ఈ మహాశక్తి పూర్వ శరీరంలో ఉన్నపుడు 1918లో శరీరం వదలిపెట్టదలచిన సమయంలో కాకాసాహెబ్ దీక్షిత్ ని పిలిచి 8 సంవత్సరాలలో మరల అవతరిస్తానని చెప్పాను. తరువాత కొన్నాళ్ళకు అబ్దుల్ బాబాకు కూడా 7 సంవత్సరాలలో ఇది మరల మద్రాసు రాష్ట్రంలో కనిపిస్తుందని సమాచారం అందించారు. సమాధి చెందిన మూడు నెలల తరువాత కిర్కీ ఇంటి దగ్గర కనిపించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా "ఈ శరీరం వెళ్ళిపోయింది. అయినా నేను మరల వస్తాను" అని ప్రకటించాను. సమాధి చెందిన 6 నెలల తరువాత ద్వారకామాయి దగ్గర ఆనాడు నా దగ్గర ఉండే సత్తుగిన్నెతో సహా కనిపించాను. అప్పుడు దాస్ గణ్కి, మహల్సాపతికి కబురు చేయటం కూడా జరిగింది. 8 సంవత్సరాల బాలునిగా వస్తానని కాదు." ఆవిధంగా పొరపాటు పడటానికి కారణం కాకాసాహెబ్ తన జ్ఞాపకం మీద ఆధారపడి ఆ విషయాన్ని చాలాకాలం తరువాత పుస్తకంలో వ్రాసుకున్నాడు. ఏడు సంవత్సరాలకు అనేది కూడా సత్యమే. ఎలాగంటే పదినెలలూ గర్భంలో గడిపి 1926లోఈ శరీరం అవతరించింది. ఈ విధంగా కాకాసాహెబ్ కి చెప్పిన ఎనిమిది సంవత్సరాలు కూడా నిజమయింది.
(వ.61-62 పు.90)
నేను పూర్వ శరీరంలో ఉన్నప్పుడు "ఎనిమిది సంవత్సరాల తరువాత నేను మరల వస్తాను" అని చెప్పాను. కాని దీక్షిత్ నేను ఎనిమిది సంవత్సరాల బాలునిగా వస్తాననివ్రాసుకున్నాడు. అది పొరపాటు. 1918లో విజయ దశమి, రోజు ఆ శరీరం విడిచి పెట్టిన తరువాత ఆరు సంవత్సరాల దాకా చాలా మంది భక్తులకు స్పష్టమైన దర్శనము ఇస్తూనే వచ్చాను. ఒకసారి నేను అబ్దుల్బాబాకు కనిపించి "ఈ శరీరాన్ని పంపివేయటం జరిగింది. కాని నన్ను ఎవరు పంపివేయగలరు?" అని అన్నాను. నేను మరల అవతరించే విషయాన్ని అబ్దుల్ బాబాకి తెలియజేశాను. మీరిప్పుడు ఆయన ఈయనేనా? ఈయన ఆయనేనా? అని సందేహపడుతూ సమయాన్ని వృథా చేసుకొనకండి. మీకు తెలిసినంతవరకు నమ్మండి. మీరు పొందుతున్న ఆనందాన్ని మాత్రం ఎన్నడూ కాదనకండి. ఆ ఆనందాన్ని నిలువచేసుకోండి,
(వ 61-62 పు.103/104)