సద్భక్తులందరూ భగవంతుడా యంచు
చెవులకింపుగస్మరణ చేయు దినము
బీదల వెతలన్ని ప్రీతితో నెరవేర్చి –
అన్నదమ్ముల మాడ్కినున్న దినము
దైవచింతన చేయుదాస బృందములను
ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము
మహనీయుడెవడైన మనకడకే తెంచి
చెవి భగవత్కథ చెప్పుదినము
ఈ దినములే నిజమైన దినములు. మిగిలినవి తద్దినములు. స్వార్థము కోసము ప్రయత్నము చేసే దినములు.
(సా॥ పు. 269/270)