మానవసేవయే మాధవ సేవ

లోకమున మానవసేవే మాధవసేవ అనుచుందురు. అది నిజమే. ప్రజా సేవ పవిత్రమైన కార్యమైనను, సత్ వస్తువగుదైవములో కలియువరకు, గొప్ప సేవచే జనులకు శక్తి కలుగజాలదు. ఏ కార్యము చేసినను దైవచింతనను తోడుగైకొని, మానవునియందు మాధవ దివ్యత్వమున్నదని గ్రహించి, మానవసేవే మాధవసేవ అన్న, సత్యమగునుకాని, కేవలము అట్టి భావము. విశ్వాసమేలేక, వారివారి పేరు ప్రతిష్టలకు, సంఘ గౌరవములకు తత్పలితమును కోరి, మానవసేవ చేస్తూ, మానవసేవే మాధవసేవ అన్న, ఎట్లు ఆగును? మాధవచింతనే లేక మాధవసేవ ఎక్కడ ఉట్టిపడును. అవి బూటక మాటలు. అది నేనొప్పను.

 

దైవచింతనతో, సత్యమార్గముతో, ధర్మగుణముతో ఏ కార్యము చేసినను భగవత్ సేవగా భావించవలెను. పేరు, గౌరవము తత్ఫలిత ఆశకొరకు చేయు సేవ మాధవ సేవ అనబడదు. అట్టి నిరంతర ధ్యానపరులైన వారు ఇతరమైన కార్యము ఏమియున్ను చేయనక్కరలేదు. వారిప్రార్థనా ఫలమే లోకమును పావనము చేయును. అయితే నిరంతరము ధ్యేయాకారమగు ధ్యానములో నిలుచుటకు అందరికి సాధ్యమైన పనికాదు. కనక, అట్టి స్థితినిపొందుటకు శుద్ధాంత:కరణము కలిగి, సర్వసంకల్పములను నశింపజేసుకొనవలెను. అట్టి మనధర్మము కలిగిన సాధువులు స్వయముగా కనుగొనగలరు. అంతియే కాని, అందరికి సాధ్యముకాదు. కాదని ఊరక ఉండకూడదు. అది మీ మీ ప్రాప్తానుసారము, సాధనానుసారము లభించును. అంతవరకు ఆత్మవంచనలేక, ఎంతవరకు మనస్సు వృత్తి నిమితమై దైవాకార్యమగు స్థితిలో నిలుచునో అంతవరకు ధ్యాన జపములు చేయుచు. పరోపకారము చేస్తూ, తత్పలితమును ఆశించక లోకసేవలో కాలమును వినియోగించిన, ధన్యాత్ములు కాగలరు. అట్లు కానిచో, దేహముతో ప్రపంచ కర్మలు చేయకపోయినను, మనస్సు లోకమునపోయి అనేక కర్మలు చేయుచుండును. ఇట్టి వారు కర్మలు చేయకనే, కర్మమునకు కట్టుపడుదురు. దైవధ్యానము, సత్యమార్గములో నుండి మనస్సు బహిర్గత మగునపుడు, ప్రాణికోట్లకు ఉపకారమగు పనులు దేహేంద్రియములు చేసినను, మనస్సు దానిపై ఏకాగ్రతలో పడియుండుటచేత కర్మము చేసినను, కర్మము చేయని వాడగును. భగవద్గీత భావమంతయు దీనిపై ఆధారపడినది. మనస్సున పవిత్ర విషయమై పరిశ్రమ చేయని హృదయమే, దుర్గణములకు విశ్రాంతి పొందుటకు తగిన ఆనంద భవనముగా నుండును. ఈ విషయమును మోక్షమును కోరువారు, ఏకాగ్రతను పొందగోరువారు. పెద్దలు కాగోరువారు ముఖ్యముగా గ్రహించవలసిన ధర్మము. ఇట్టి ఆత్మజ్ఞానముకు పొందుటకు బ్రాహ్మణాది వర్ణములుగాని, సన్యాసాది ఆశ్రమములుగాని, యజ్ఞాది కర్మలున్ను, శాస్త్రాది కారణములున్ను కారణములు కావు. బ్రహ్మనిష్ట ఒక్కటే దీనికి కారణము.అందుకనే ఉపనిషత్ వచనముకూడా ఇట్లే నుడివినది:

 

నాశ్రమం కారణం ముక్తే: దర్శనాని సకారణం

తథైన సర్వకర్మాణి జ్ఞానమేవహి కారణమ్ ||

 

అట్టి పరబ్రహ్మమగు పరమాత్మ చింతనకు కాలనియమము లేదు; పుణ్యదేశమనియు, ప్రత్యేకస్థలమనియు లేదు, ఏ కాలమైనను, ఏ స్థలమున, ఏ సమయమున చిత్తము పరమాత్మయందు రమించునో అదే పుణ్యస్థలము, పుణ్యకాలము అగుచుండును.ఎచ్చటనున్న అచ్చటనే చింతన చేయుచుండ వచ్చును. అందుకనే మునుపీరీతిగా తెలియపర్చటము:

శ్లో: సకాల నియమోయత్ర నదేశస్య స్థలస్యచ

యత్రాస్య రమతే చిత్తం తత్ర ధ్యానే నకేవలమ్.

ఇట్టి సర్వనిష్ణా గరిష్టులై, సర్వసార సహితులై, అంత:కరణ శుద్ధి కల్గిన వారలవల్ల లోకము క్రమమునకు రాగలదు. అట్టివారి అనుగ్రహమునకు పాత్రలై, వారి ప్రార్థనల వలన దేశక్షమమునకోరి. ఉన్న బాధలను మరువగోట్ట ప్రయత్నించుటకు సర్వులూ ఈ నిమిషము నుండియే పరమాత్ముని ప్రార్ధనలు సల్పుదురుగాక! లోక క్షేమమును పొందుదురు గాక!

(ప్ర.వా.పు.86/88)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage