ఈ మూడు అవతారములు షిర్డి, సత్య, ప్రేమ సాయిబాబాలు భిన్నమైనవి కావు. అవి ఏకమేనని ఇదివరకే విశదం చేసాను. ఒకే లక్ష్యసాధన కోసం ఇవి ఏర్పడినవి. ఒక ఉదాహరణ చెబుతాను. ఒక కిలో బెల్లం తీసుకోండి. అముద్ద అంతా మధురమే. తరవాత దానిని ముక్కలు చేయండి. గణంలోనే ఉన్నది. దేశకాల పరిస్థితులను బట్టి అవతారాలు ప్రయోజనాలూ శక్తులూ వేరుగా వుంటాయి. కాని అవతారాలన్నీ ఒకే ధర్మానికి భిన్న స్వరూపాలు మాత్రమే. ఒక ఫలమును ఉదాహరణగా తీసుకొందాం. విత్తనంలో ప్రారంభమై వృక్షం అవుతుంది. వృక్షం ఫలాలను అందిస్తుంది. కర్మ బీజం వంటిది. ఆరాధన వృక్షం. వివేకం దాని ఫలం.పూర్వావతారమైన షిర్డీబాబా మతసామరస్యానికి పునాది వేశారు. మానవులకు కర్తవ్య కర్మము బోధించారు. ప్రస్తుత అవతార లక్ష్యం ఇది. అందరిలోనూ ఒకే దివ్యత్వం భావిస్తున్నది. కాబట్టి మానవులు పరస్పర గౌరవ ప్రేమలతో ఒకరికొకరు సాయం చేసుకోవాలి. జాతి, వర్ణ, మత విభేదాలు పాటించరాదు. అటువంటి విశాల మానవభావనతో చేసే ప్రతిపని ఆరాధనగా అలరార గలదు. మూడవదైన ప్రేమసాయి అవతారంలందరిలోనూ భగవంతుడన్నాడని చాటించటమే కాక అందరూ దివ్యమూర్తులనే తత్త్వం ప్రచారం చేస్తుంది. ఆ పరమ వివేకం వికసించి నప్పుడు నరనారులందరు నారాయణులు కాగలరు.
ఈ విధంగా కర్మ, ఆరాధన, వివేకం అనే మూడు అవతారాలు సందేశాత్మకంగా అందించగలవు.
(స.ప్ర.పు.8/9)
ఆత్మ పరమైన దివ్యతత్వం స్థాపనచేసి మానవులందరినీ ఒక కులంగా ఒక కుటుంబంగా సమైక్యం చేయటం. ప్రతి స్త్రీలో ప్రతి పురుషునిలో వున్న ఈ దివ్యత్వమే సమస్త సృష్టికీ ఆధారభూతం. ఒకసారి ఈ తత్వం గుర్తిస్తే మనిషికీ, మనిషికీ మధ్య మానవునికి, దైవానికి నడుమఅనుసంధానం ఏర్పడుతుంది. వారసత్వమైన ఈ దివ్యసంపదను గుర్తిస్తే ప్రేమభావం విస్తరించి విశ్వానికి మార్గదర్శకమైన మహాజ్యోతిగా వెలుగొంద గలదు.
మొదటి వ్యక్తిగా వున్న మనిషి మానవజాతిలో విలీనమై నవీ కృతమైన సంపూర్ణ శక్తిని గ్రహించుకోవాలి. ప్రస్తుత ప్రపంచంలో మానవజాతి కనిపించటం లేదు. ఆలోచనకూ, మాటకూ, రచనకూ సమన్వయం లేదు. ఈనాటి మానవుడు ఆలోచించేది ఒకటి. చెప్పేది ఇంకొకటీ చేసేది మరొకటీ. కాబట్టి ఈనాడు పరస్పర విరుద్ధ భావాలు - సంఘర్షణలో తికమక పడుతున్న వ్యక్తులే కనిపిస్తున్నారు. మంచి తలపులూ, మంచి మాటలూ, మంచి పనులు ప్రేరణ చేసే మానవజాతి మనకి నేడు కనబడటం లేదు. కాబట్టి వ్యక్తిని తనలోపలి దివ్యత్వమును గుర్తించుకునేట్లు చేయాలి. ఆలోచనకూ, మాటకూ, చేతకూ సమన్వయం కుదుర్చుకొని అభివృద్ధి పరచుకునేట్లు చేయాలి.
ఒకసారి ఈ ప్రతిపదిక సత్యమును కుటుంబంలో, పాఠశాలల్లో, కళాశాలల్లో, సమాజంలో, నగరాలలో రాష్ట్రాలలో, ప్రపంచంలో జాతులలో ప్రబోధించాలి. అప్పుడు మానవులంతా ఒకే కుటుంబానికి చెందిన సభ్యులనే ఎరుక మనుషులకు కలుగుతుంది. అందరూ ఒకటే, అందరిని ఒకే రకంగా మన్నించాలని క్రీస్తు వచించాడు. ఈ ఏకత్వ స్థాపనే ముఖ్య సమస్య.ఉన్నదొకటే కులం, ఉన్నదొకటే వర్గం, ఉన్నదొకటే మతం. అదే మానవత్వం.వ్యక్తి తన అహంకార బుద్ధిని నిర్మల నిస్వార్థ నిరవధిక విశ్వప్రేమకు లొంగిపోయేట్లు చేసు కోవలెను.ప్రేమయే ప్రాతిపదిక, అందరిలో వుండే సమాన లక్షణం అదే. భక్తి ఒక దివ్య తేజోరేఖ, మనిషికీ మనిషికీ మధ్య, మనిషికి దైవానికి నడుమ బలీయమైన సమైక్య సూత్రంఅదే .
ఒక ఉదాహరణ చూడండి ఇది ఒక వస్రంకదా, దీనిని దారాలతో తయారుచేశారు. ఒక్కొక్క దారపు పోగూ లాగివేస్తే వస్త్రం తరిగి పోతుంది. వాటిని చిక్కగా దగ్గరగా చేర్చితే వస్త్రం గట్టిగావుంటుంది. మానవజాతి కూడఇంతే. వస్త్రంలో ఉన్న వేల లక్షల దారాలను ఒక చోట చేర్చేది ప్రేమ. మానవునికి దేవునుకి పునర్మిలనం సమకూర్చేది భక్తి. కాబట్టి నేను ప్రేమకు మూర్తీభావమునై దానిని నా పరికరంగా వినియోగిస్తున్నాను. ప్రేమ ద్వారా మానవులలో జాగృతి పునరుద్ధరణసాధించి, భక్తి ప్రబోధం వల్ల మానవులలో సోదరభావం వర్ధిల్లజేయగలను. అందుకే నేను ఎప్పుడూ అంటూ వుంటాను.
ప్రేమతో మీ దినచర్య ప్రారంభించండి.
ప్రేమను మీ దైవందిన ప్రణాలికలో నింపుకోండి.
ప్రేమతో మీనిత్య కార్యక్రమం ముగించండి
ప్రేమ స్వరూపుడైన భగవంతుని చేరుకోటానికి
శ్రీ ఘ్రమైన నిశ్చయమైన మార్గం ఇదే.
(స.ప్ర.పు. 9/11)
షిర్డీబాబా 1918 లో కీర్తి శేషు లైనారు కదా. ఎనిమిది సంవత్సరాల తరవాత మళ్ళీ జన్మిస్తానని ప్రకటించారు. సాయిబాబాకు సన్నిహితంగా వున్న కాకా దీక్షిత్ తదితర భక్తులు ఈ విషయం వ్రాతపూర్వకంగా తెలిపి వున్నారు. నా అనుభవ పూర్వకమైన అభిజ్ఞానం ముఖ్యకారణం. షిర్డీ బాబాలో పరిచయం వున్నవారు ఇప్పుడెవరూ జీవించి లేరు. కాబట్టి నా అనుభవమే నా అభిజ్ఞానమే ముఖ్యమైనసాక్షం.
నేను పదహారు సంవత్సరాల ప్రాయంలో వున్నప్పుడు, అంటే నలభైయేళ్ల క్రిందట, షిర్డీబాబాను అని ప్రకటన చేశాను. అప్పటికి దక్షిణ భారతదేశంలో ఈ ప్రాంతములో షిర్డీ బాబాను గురించి తెలియదు. వినికూడా వుండరుఈ ప్రకటనమే గట్టి నిదర్శనం. ప్రస్తుత పరిస్థితిలో మానవజాతిని దుష్టశక్తులు వినాశనం వైపు నడిపిస్తున్నట్లు మీరు వివరించారు. దీనిని బట్టి తప్పనిసరి అవుతుందా? వినాశకరమైన యుద్ధం ద్వారానే మీరు కృషిచేస్తున్న విముక్తి సాధ్యమవుతుందా?
మహాభారత యుద్ధం మాదిరి మరొక యుద్ధం వంటి విపత్తు రాకపూర్వమే దుష్ట శక్తులను తొలగించాలి. చిన్న యుద్ధాలు, సంఘర్షణలు అనివార్యం కావచ్చు. ప్రస్తుతపరిస్థితికి మహాభారత యుద్ధానికి తేడా యున్నది. కృష్ణ - పరమాత్ముని నిర్దేశము ప్రకారము అది జరిగింది. అర్జునుకి దివ్య సారధియై కృష్ణుడే యుద్ధరంగానికి నడిపించి దుర్మార్గులనుండి అసుర శక్తుల నుంచి ప్రపంచాన్ని రక్షించాడు. ఈనాడు దుర్మార్గం విస్తారంగా వ్యాపించియుంది.
ఇంకొక ప్రపంచయుద్ధం వస్తే పరమాణు శక్తులవల్ల మానవజాతి అంతా నిర్మూలనమై పోతుంది. అటువంటి విపత్తులను నివారించడానికి ప్రస్తుత అవతారం వచ్చింది. ఆగ్రహము, ద్వేషము, హింస, యుద్ధము నివారించి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి ఉద్దరించి ప్రపంచమును వినాశము నుండి కాపాడుటమేనా లక్ష్యం. దీనిని సాధించాలంటే వేదశాస్త్రముల ద్వారా భిన్న మతములు ప్రతిపాదించే ధర్మము ద్వారా మానవ జాతిని కర్మ బంధముల నుంచి విముక్తి చేసి మానవులలో సోదరభావము అభివృద్ధి చేయాలి.
అందుకే నేను ఎప్పుడే చెబుతూ ఉంటాను. విభిన్న మతము లను విలసిల్లనివ్వండి. భిన్న రాగములతో వివిధ భాషలలో భగవంతుని వైభవమును గానము చేయండి. అదే ఆదర్శంగా వుండాలి. మత విశ్వాసముల మధ్య ఉన్న భేదాలను మన్నించాలి. దివ్యత్వమనేజ్యోతికి భంగము కలిగించనంతవరకు భిన్న మతములను సత్యములుగా గుర్తించాలి.
(స.ప్ర.పు.12/13)
(చూ: దివ్య ప్రకటనలు)