జీవితారణ్యంలో మృగాల నుంచి మిమ్మల్ని కాపాడగల తుపాకి భగవన్నామం అనే గుండు వదలినప్పుడు తుపాకి పెద్ద ధ్వని చేస్తుంది. నామమనే ధ్వనితోపాటు, భావమనే గుండును వదలి గురిని కొట్టండి. "నామంలో ఏముంది? అని చాలామంది అడుగుతుంటారు. అది కేవలం కొన్ని శబ్లాల సముదాయమే గదా అని అంటారు. నా పలుకులు కూడా శబ్దసముదాయమే గదా! అవి మీ హృదయాలలో ప్రవేశపించగానే మీకు సంతృప్తి ఉత్తేజమూ ఎందుకు కలుగుతున్నాయి? మాటలకు మహత్తర శక్తి ఉంది. ఉద్రేకాలను రెచ్చగొట్టగలవు. మనస్సులను శాంతపరచగలవు. సత్యావిష్కరణ చేయగలవు. అపారమైన శక్తికీ వివేకమునకూ ఆటపట్టులు కాగల మహాశక్తి మాటలలో ఉన్నది కాబట్టి నామ మహిమను విశ్వసించి వీలు చిక్కిన వేళల్లో నామము పదేపదే ఉచ్చరించండి."
(ఉదయం ప్రత్యేక అనుబంధం పు.4)
భక్తునికి భగవన్నామముకంటెను ప్రియమైనది, విలువ గలది మరియొకటి యుండదు. నామము రూపమును భక్తునికి విధేయము కావించి, విధిగా సమగ్రహించునట్లు చేయును.
(స.వ.పు.19)