సాయి బాబా ప్రబోధములు పుiii)
నా ప్రధాన లక్ష్యం “వ్యక్తుల కష్టాలు తొలగించి, వ్యాధులు నివారించి ఓదార్చటమే నా లక్ష్యం అనుకోవద్దు. అంతకంటే ముఖ్యమైన ఉద్దేశ్యము వేరొకటి ఉన్నది. మామిడి పండ్లను అందించడం మామిడి చెట్టు యొక్క ముఖ్య ప్రయోజనం. అరటి పండ్లను అందించడం అరటి చెట్టు యొక్క ముఖ్య ప్రయోజనం. కాని వాటి ఆకులు, కొమ్మలు, ఊచ, మ్రానులకు వేరువేరు ప్రయోజనాలు ఉండవచ్చును. అదే విధముగా వ్యక్తుల యొక్క దుఃఖములను ఉపశమింప జేయటం నా ఉద్యమంలో ఒక అంశం మాత్రమే. భారత వర్ష హృదయంలో వేదశాస్త్రాలను పునఃప్రతిష్ఠ చేసి, ప్రజలలో వాటి పట్ల అభినివేశం కలిగించడమే - నా ప్రధాన లక్ష్యము. దీనికి ఏ ఆటంకాలు అడ్డు రాలేవు. ఎటువంటి అవరోధాలు ఉండవు. ఇది దైవ నిర్ణయం . ఇది దైవ సంకల్పం ". (సాలీత పు200)
“నీతో స్నేహితునిలాగా కలిసి నడుస్తాను.
నీ మార్గదర్శకునిలాగా నిన్ను నడిపిస్తాను.
నిన్ను దుష్టత్వం, ప్రలోభాలనుండి రక్షిస్తాను.
నీకు నీ తోడునీడగా సాయమై ఉంటాను.
నీవు నా దరిచేరుతావు, నన్ను సమీపిస్తావు.
నీవు నా అగాధత్వాన్ని అర్థం చేసుకొంటావు.
నీవు నాలో ప్రవేశిస్తావు, నా తత్వాన్ని సాధిస్తావు.
నీవు నాలో ఐక్యతను పొందుతావు.”
((సనాతన సారథి, అక్టోబరు 2022 పు 24)