మన జీవితమంతా మెడిటేషన్లో కూడినదే. "మెడిటేషన్ ఈజ్ ఏవే ఆఫ్ లైఫ్ . ఇది మన జీవిత విధానానికిసంబంధించినది. నడిచే సమయంలో త్రోవ చూసు కోకుండా నడిస్తే ప్రమాదాలకు గురి అవుతాము. కావున నడకకు కూడా ఏకాగ్రత అవసరం. నడవటం, మాట్లాడటం, చదవటం, వ్రాయటం మున్నగునవన్నీ ఏకాగ్రతతో కూడినవే. అయితే మీరు వస్తువులపై, భౌతిక విషయాలపై పెట్టే ఏకాగ్రతను భగవంతుని పై పెట్టండి. అప్పుడు మీలో దివ్యమైన మార్పు కలుగుతుంది. మీరు చేసే ప్రతి పనీ దైవారాధనగా మారుతుంది. అదే మెడిటేషన్. మీ దృష్టిని మీ భావాన్ని ప్రకృతి నుండి పరమాత్మకు మరల్చాలి. పనివేరు పూజవేరుకాదు. ప్రకృతి వేరు - పరమాత్మ వేరుకాదు. జీవుడు వేరు-దేవుడు వేరు కాదు. దివ్యత్వము మీలోనే ఉన్నది. ఆ విశ్వాసం మీరు అభివృద్ధి పరుచుకున్నప్పుడు మీరు తప్పులు చేయటానికి ఎన్నడూ పూనుకోరు.
(దే.యు. పు.7)
(చూ|| ధ్యానం)