మంత్రము

తైత్తిరీయోపనిషత్తు కృష్ణయజుర్వేదము నందలి తైత్తిరీయశాఖ లోనిది. ఉపనిషత్తు అతిపూరాతనమైనది. దీని యందున్న ప్రతి ఒక్కటి మంత్రస్వరూపమే. మంత్రము అనగా కేవలం "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరి గాని, "ఓం నమఃశివాయ" అనే పంచాక్షరి గాని కాదు. మనన త్రాణ సమ్మిళితం ఇతి మంత్రః" మననం చేసి, మనస్సునందు స్థిరపరచుకొన్నదే మంత్రం. ఉపనిషత్తు నందు ప్రతి చిన్న పదము కూడా మంత్రస్వరూపకంగా ఆవిర్భవించి, వ్యాప్తి నొందినవి. "సత్యం వద - ధర్మం చర", "సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ" మున్నగు చిన్న చిన్న పదములే మంత్రస్వరూపాన్ని ధరించి, మానవునకు బోధల నందించి ఆనందాన్ని చేకూర్చుతున్నాయి.

 

ఉపనిషత్తు నందు గల మరొక విచిత్రమైన రహస్యమేమిటంటే - సాధారణంగా ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క స్థాయి వారికే సమన్వయమై ఉన్నవి. కాని, ఈతైత్తిరీ యోపనిషత్తు నందలి దివ్యబోధలు బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్థ, సన్యాసాశ్రమాలకు చెందిన వారందరికీ సమత్వంగా సమన్వయమై ఉన్నవి.

(.సా..91 పు.297/298)

 

మీరేదో ఒక మంత్రమును ఉచ్చరించాలి. తరువాత దానిని మననం చేయాలి. మననం చేసినదానిని ప్రాణశక్తిగా మార్చుకోవాలి.

మనన స్మరణ సమ్మిళితం మంత్రమ్".

ప్రతిమాటకూడను ఒక మంత్రమే. ప్రతి శబ్దముకూడను ఓంకారమే. సర్వత్రా పరమాత్మయే.

(.రాపు. 297)

 

విధింప బడిన అర్థాన్ని వివరించి చెప్పేది మంత్రము. మననము చేయడానికి హేతవయ్యేది మంత్రం అని కూడా అనవచ్చును. "మం మననము త్రా త్రాణశక్తి ఏతావాతా - మనవత్రాణ సమ్మిళితము మంత్రము. యజ్ఞయాగాదికర్మలు చేస్తూ వాటి స్వరూపాన్ని స్మరించటం యాజ్ఞికలు ప్రత్యేకంగా ఉచ్ఛరించే శబ్దాలు మంత్రాలు. అయితే ఈనాడు మంత్రాలను వల్లెవేస్తున్నారు. పారాయణం చేస్తున్నారు అర్థాలు తెలియకుండా అలాచేస్తే పారాయణముల ప్రయోజనముండదు. అర్థజ్ఞానంతో ఠించిన సంపూర్ణ ప్రయోజనము కలదు.

(లీ.వాపు 9)

(చూ॥ అధర్వణవేదము. ఋగ్వేదము. నేను, పృశ్ని, యజార్వేదము, వేదము, శాఖలు)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage