వైరాగ్యము, నమ్మిక, ప్రేమ అనే స్థంభాలపై శక్తి ఆధారపడి ఉంటుంది. వీటన్నింటిలో నమ్మకం ప్రధానమైనది. అదిలేని సాధన నిష్ప్రయోజనము. కేవలం వైరాగ్యం సాథనను శక్తి వంతం చేస్తుంది. ప్రేమ త్వరిత గతిని భగవంతుని దగ్గరకు చేరుస్తుంది. భగవంతుని యందు నమ్మకము ఆయనను, వేరైన విరహాగ్నిని వెలుగొందింప చేస్తుంది. భగవంతుడు నీకు ఏది కావాలో ఏది ప్రాప్తో దానిని అనుగ్రహిస్తాడు. అడుగవలసిన పనిలేదు. గొణుగు కోవడానికి కారణం కనబడదు. తృప్తి అలవరచుకో, ఎప్పుడేది జరిగినా కృతజ్ఞతా భావంతో ఉండు. ఆయన సంకల్పానికి తిరుగు లేదు.
(అ. ప.పు 78)
అన్నిటికి మొట్టమొదట నమ్మకము చాలా అవసరము.
నమ్మకమనే రెండు నయనమ్ములే లేని
అంధులైరి మనుజలవనియందు
మొట్టమొదట నమ్మకం కావాలి. అదియే పునాది. అదియే Self confidence. (ఆత్మవిశ్వాసం) ఆ Self confidence అనే పునాది ఉండినప్పుడే Self satisfaction (ఆత్మ తృప్తి) అనే గోడలు నిర్మించవచ్చు. ఈ Self satisfaction అనే గోడలు వేసినప్పుడే Self-sacrifice అనే పైకప్పు కుదురుతుంది. ఈ Self sacrifice అనే roof ( పై కప్పు) వేసినప్పుడే Self realisation అనే life అక్కడ నివసిస్తుంది. పైకప్పు లేక ఎవరూ ఇంటిలో నివసించరు కదా! గోడలు లేక పైకప్పు వేయలేరు కదా! పునాది లేకుండా గోడలు కట్టరు కదా! కాబట్టి అన్నింటికీ పునాది చాలా అవసరం. అదే Self-confidence. నమ్మకము ఉండాలి.
(ద.స.98.పు.88)
(చూ॥ అయస్కాంత శక్తి, ఆచరణ, భక్తి, రోగ విముక్తుడు)