మంచికాలము, పదవులు, మంచి బ్రతుకు
కోరుచుందురు మనుజాలు:కోరబోరు
మంచి బుద్ధులు జ్ఞానంబు, మంచినడత
ఇంతకన్నను వేరెద్ది ఎఱుకపరతు?
సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా!
(స.సా.జూ.పు. 106)
మంచి నడతలు
విమలభావoబు .గలుగుటే విద్య యగును
సరసగుణములు గలుగుటే చదువులగును
సహజ భావము కలుగుటేసరస మగును
మంచినడతలు ఉన్ననే మానవుండు
(శ్రీవాణి మే 2021 పు 26)