మరల మరల రాదు మానవజన్మము
నరుడు నారాయణుడగునట్టి యిలను
చెవికిసోక, యింకేల ఈ వాగు నీకు
మేలుకొని సాయి పదసన్నిధిని చేరు!
(సా.పు.512)
మానవజన్మచాలా పవిత్రమైనటువంటిది. విశిష్టమైనటు వంటిది. విలువైనటువంటిది, జీవించ తగినటువంటిది. దేహ నిర్మాణం నందేకాక, మేధా శక్తి యందుకూడా మానవుడు మహావిశిష్టమైనటువంటి వాడు. కాని, ఇట్టి విశిష్టమైనటువంటి మానవత్వమునకు ఆయుః ప్రమాణము అతి స్వల్పముగా ఉన్నది. దీనిని ఎవ్వరూ మరువరానిది. ఈ మానవత్వమునకు అందించినటువంటి దివ్య మేధస్సును ఈ ఆయు:ప్రమాణము ఉన్నంతలోనే దీనిని సద్వినియోగపరచి సరియైన సార్థకత పొందాలి. మానవ శరీరము నీటి బుడగ వంటిది. ఏ నిముషములో ఈ నీటిబుడగ శిధిలమవుతుందో తెలియదు. కనుక, ఈ జీవితము ఉన్నంత లోపలనే మానవత్వమును సార్థకము గావించుకొనుటకై ప్రతివ్యక్తి ప్రయత్నించాలి.
(స.సా.జూ..1989 పు.142,143)
(చూ|| జన్మ, దేవుడు)