ధ్యాని శరీర మానసిక వాక్కులందు కొన్నింటిని కట్టు దిట్టము చేసుకొనవలెను. అవియే దశవిధ పాపములు. కాయకంగా త్రివిధములైన పాపములు, వాక్కున చరుర్విధములైన పాపములు, మానసికంగా త్రివిధములైన పాపములు. అందులో కాయక పాపములు 1. ప్రాణాతి పాతము 2. పరదారాసక్తి 3. దొంగతనము. ఇంక వాక్కునందా చరించుపాపములు: 1. యావత్ప్రలాపములు 2. పారుష్యము 3. పైసున్యము 4. అసత్యము. అటులనే మానసికంగా కూడను: 1. పరధనాసక్తి 2. పరుల యెడ అసూయ, 3. నాస్తికత్వము.
ఈ విధములైన దశవిధ పాపములనూ ధ్యానసాధకుడు చెంతచేర్చక చూచుకొనవలెను. వాటిని పూర్తిగా పరిత్యజించవలెను.
(శ్రీ స.పూ. పు. 122)