మందులు

ఈనాడు కొన్ని కొన్ని నూతనమైన ఔషధాలు అభివృద్రియౌతున్నాయి. నూతనమైన ఔషధములు Antibioticsతో చేరుతున్నాయి. రకమైన మందులు ఒక దానిని మరొకటిగా మార్పు చేస్తున్నాయి. ఎవరికైనా Tuberculosis వస్తే రోగమునకు సంబంధించినక్రిములను చంపటానికై Antibiotic ఔషధాన్ని ఇస్తారు. కాని, ఇది మంచి ఆరోగ్యమునిచ్చే Cells ను కూడా పాడు చేస్తున్నది. ఒక్క ఔషధమే మంచిని - చెడ్డను కూడా చేస్తుంది. విధంగా ఆరోగ్యవిషయములో ఒక మంచికోసమని మరొక చెడును కూడా చేస్తున్నాము. అంతేగాదు. నేడు పళ్ళ వృక్షాలకు కూరగాయల పంటలకు ఏమైనా పురుగు పట్టినప్పుడు వాటి పైన DDT ని ఉపయోగిస్తున్నాము. దీనివలన క్రిములు నశించడం మాత్రమే కాకుండా ఫలములలో DDT Power ప్రవేశించడం కూడా జరుగుతున్నది. విధంగా, మనం తినే కూర గాయలలో, పదార్థలలో DDT చేరుతున్నది. విషయము తెలిసిన వ్యక్తులు ఫలములను, కూరగాయలను కడిగి వండుకొంటారు. కాని, ఏమీ తెలియని బీదవారు వాటిని కొని ఆట్టే తింటారు. తద్వారా ఫలములపై కొట్టిన మందులు వారిలో చేరుతాయి. దానితో మరికొన్ని రోగాలుప్రారంభమైతాయి. కనుక రోగాలకు మూలకారణం మనఅశ్రద్ధనే.Laziness is rust and dust; Realization is best and rest - విషయాలు నాకెందుకులే" అని ఎవరికి వారు తప్పించుకొనిపోతున్నారు. ఇది మంచిది కాదు. "ఈనాడు వానికైనది రేపు నాకు కావచ్చును", అని మానవుడు గుర్తించి వర్తించాలి. అనగా మానవుడు తనయందు ప్రకృతిని, పరమాత్మను చూసే జ్ఞానమునుమొట్టమొదట గుర్తించాలి. ప్రకృతి యందు కూడా తనను పరమాత్మను చూడగలగాలి. విధమైన సమత్వమును అభివృద్ధి చేసుకోవాలి.

(.సా.మా.పు.61)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage