“డార్విన్" విద్మార్థిగా యున్నప్పుడు హెన్ స్లో అనే గురువు వద్ద విద్య అభ్యసించినాడు. ఆయన పరమ పవిత్ర హృదయుడు. నిస్స్వార్థ ప్రియుడు. నిరంహంకార మయుడు. నిశ్చల చిత్తుడు. అట్టి గురువును ఆశ్రయించిన వాడు డార్విను. తన గురువు వలె తాను కూడా ఆస్థితిని అనుభవించాలని సత్ చింతన చేస్తూ వుండే వాడు. "యద్భావం తద్భవతి" ఫలితాలు భావాలను అనుసరించి యుంటాయి. చివరకు తన కోర్కె తీర్చుకోగలిగాడు. డార్విను తాను కూడా నిశ్చల చిత్తుడు. నిస్వార్థపరుడు. నిరహంకారమయుడై ప్రజల ముందు తేజస్సుతో ప్రకాశించాడు. కడపటికి దైవము తాను ఒక్కడే అనే సత్యాన్ని గుర్తించాడు. కనుకనే తనే దైవాన్ని తన ఎదుటిగా యున్నట్లు భావించి "నేను లేక నీవు లేవు" అని అనగలిగాడు. ఐన్ స్టీ న్ కోట్లు గడించాడు. కడకు తన్ను తాను తెలిసికోవడమే ప్రధానమని గుర్తించాడు నీవే దైవం. చూచేది తానే, చేసేది తానే, అనుభవించేది తానే. అన్నీ తానే, ఇట్టి సంకల్పాన్ని అనుభవిస్తే ఎంతో తృప్తిని అనుభవిస్తాము. నేను నేనే, వేదం నేనే, వేదంతయు నేనే, వేదవేత్తను నేనే. సర్వము వేదమయము. వేదమే దైవం, వేదమే మానవత్వం "దైవం మానుష రూపేణ" దైవత్వం మనుష్య రూపంలో వచ్చింది. కనుక మానవత్వాన్ని పవిత్రమైన వరప్రసాదంగా భావించాలి. ప్రసాదాన్ని పారవేసే వాడు మూర్ఖుడు. అనుభవించేవాడు ధన్యుడు. దైవమిచ్చిన మానుష్యత్వాన్ని సార్ధకాన్ని కావించుకొన్నవాడు ధన్యుడు.
(సా.పు. 423)
(చూ|| అరిషడ్వర్గాలు)