మన భారతీయ సంస్కృతియందు పవిత్ర చరిత్రలలో భగవంతుని అతి ప్రేమతో మాధవుడని పిలుస్తూ వచ్చారు. మా అనగా మాయ ప్రకృతి. లక్ష్మిథవుడు అనగా పతి. అట్టివాడే పరమానంద మాధవుడు. అట్టి పరమాత్ముడే ఆనందమయుడు, ప్రకృతి పరతంత్రమైన జీవుడు పరమానందుడు కాలేడు. పరమాత్ముడు స్వతంత్రుడు. జీవుడు పరతంత్రుడు కనుకనే పరమానందము మానవునికి లభించాలంటే, లక్ష్మికి పతియైన వానిని పొందాలంటే పవిత్రమైన సాధన సలపాలి. పరమాత్మునిఎట్టి స్థానమందు బంధించవచ్చునో భారత భాగవతాలు చక్కగా చెప్తూవచ్చాయి.
(వే.ప్ర.పు.24)
(చూ॥ మాయ)