నిజముగా దైవమును మరిస్తే సర్వము మరచిన వారమవుతాము. నిన్ను నీవు మరచిన వాడౌతావు. నిన్ను నీవు మరచిన ఏమి ప్రయోజనం? నిన్ను నీవు తెలుసుకో. రమణ మహర్షి ఎవరైనా వెళ్లినప్పుడు "నిన్ను నీవు తెలుసుకో అనేవాడు. నిన్ను నీవు తెలుసుకుంటే సర్వము తెలుసుకున్న వాడౌతావు. నిన్ను నీవు తెలుసుకోటమంటే నే దేహాన్ని నీ మనస్సును నీ చర్యలను తెలుసుకోటం కాదు. నేనెవరు? చిన్న ఉదాహరణము. ఇది నా దేహము. ఇది నా తల, ఇది నా చేయి. నా కాలు, నేనెవరు? ప్రశ్నించుకో! నా దేహమనుకుంటే నేనెవరు? నా తల అనుకుంటే నేనెవరు? ఈ విధంగా విచారణ చేస్తే....? నేను వేరుగా ఉంటున్నది. బుద్ధి, చిత్తము, అంతఃకరణ వేరువేరుగా ఉంటున్నాయి. ఇది నా కర్చీఫ్. నేను వేరు. కర్చీఫ్ వేరు. నా దేహము అంటే దేహము నీ కంటె వేరుగా ఉండాలి కదా. కాబట్టి నీవు ఎవరు. అప్పుడు మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియములు. అంత:కరణ పనిముట్లు, నీవు Master. Master the mind Be a master mind. నీవు Master గా జీవించు.
(ద.య.స.97 పు.75/76)