సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు
శూరుడై రణమున పోరవచ్చు
రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు
హేమ గోదానముల్ ఈయవచ్చు
గగనంపు చుక్కలు గణియింపగావచ్చు
జీవరాసుల పేర్లు చెప్పవచ్చు
అష్టాంగ విద్యల నన్ని నేర్వగవచ్చు
చంద్రమండలమైన చేరవచ్చు.
కాని దేహేంద్రియముల నరకట్టి
మనసు నిల్పి, అంతర్ముఖము చేసి
అనవరతము నిశ్చల సమాన చిత్తుడై
నిలువగా లేడు మానవుడు నియతితోడ.
(స. సామా.99పు,74)