మధుర భావంబేది మనదేశమున కన్న
మాతృభావముకన్న మాన్యమేది.
ప్రాణంబు కంటెను మానంబు ఘనమగును!
మనదేశ నీతి నియమముల మరచి.
చేతికిచ్చిరి పరదేశ నీతులరసి!
(సా.పు.50)
మానము మౌనము రెండుగ
మానవునకు సుఖము నిచ్చు మన్నన దెచ్చున్ –
మానవ హీనున కెందును
కానగ గౌరవము నెచట కలదే యరయన్?
(సత్యసారం--పద్య రూపం పు 43)