ఈ కళాశాలలో సక్రమంగా విద్యాబోధన తదితర కార్యక్రమములు ఆదర్శవంతముగా జరుగుచున్నవంటే - ఇవన్నీ నా ఒక్కని చేతి మీదగానే జరుగుతుంది. ఇప్పుడు యిక్కడ మైకు ఎక్కడ పెట్టాలి అనే విషయము యింతకు పూర్వము కస్తూరితో, గోపీనాధ్ తో చెప్పాను. ఈ విషయము మీకు తెలియదు. సాయిబాబా చక్కగా మందిరములో సుఖముగా నిద్ర పోతున్నారని అనుకొంటారు. నాకు సుఖము ఏది? మీలో కలసి వుండడము మీతో సంప్రదించడము యిదే నా సుఖము. అందువలననే My Life is My Message (నాజీవితమే నాసందేశము) అంటాను. తెల్లవారు ఝామున 4 గంటల నుంచి రాత్రి 10 గం|| వరకు నిరంతరము పని చేస్తూనే ఉంటాను. ఇదే నా ధ్యాస, దేనిని పట్టించుకోను, దేనికీ వెరువను, నేనెప్పుడూ ఆనందము గానే ఉంటాను. నిరంతరము చిరునవ్వుతోనే ఉంటాను. కారణమేమిటి? జరుగవలసినదేదో జరిగి తీరుతుంది. రెండు బాధల మధ్యనే సుఖము లభిస్తుంది. అందువలననే "సుఖాత్ లభ్యతే సుఖమ్" అన్నారు. సుఖమునుంచి సుఖము దొరకదు. కష్టమునుంచే లభిస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించాలి. నిరంతరము ఎయిర్ కండిషన్డ్ (Air Conditioned) గదిలో కూర్చునేవానికి ఆ గది యొక్క చల్లదనము తెలియదు. ఒక పర్యాయము బయట ఎండలోనికి వెళ్ళివచ్చినప్పుడు ఆ ఎయిర్ కండిషన్ యొక్క విలువ తెలుస్తుంది. అదే విధముగ పగటి పూట దీపము యొక్క ప్రకాశము తెలియదు. చీకటి ఉంటేనే వెలుతురు ప్రకాశించేది. (శ్రీ.ది.పు.31/32)
“ఎవరికి హాని కలిగించకు, ఎప్పటికీ సహాయం చేయు, అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయు" (అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబాగారు ప్రసంగించి అలాంటి జీవితాన్ని గడిపారు.) (వివేకదీపినీ Vivekadeepinee పు.10)