ఇప్పుడు లోకమున శాంతిని మరుగు పరచుటకు మరొక నూతన జబ్బు ప్రారంభమైనది. సర్వనీతులు, సర్వ ధర్మములు, సర్వక్రమములు చిలకపలుకలవలె ఇతరులకు చెప్పనేర్తు రేకాని, అందులో ఏ ఒక్కటీ వారు అనుష్టింప అలవడుటలేదు. మన పెద్దలకు ఇప్పుడు చెప్పునది మాత్రము తెలియును. కాని, చేయుట తెలియదు; నేర్చుటలేదు. చేయ నేర్చని వానికి చెప్పుటకెట్లు తెలియును? అట్టి అనుభవములేని వాక్కులే ఇప్పటి నూతన జబ్బు. ఈ రోగము మొదట రూపుమాయవలెను. దీని మూలముకూడా, మానవుడు యదార్థమైన శాంతిని అనుభవించలేక పోవుచున్నాడు. చెప్పుట అందరికీ సులభమే. చేసి చెప్పువాడు యదార్థ సాధకుడు, చేయక చెప్పువాడు అనర్థ సాధకుడు. .
(ప్ర.వా.పు.7)