ఆనాడు అశ్వత్థామ, అర్జునుడు ఇరువురు యుద్ధము చేసినపుడు వారు విడిచిన బ్రహ్మాస్త్రము, పాశుపతాస్త్రముల ప్రభావమే గర్భములో ఉన్న శిశువు మరణించుటకు కారణము. ఈనాడు ఆటంబాంబులో హైడ్రోజిన్ బాంబులో వేసేటప్పటికి ఎక్కడో ఉన్న గర్భములు నశించిపోతున్నాయని అనుకుంటున్నారు. ఇది ఈనాడుక్రొత్తగా కనిపెట్టినది కాదు. పాతవాటిని ఈనాడు ప్రదర్శిస్తున్నారు. ఈనాడు యంత్రశక్తి ఆనాడు మంత్రశక్తి ఆనాడు ఒక అస్త్రమును ప్రయోగించినారంటే తిరిగి దానిని ఉపసంహరించుకొనే శక్తి వారికి ఉండేది. నేడు ప్రయోగమేకాని ఉపసంహారము లేదు.
(ని.పు.112)