మీరు కోరే పరిమితులకు లోబడి నే నిప్పుడు అవతరించాను. భగవంతుని కార్యక్రమాలు మూడు. సృష్టి, స్థితి, లయము. విశ్వకల్యాణం కోసం ఆయన ఆశయాలు అన్నీ సాత్వికంగానే ఉంటాయి. నా ఆనందము నాది. నేను చెప్పదలచుకొన్నది చెప్తాను. ఇతరుల ఇష్టానిష్టములతో నాకు సంబంధం లేదు. ప్రతి వ్యక్తికీ, ప్రతిదానికి నేనుసాక్షీభూ తుణ్ణి. అందరూ నా అధీనంలోనే ఉన్నారు. అటువంటప్పుడు నేను ఏమి చేయాలో ఎవరు చెప్పగలరు? నేను సర్వశక్తులూ కలిగిన వాడనని కొద్ది సంవత్సరాలలో మీరందరూ గ్రహిస్తారు. బుద్ధిమంతులు, పరిశోధకులు, బాధితులు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడకు వస్తారు. కష్టాలు కలుగగానే భగవంతుణ్ని నిందించి ఆయనకు దూరము కాకండి. దానివల్ల మీకు నష్టము. తరువాత మీరే పశ్చాత్తాపపడతారు.
(వ.61-62 పు.100